15 దిగ్గ‌జ బ్యాంకులు అందిస్తున్న‌ గృహ‌రుణ వ‌డ్డీరేట్లు..

నివాసం కోసం ఇళ్లు కొనుగోలు చేయాల‌నుకునేవారు గృహ రుణం తీసుకుని ఇళ్లు కొనుగోలు చేయ‌డం మంచిది

15 దిగ్గ‌జ బ్యాంకులు అందిస్తున్న‌ గృహ‌రుణ వ‌డ్డీరేట్లు..

సాధార‌ణంగా మ‌నం తీసుకునే రుణాల‌న్నింటిలోకి గృహ‌రుణం అతిపెద్ద‌ది, కేవలం ప‌రిమాణంలో మాత్ర‌మే కాకుండా కాల‌వ్య‌వ‌ధిలోనూ ఇదే పెద్ద‌ది. ఈ త‌ర‌హా రుణాల‌కు కాల‌వ్య‌వ‌ధి క‌నీసం 15 సంవ‌త్స‌రాలు లేదా అంత‌కంటే ఎక్కువే ఉంటుంది. రుణం తిరిగి చెల్లించే స‌రికి, తీసుకున్న రుణం కంటే, వ‌డ్డీ నిమిత్తం చెల్లించే మొత్తం రెట్టింపు అవుతుంది. అయితే ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న రుణాల‌లో చౌక‌గా ల‌భించేది కూడా గృహ రుణ‌మే. గృహం కొనుగోలు చేయాల‌నుకునే సామ‌న్య‌ల‌కు ఉన్న ఏకైక మార్గం ఇది. దీర్ఘ‌కాలంలో స్థిరాస్తిని స‌మ‌కూర్చుకునేందుకు వీలుక‌ల్పిస్తుంది కాబ‌ట్టి దీనిని మంచి రుణంగా నిపుణులు అభివ‌ర్ణిస్తున్నారు.

ఇళ్ళు కొనుగోలు చేయాలా? లేదా అద్దెకు తీసుకోవాలా? అనేది చాలా మందికి ఎదుర‌య్యే ప్ర‌శ్న‌. ప్ర‌త్యేకించి ప్ర‌తీ నెల చెల్లించే అద్దె ఎక్కువ‌గా ఉంద‌ని భావించేవారు ఈ విధంగా ఆలోచిస్తారు. అయితే ఇక్క‌డ‌ ప‌రిగ‌ణించాల్సిన ముఖ్య‌మైన అంశం నివ‌సించేందుకు ఇళ్లు కొనుగోలు చేయాల‌నుకుంటున్నారా? లేదా పెట్టుబ‌డి నిమిత్త‌మా? అనేది. ఒక‌వేళ మీరు నివ‌సించేందుకు కొనుగోలు చేయాల‌నుకుంటే గృహ రుణం తీసుకుని ఇళ్లు కొనుగోలు చేయ‌డం మంచిదే. చాలా మంది ఇళ్ళు కొనుగోలు చేసేందుకు సందేహించ‌డానికి గ‌ల మ‌రోకార‌ణం వాటి నిర్మాణం ప‌నులు స‌రైన స‌మ‌యానికి కావ‌డం లేదు. దీంతో రుణం తీసుకుని కొనుగోలు చేసే వారు న‌ష్ట‌పోతున్నారు. అందువ‌ల్ల నిర్మాణంలో ఉన్న ఇంటి కంటే సిద్ధంగా ఉన్న ఇంటి కొనుగోలు చేస్తే మంచిద‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ఒక‌వేళ పెట్టుబ‌డి కోసం ఇళ్లు కొనుగోలు చేయాలనుకుంటే, ఆస్తి ఇచ్చే వార్షిక రాబ‌డి, అందులో ఉన్న రిస్క్ మొద‌లైన అంశాల‌ను ఇత‌ర పెట్టుబ‌డులు వాటి నుంచి వ‌చ్చే రాబ‌డితో పోల్చి చూడ‌డం మంచిది. నివాసం కోసం ఇంటిని కొనుగోలు చేయాల‌నుకునే వారికి ఇది స‌రైన స‌మ‌య‌మే. ఇంటి కొనుగోలు కోసం బ్యాంకులు గృహ రుణాల‌పై ఆఫ‌ర్ చేసే వ‌డ్డీ రేట్ల‌ను ప‌రిశీలిస్తే…
రుణం మొత్తం రూ.30 ల‌క్ష‌లు, కాల‌ప‌రిమితి 20 సంవ‌త్స‌రాలు అయితే…
hl.jpg

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Source:(Livemint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly