స‌ర‌ళీకృత చెల్లింపు ప‌థ‌కం (ఎల్ఆర్ఎస్) ఏంటి? ఎందుకు?

ఈ న‌గ‌దుతో విదేశాల్లో షేర్లు, డెట్ ప‌థకాలు స్థిరాస్తులను కొనడానికి ఉపయోగించవచ్చు

స‌ర‌ళీకృత చెల్లింపు ప‌థ‌కం (ఎల్ఆర్ఎస్) ఏంటి? ఎందుకు?

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) స‌రళీకృత చెల్లింపుల ప‌థ‌కం (ఎల్ఆర్ఎస్) భార‌తీయులు ఒక‌ ఆర్థిక సంవత్సరంలో కొంత మొత్తాన్ని పెట్టుబడులు లేదా ఇత‌ర‌ వ్యయాల‌ కోసం మరొక దేశానికి పంపించడానికి అనుమతిస్తుంది.

ప్రస్తుతం ఉన్న నిబంధ‌న‌ల ప్ర‌కారం ఒక ఆర్థిక సంవ‌త్స‌రానికి 250,000 డాల‌ర్ల వ‌ర‌కు పంపించవ‌చ్చు. దీనిని వ్య‌క్తిగ‌త లేదా వ్యాపారం కోసం, వైద్య చికిత్స‌, విద్య‌, బ‌హుమ‌తులు, డొనేష‌న్లు, మిత్రులు, బందువుల కోసం ఖ‌ర్చు చేసుకోవ‌చ్చు. అదేవిధంగా ఈ డ‌బ్బుతో విదేశాల్లో షేర్లు, డెట్ ప‌థ‌కాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయ‌వ‌చ్చు. విదేశీ బ్యాంకుల్లో ఖాతాల‌ను ప్రారంభించి అందులో డిపాజిట్ చేసుకోవ‌చ్చు. అయితే విదేశీ మారక నిర్వహణ (కరెంట్ అకౌంట్ లావాదేవీలు) నిబంధనలు 2000 షెడ్యూల్ II ప్ర‌కారం , విదేశీ మారకద్రవ్యం కొనడం, అమ్మడం, లాటరీ టిక్కెట్లు, స్వీప్ స్టేక్స్‌, నిషేదిత‌ మ్యాగజైన్స్ వంటివి ఇతర వస్తువులను కొనుగోలు చేయ‌కూడ‌దు.

ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌టీఎఫ్‌) స‌హాయ నిరాకర‌ణ దేశాలుగా గుర్తించిన దేశాలకు మీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చెల్లింపులు చేయలేరు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly