పన్ను వాపసు పొందడానికి బ్యాంకు ఖాతా, పాన్ అనుసంధానం తప్పనిసరి

ఇక నుంచి ఆదాయపు పన్ను వాపసు పన్ను చెల్లింపుదారులకు తమ బ్యాంక్ ఖాతాకు నేరుగా ఒక మాత్రమే తిరిగి జమచేయనున్నారు.

పన్ను వాపసు పొందడానికి బ్యాంకు ఖాతా, పాన్ అనుసంధానం తప్పనిసరి

ఈ సంవత్సరం (అస్సెస్మెంట్ ఇయర్ ) నుంచి ఆదాయపు పన్ను శాఖ కొత్త నిబంధనను తీసుకువచ్చింది. ఆదాయపు పన్ను రిటర్నులను (ఐటిఆర్) దాఖలు చేయడానికి మీ పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) ను ఆధార్ కార్డుతో లింక్ చేయాల్సిన అవసరం ఉంది . అది లేకుండా మీరు ఎటువంటి పన్ను వాపసు పొందలేరు.

ఇప్పుడు ఆదాయపు పన్ను విభాగం ఈ-మోడ్ ద్వారా మాత్రమే ఆదాయపు పన్ను వాపసు ఇవ్వడం ప్రారంభించింది. గతంలో స్పీడ్ పోస్ట్ ద్వారా పన్ను వాపసు చెక్కులను పంపే విధానం నిలిపివేస్తున్నారు. ఐటిఆర్ ఫైలర్లకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే కొన్నిసార్లు చెక్కులను పంపే విధానంలో ఆలస్యం అవుతుంది. అయితే గత కొన్నేళ్లుగా ఇ-వాపసు పంపుతున్నారు. గత కొన్ని నెలల్లోనే చెక్కులు ఇచ్చే పద్ధతి పూర్తిగా ఆగిపోయింది.

ఇక నుంచి ఆదాయపు పన్ను వాపసు పన్ను చెల్లింపుదారులకు తమ బ్యాంక్ ఖాతాకు నేరుగా ఒక మాత్రమే తిరిగి జమచేయనున్నారు. దీనికి బ్యాంక్ ఖాతా మీ పాన్‌తో అనుసంధానించబడాలి. అనుసంధానం పూర్తయితే, మీ బ్యాంకు ఖాతాలోకి వేగంగా, సురక్షితంగా పన్ను వాపసు ఇస్తామని ఆదాయపు పన్ను శాఖ హామీ ఇచ్చింది.

పన్ను వాపసు పొందడానికి బ్యాంకు ఖాతా పొదుపు, కరెంట్, నగదు లేదా ఓడీ ఖాతా కావచ్చు. కాని పాన్ అనుసంధానం తప్పనిసరి. బ్యాంక్ ఖాతాను పాన్‌తో లింక్ చేసేందుకు పాన్ కార్డు కాపీని మీ బ్యాంక్ బ్రాంచ్‌ లో ఇవ్వడం ద్వారా ప్రక్రియ పూర్తిచేయవచ్చు. బ్యాంక్ వారి రికార్డులలో పాన్ ఉండి లింక్ చేయబడాలి. ఒకవేళ అనుసంధానం జరగకపోతే, పన్ను చెల్లింపుదారులు బ్యాంకును సంప్రదించాలని ఆదాయపు పన్ను శాఖ కోరింది.

పాన్-బ్యాంక్ ఖాతా అనుసంధానం జరిగిందో లేదో తనిఖీ చేయడానికి, ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లి, ప్రొఫైల్ సెట్టింగ్ విభాగంలో క్లిక్ చేసి, ఆపై "ప్రీ వాలిడేటె యువర్ బ్యాంకు అకౌంట్ " కు వెళ్లండి, అక్కడ మీ బ్యాంక్ ఖాతాలలో ఏదైనా ఇప్పటికే ధ్రువీకరించబడిందా లేదా అని మీరు తనిఖీ చేయవచ్చు. ధ్రువీకరణ పూర్తి చేయకపోతే, మీరు బ్యాంక్ ఖాతాను జోడించవచ్చు. "స్టేటస్ " కాలమ్ మీ బ్యాంక్ ఖాతా ధ్రువీకరించబడిందో లేదో మీకు తెలియజేస్తుంది.

మీ బ్యాంక్ ఖాతాను అనుసంధానం జరిగిందో లేదో తనిఖీ చేయడానికి మీ బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ పేరు ఖాతాకు లింక్ చేసిన మొబైల్ నంబర్ ఇవ్వాలి. ఇ-ఫైలింగ్ పోర్టల్ మీకు పన్ను వాపసు జమ కావాలని కోరుకునే బ్యాంకు ఖాతాను ఎన్నుకునే అవకాశాన్ని కూడా ఇస్తుంది.

బ్యాంకు ఖాతాతో పాన్‌ అనుసంధానం పూర్తికాని వారు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పాన్ లింకింగ్ చేయవచ్చు. మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాకు లాగిన్ అవ్వండి. వెబ్‌సైట్‌లోని ఎంపికల పరిధి నుండి “సర్వీస్ రిక్వెస్ట్ ” ఎంపికపై క్లిక్ చేయండి.“పాన్ కార్డ్ అప్‌డేషన్” ఎంపికను ఎంచుకోండి.ఇప్పుడు మీ పాన్ కార్డులో పేర్కొన్న విధంగా మీ పాన్, పుట్టిన తేదీ, బ్యాంకులో మీ రిజిస్టర్డ్ ఇ-మెయిల్ చిరునామాను నమోదు చేయండి. మీరు నమోదు చేసిన వివరాలను తిరిగి తనిఖీ చేసిన తర్వాత బటన్‌ను క్లిక్ చేయండి. మీ పాన్ కొన్ని రోజుల్లో మీ బ్యాంక్ ఖాతాతో లింక్ అవుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly