లిక్విడ్ ఫండ్లు మేలా? సేవింగ్స్ బ్యాంకు ఖాతా మేలా?

అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో వీలుగా కొంత డ‌బ్బు ఉంచుకోవ‌డం మంచిది

లిక్విడ్ ఫండ్లు మేలా? సేవింగ్స్ బ్యాంకు ఖాతా మేలా?

ఈ క‌థ‌నంలో లిక్విడ్ ఫండ్లు, సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో ఉంచే డ‌బ్బు పై ఏవిధంగా రాబ‌డి వ‌స్తుంది. ప‌న్నువిధానం త‌దిత‌ర విష‌యాల‌ను తెలుసుకుందాం. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో వినియోగించుకునేందుకు వీలుగా కొంత డ‌బ్బు అత్య‌వ‌స‌ర నిధి ఉంచుకోవ‌డం మంచిది. దీనికి చాలా మంది సేవింగ్సు బ్యాంక్ ఖాతాలో కొంత డబ్బు దాచుకుని అవ‌స‌ర‌మైన‌ప్పుడు వాడుకుంటారు. దీనికి బ‌దులుగా కొంత లిక్విడ్ ఫండ్లో మ‌దుపు చేయడం ద్వారా అటు ఆదాయం ఇటు అవ‌స‌రం రెండూ తీరే అవ‌కాశం ఉంటుంది.. సేవింగ్సు బ్యాంకు ఖాతా లో అయితే 4 శాతం (అంచ‌నా) వ‌డ్డీరేటు ఉంటుంది. అదే లిక్విడ్ ఫండ్ల‌లో అయితే దాదాపు 6 శాతం (అంచ‌నా) ఉంటుంది. సాధార‌ణంగా లిక్విడ్ ఫండ్ల‌లో మ‌దుపు స్వ‌ల్ప‌కాలం పాటు చేస్తుంటారు.

సేవింగ్స్ బ్యాంకుఖాతా, లిక్విడ్ ఫండ్లు - రాబ‌డి ఉదాహ‌ర‌ణ ద్వారా తెలుసుకుందాం.
రూ. రెండు ల‌క్ష‌లు పెట్టుబ‌డి లిక్విడ్ ఫండ్లు, సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో పెట్టుబ‌డి గా ఉంచ‌డం ద్వారా ఏవిధంగా రాబ‌డి వ‌స్తుందో కింది ప‌ట్టిక‌ లో వివ‌రంగా ఉంది. పెట్టుబ‌డి రూ.2,00,000; సేవింగ్స్ బ్యాంకుఖాతాలో రాబ‌డి 4 శాతం; లిక్విడ్ ఫండ్లలో రాబ‌డి 6 శాతం. సేవింగ్స్ బ్యాంకుఖాతాలో పెట్టుబ‌డి, రాబ‌డి, ప‌న్ను చెల్లింపు మొత్తం వివ‌రించే ఉదాహ‌ర‌ణ ప‌ట్టిక‌ 1 నెల‌, 3 నెల‌లు, 6 నెల‌ల,సంవ‌త్స‌రం,18 నెల‌లు, 2 సంవ‌త్స‌రాలు కాల‌ప‌రిమితితో సేవింగ్స్ బ్యాంకు నుంచి వ‌చ్చిన‌ రాబ‌డికి చెల్లించాల్సిన ప‌న్ను వారి స్లాబుల వారీగా కింది ప‌ట్టిక‌ లో ఉంది.

l1.png

లిక్విడ్ ఫండ్లలో పెట్టుబ‌డి, రాబ‌డి, ప‌న్ను చెల్లింపు మొత్తం వివ‌రించే ఉదాహ‌ర‌ణ ప‌ట్టిక‌
1 నెల‌, 3 నెల‌లు, 6 నెల‌ల, సంవ‌త్స‌రం,18 నెల‌లు, 2 సంవ‌త్స‌రాలు కాల‌ప‌రిమితితో, లిక్విడ్ పండ్ల నుంచి వ‌చ్చిన‌ రాబ‌డికి చెల్లించాల్సిన ప‌న్ను వారి స్లాబుల వారీగా కింది ప‌ట్టిక‌ లో ఉంది.

l2.png

స్వ‌ల్ప‌కాలంలో రెండింటిలోనూ ప‌న్ను విధానం ఒక‌టే. స్థిరాదాయ పెట్టుబ‌డి సాధ‌నాల్లో మూడు సంవ‌త్స‌రాల లోపు వ‌చ్చే స్వ‌ల్ప‌కాల‌ మూల‌ధ‌న ఆదాయం పై వ్య‌క్తిగ‌త స్లాబ్ రేటు ప్రకారం ప‌న్ను చెల్లించాలి. సేవింగ్సు బ్యాంకు ఖాతా ద్వారా వ‌చ్చేఆదాయం మూడేళ్ల పాటు లిక్విడ్ ఫండ్ల‌లో మ‌దుపుచేయడం కంటే డెట్ ఫండ్ల‌లో మ‌దుపుచేయ‌డం మంచిది. ఎందుకంటే సాధారణంగా లిక్విడ్ ఫండ్ల‌తో పోలిస్తే డెట్ ఫండ్లలో రాబ‌డి ఎక్కువ ఉంటుంది. కాబ‌ట్టి లిక్విడ్ ఫండ్ల‌లో స్వ‌ల్ప‌కాలం మ‌దుపు చేయ‌డం మంచిది. లిక్విడ్ ఫండ్లలో స్వ‌ల్ప‌కాలం అంటే ఆరు నెల‌ల నుంచి సంత్స‌రం , రెండేళ్లు, పెట్టుబ‌డి చేసే వారికి ప‌న్ను రెండింటిలోనూ ప‌న్ను విధానం ఒక‌టే అయినా వ‌చ్చే రాబ‌డిలో కొంత మార్పు ఉంటుంది. గ‌మ‌నించాల్సిన విష‌యాలు - పై ఉదాహ‌ర‌ణ ద్వారా లిక్విడ్ ఫండ్లు స్వ‌ల్ప‌కాలంలో సేవింగ్స్ ఖాతాలో ఉంచ‌డం కంటే మంచి రాబ‌డి ఇస్తాయ‌ని తెలుస్తోంది. ఇక్క‌డ ప‌న్ను విధానం రెండింటికీ ఒక‌టే కాబ‌ట్టి వ‌చ్చే రాబ‌డి పై ఆధార‌ప‌డి నిక‌ర రాబ‌డి ఉంటుంది.

మ‌రీ త‌క్కువ స‌మ‌యానికి లిక్విడ్ ఫండ్ల‌లో మ‌దుపు చేయ‌డం ద్వారా మార్పు స్వ‌ల్పంగానే ఉన్న‌ప్ప‌టికీ దీర్ఘ‌కాలంలో ప‌న్ను త‌ర్వాత రాబ‌డి లో తేడా ఉంటుంది. కాల‌ప‌రిమితి పెరుగుతున్న కొల‌దీ ఈ తేడాను స్ప‌ష్టంగా చూడ‌వ‌చ్చు. ఒక నెల కాల‌వ్య‌వ‌ధికి ప‌న్ను త‌ర్వాత వ‌చ్చిన రాబ‌డి స్లాబుల వారీగా ప‌న్నుస్లాబు 5 శాతంలో ఉన్న మ‌దుర్ల‌కు ఒక నెల కాల‌వ్య‌వ‌ధిలో ప‌న్ను త‌ర్వాత వ‌చ్చిన రాబ‌డి లిక్విడ్ ఫండ్ల‌లో రూ.950 సేవింగ్సు బ్యాంకు ఖాతాలో రూ. 633 స్వ‌ల్పంగా ఉంది. 20 శాతం ప‌న్నుస్లాబు లో లిక్విడ్ ఫండ్ల లో రూ. 800 సేవింగ్సు బ్యాంకు ఖాతాలో రూ. 533 గా ఉంది. 30 శాతంలో ఉన్న వారికి ప‌న్ను త‌ర్వాత వ‌చ్చిన రాబ‌డి లిక్విడ్ ఫండ్లలో రూ. 700 సేవింగ్సు బ్యాంకు ఖాతాలోరూ. 467 గా ఉంది. ఏడాది కాల‌వ్య‌వ‌ధికి ప‌న్నుత‌ర్వాత వ‌చ్చిన రాబ‌డి స్లాబుల వారీగా - ప‌న్నుస్లాబు 5 శాతంలో ఉన్న వారికి ఏడాది కాల‌వ్య‌వ‌ధికి లిక్విడ్ ఫండ్లలో రూ. 11,400 సేవింగ్సు బ్యాంకు ఖాతాలో ఉన్న వారికి రూ.7,600 గా ఉంది. 20 శాతం ప‌న్నుస్లాబులో ప‌న్ను త‌ర్వాత రాబ‌డి లిక్విడ్ ఫండ్ల లో రూ.9,600 సేవింగ్సు బ్యాంకు ఖాతాలో రూ.6,400. స్లాబు 30 శాతంలో ప‌న్ను త‌ర్వాత వ‌చ్చిన రాబ‌డి లిక్విడ్ ఫండ్ల లో రూ.8,400 సేవింగ్సు బ్యాంకు ఖాతాలో రూ. 5,600 గా ఉంది.

చివ‌ర‌గా:
మ‌దుప‌ర్లు ఎంత కాలం పెట్టుబ‌డి ఉంచుతార‌నే విష‌యం ఆధారంగా ఈ రెండు మార్గాల్లో ఒక దాన్ని ఎంచుకోవ‌డం మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly