ఈటీఎఫ్‌లో పెట్టుబ‌డులు పెడుతున్నారా?

ఇండెక్స్ ఫండ్ రాబడికి, అది ఎంచుకున్న ఇండెక్స్ కు మధ్య ఉన్న వ్యత్యాసాన్నే ట్రాకింగ్ ఎర్రర్ అంటారు

ఈటీఎఫ్‌లో పెట్టుబ‌డులు పెడుతున్నారా?

లార్జిక్యాప్ ఫండ్స్ వాటి బెంచ్ మార్క్ ను మించి రాబడి ఇవ్వలేని తరుణంలో , ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటిఎఫ్ లకు ప్రాధాన్యం పెరిగింది. వేల్యూ రీసెర్చ్ , యాంఫీల ప్రకారం నవంబర్ 2013 నాటికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ల మొత్తం ఆస్తుల విలువలో 1 శాతం కంటే తక్కువగా ఉన్న ఇండెక్స్ ఫండ్స్, ఈటిఎఫ్ ల ప్రమాణం, నవంబర్ 2019 నాటికి 20 శాతం వరకు పెరిగింది.
ప్రస్తుతం ఇండెక్స్ ఫండ్స్, ఈటిఎఫ్ ఫండ్ ల సంఖ్య 89 వుండగా, ఇది నవంబర్, 2013 లో 40 గా ఉంది. ఈ ఫండ్స్ అవి ఎంచుకున్న ఇండెక్స్ ను అనుకరించడం వలన, వీటి వ్య‌య నిష్ప‌త్తి చాలా తక్కువగాను, తక్కువ రిస్క్ కలిగి ఉంటాయి .

ఎన్ఎస్ఈ , సెన్సెక్స్ లలో అధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ గలిగిన స్టాక్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి స్టాక్స్ ఇండెక్స్ ను ప్రభావితం చేస్తాయి. ఎన్ఎస్ఈ ప్రకారం, నిఫ్టీ లో ఐదు స్టాక్ ల ప‌రిమాణం నవంబర్ 2018 లో 39 శాతం ఉండగా , అది నవంబర్ 2019 నాటికి 42 శాతానికి పెరిగింది. అలాగే రంగాల‌ ప్రభావం కూడా ఉంటుంది. ఫైనాన్సియల్ సర్వీసెస్ సెక్టార్ నిఫ్టీ లో 41 శాతం ఉంటే , సెన్సెక్స్ లో 46 శాతంగా ఉంది. కొన్ని స్టాక్స్ లేదా కొన్ని సెక్టార్ ల ప్రభావం ఉండటం రిస్క్ కూడా.

అలాగే, రాబడి కూడా అధికంగా పొందే అవకాశం ఉంటుంది. లార్జిక్యాప్ ఇండెక్స్ ను చూసినట్లయితే కొన్ని స్టాక్స్ ల పనితీరు వలన , మొత్తం ఇండెక్స్ లాభపడుతుంది . అలాగే, ఇవే స్టాక్స్ వలన ఇండెక్స్ నష్టపోయే అవకాశం ఉంది. అందువలన, పాసివ్ ఫండ్స్ అయిన ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్ ల పనితీరుపై ప్రభావం ఉంటుంది.

ఇండెక్స్ ఫండ్ రాబడికి, అది ఎంచుకున్న ఇండెక్స్ కు మధ్య ఉన్న వ్యత్యాసాన్నే ట్రాకింగ్ ఎర్రర్ అంటారు. వేల్యూ రీసెర్చ్ ప్రకారం గత మూడు ఏళ్లలో ఈ వ్యత్యాసం ఇండెక్స్ ఫండ్స్ లలో, ఈ టి ఎఫ్ లలో 0.02 శాతం నుంచి 3.55 శాతం వరకు ఉంటుంది.

ఫండ్ నిర్వ‌హ‌ణ‌ ఖర్చులు, సెక్యూరిటీస్ ట్రాన్సక్షన్ ట్యాక్స్, బ్రోకరేజ్ వ్య‌యాలు , డివిడెండ్ చెల్లింపు, వంటి కారణాల వలన ఈ ట్రాకింగ్ ఎర్రర్ ఏర్పడుతుంది అని ప్రతీక్ ఓస్వాల్ , మోతిలాల్ ఓస్వాల్ అసెట్ మేనేజ్మెంట్ తెలిపారు. ప్రపంచ ఇతర దేశాలలో కంటే భార‌త్‌లో ఈ ట్రాకింగ్ ఎర్రర్ ఎక్కువ.

మంచి పనితీరు కనిపిస్తున్న ఈటిఎఫ్ లలో ఈ వ్యత్యాసం 0.01 నుంచి 0.3 శాతం వరకు ఉంటుందని విశాల్ ధావన్ , ప్లాన్ ఎహెడ్ వెల్త్ అడ్వైజర్ తెలిపారు. ఈటిఎఫ్ లలో నగదు లభ్యత (లిక్విడిటీ) ఒక సమస్య. ఎందుకంటే ఎక్స్ చేంజ్ లలోనే వీటి కొనుగోలు, అమ్మకాలు జరుగుతాయి కాబట్టి. అదే ఇండెక్స్ ఫండ్స్ లో ఈ సమస్య ఉండదు. లభ్యతను బట్టి ఒక్కొక్కసారి ఇవి వాటి ఎన్ఏవి కన్నా ప్రీమియం కి గానీ, డిస్కౌంట్ కిగానీ ఉండొచ్చు.

అయితే డి ఎస్ పీ ఈక్వల్ నిఫ్టీ 50 ఫండ్ , ప్రిన్సిపాల్ నిఫ్టీ 100 ఈక్వల్ వెయిట్ , సుందరం స్మార్ట్ నిఫ్టీ 100 ఈక్వల్ వెయిట్ ఫండ్ లాంటి వాటిలో అన్ని స్టాక్ లకు సమాన వెయిట్ ఉంటుంది. ఇవి ఇండెక్స్‌లోని అన్ని స్టాక్‌లకు సమానంగా కేటాయించే సూచీల‌ను ట్రాక్ చేస్తాయి.

యాక్టివ్, స్థిర వ్యూహాల‌ను అనుస‌రించాల‌ని నిపుణులు చెప్తున్నారు. లార్జ్ క్యాప్‌లో స్థిర పెట్టుబ‌డుల ప‌నితీరును గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా అంచ‌నా వేసి ఈటీఎఫ్ లేదా ఇండెక్స్ ఫండ్ల‌లో 50 శాతం కంటే ఎక్కువ పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ ఫండ్ల‌లో అయితే యాక్టివ్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌డం మంచిద‌ని చెప్తున్నారు.

మీ రిస్క్ సామ‌ర్థ్యాన్ని, రాబ‌డులు బ‌ట్టి పోర్ట్‌ఫోలియోలో యాక్టివ్, స్థిర ఫండ్ల‌కు కేటాయించాలి. మీకు అవ‌గాహ‌న లేక‌పోతే ఆర్థిక ప్ర‌ణాళికాదారుడిని సంప్ర‌దించాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly