ముంద‌స్తు ఉపసంహ‌ర‌ణ కంటే రుణం మేలు

ఎఫ్‌డీపై రుణం తీసుకునేందుకు దాఖ‌లు చేసిన త‌ర్వాత‌ రుణం 4-6 పని దినాలలో ప్రాసెస్ జ‌రుగుతుంది

ముంద‌స్తు ఉపసంహ‌ర‌ణ కంటే రుణం మేలు

ప్ర‌స్తుతం దేశం ఉన్న ఆర్థిక స్థితిలో ప్ర‌భుత్వం వ్య‌వ‌స్థ‌లోకి లిక్విడిటీని పెంచేందుకు అన్ని మార్గాల‌ను అన్వేషిస్తోంది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్‌సీ), నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియ‌ల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) కూడా త‌మ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీముల్లోకి లిక్విడిటీ ఫీచ‌ర్‌ను తీసుకొచ్చాయి.

కంపెనీలు ఎఫ్‌డీల‌పై మెచ్యూరిటీ పూర్త‌వ‌క‌ముందే విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తాయి. ఇందులో పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ ఉండ‌దు. ముందస్తు ఉప‌సంహ‌ర‌ణ చేసుకుంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ పూర్తిగా ర‌ద్ద‌వుతుంది. మిగ‌తా కాలానికి జ‌రిమానా వ‌ర్తిస్తుంది.

ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్య‌క్తి రూ.10 ల‌క్ష‌ల ఎఫ్‌డీ ఐదేళ్ల కాలానికి తీసుకుంటే, అంటే 2017 నుంచి 2022 వ‌ర‌కు అనుకుందాం. 2020 లో అత‌డు ఎఫ్‌డీ మూసివేయాల‌నుకంటే జ‌రిమానా ఛార్జీల కింద మూడేళ్ల‌కు సంబంధించి ఏడాదికి 1- 2 శాతం వ‌ర‌కు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తిగా అవ‌స‌రం లేక‌పోయిన‌ప్ప‌టికీ ముంద‌స్తు ఉప‌సంహ‌ర‌ణ చేస్తే ఎఫ్‌డీ మొత్తం ర‌ద్దు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎఫ్‌డీల‌పై రుణం
అన్ని ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్ఎఫ్‌సీలు కొన్ని ప‌రిమితుల‌తో ఎఫ్‌డీల‌పై రుణాల‌కు అనుమ‌తిస్తున్నాయి. కంపెనీ ఎఫ్‌డీలో డిపాజిట్ చేసిన‌వారు మూడు నెల‌ల త‌ర్వాత ఎఫ్‌డీపై రుణం కోసం దాఖ‌లు చేసుకోవ‌చ్చు. దీనికోసం ఎఫ్‌డీ రేటు కంటే 2 శాతం ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.

డిపాజిటర్లకు అతని అవసరానికి అనుగుణంగా ఎఫ్‌డీలో ఉన్న మొత్తంపై 75% వరకు గరిష్టంగా రుణం పొందే అవకాశం ఉంది. ఎఫ్‌డీ మెచ్యూరిటీకి ముందు ఒకేసారి లేదా ద‌శ‌ల‌వారిగా తిరిగి చెల్లించ‌వ‌చ్చు. రుణం తిరిగి చెల్లించకపోతే, మెచ్యూరిటీ సమయంలో ఉన్న ఎఫ్‌డీ మొత్తం నుంచి రుణ మొత్తం, వడ్డీ సర్దుబాటు చేస్తారు.

ఎఫ్‌డీపై రుణం తీసుకునేందుకు దాఖ‌లు చేసిన త‌ర్వాత‌ రుణం 4-6 పని దినాలలో ప్రాసెస్ జ‌రుగుతుంది. అలాగే, డిపాజిటర్ ప్రధాన సంస్థను నేరుగా సంప్ర‌దించ‌వ‌చ్చు లేదా కంపెనీలు నియమించిన న‌మోదిత‌ బ్రోకర్లను సంప్రదించవచ్చు. డిపాజిటర్‌కు సరిగా సంతకం చేసిన ఒరిజినల్ ఎఫ్‌డి రశీదు, ప్రధాన సంస్థ రుణ దరఖాస్తు ఫారం, రెవెన్యూ స్టాంప్‌తో డిమాండ్ ప్రామిసరీ నోట్ వంటి పత్రాలు అవసరం.

ముందస్తు ఉపసంహరణతో పోల్చితే డిపాజిట్లపై రుణం కొన్ని ప్రయోజనాలను ఇస్తుంది, ఎందుకంటే డిపాజిటర్‌ అవసరానికి అనుగుణంగా నగదును పొందడానికి ఇది ఒక ఎంపికను ఇస్తుంది. నిధుల లభ్యతపై, డిపాజిటర్‌కు వడ్డీతో పాటు ప్రధాన సంస్థకు తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది, మెచ్యూరిటీ వరకు ఎఫ్‌డి అసలు పెట్టుబడిగా కొనసాగుతుంది.

ముందస్తు-మూసివేత ఛార్జీలు, ముందస్తు- ఉపసంహరణ విషయంలో నష్టంతో పోల్చితే వాస్తవ పెట్టుబడిపై రుణంపై వడ్డీ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly