దీర్ఘ‌కాలికంగా మంచి రాబ‌డినిచ్చే మ్యూచువ‌ల్ ఫండ్లు

సెబీ నియ‌మాల ప్ర‌కారం ఏఎమ్‌సీలు ఒక్కో కేట‌గిరీలో ఒక‌టే మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాన్ని నిర్వహించగలవు

దీర్ఘ‌కాలికంగా మంచి రాబ‌డినిచ్చే మ్యూచువ‌ల్ ఫండ్లు

దీర్ఘ‌కాల పెట్టుబ‌డుల‌కు మ్యూచువ‌ల్ ఫండ్లు ఒక మంచి సాధ‌నాలుగా చెప్పుకోవ‌చ్చు. ఇవి రెండు ర‌కాలుగా ఉంటాయి. మొద‌టిది ఈక్వీటీ ఓరియంట‌డ్‌, రెండోది డెట్ ఓరియంటెడ్‌( ప్ర‌భుత్వ బాండ్లు & కార్పొరేట్ బాండ్లు). ఇందులో ఓపెన్ ఎండెడ్ ఫండ్లు, క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్లు, ఇంట‌ర్‌వెల్‌ ఫండ్ల ప‌థ‌కాలు అందుబాటులో ఉంటాయి. బ్యాంకులు,బీమా సంస్థ‌లు, పెన్ష‌న్ ఫండ్లు అధిక భాగాన్ని డెట్ ప‌థ‌కాల‌లో మ‌దుపు చేస్తాయి. కార్పొరేట్ సంస్థ‌లు మిగులు మొత్తాన్ని, డెట్ &ఈక్వీటీ ప‌థ‌కాల‌లో మ‌దుపు చేస్తాయి. లిక్విడ్ ఫండ్లును డెట్‌, మ‌నీ మార్కెట్ల‌లో పెట్టుబ‌డి పెడ‌తారు. ఇందుకు గానూ 91 రోజుల మెచ్యూరిటీ పిరియ‌డ్ ఉంటుంది. మ‌ల్టీ క్యాప్ ఫండ్లు, ఈఎల్ఎస్ఎస్ ఫండ్ల‌ను లార్జ్ క్యాప్‌, మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ స్టాక్స్లో మ‌దుపు చేస్తారు. ఈఎల్ఎస్ఎస్‌లో పెట్టుబ‌డి పెట్టిన రోజు నుంచి 3 సంవ‌త్స‌రాల లాక్ ప‌రియ‌డ్ ఉంటుంది. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ కింద రూ. 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.

ఈటీఎఫ్‌లు, నిఫ్టీ-50, సెన్సెక్స్ లాంటి మార్కెట్ సూచీల రాబ‌డులను అనుక‌రిస్తాయి.ఇత‌ర వాటితో పోలిస్తే త‌క్కువ నిర్వ‌హాణ రుసుములు వ‌సూలు చేస్తాయి.
ఇండియ‌న్ మ్యూచువ‌ల్ ఫండ్స్ అసోసియేష‌న్‌(ఏఎమ్ఎఫ్ఐ) ఇచ్చిన స‌మాచారం ప్ర‌కారం ఏప్రిల్ 2019 నాటికి మేనేజ్‌మెంట్ కింద ఉన్న స‌గ‌టు ఆస్తుల విలువ రూ. 25.27 ల‌క్ష‌ల కోట్లు

కార్పొరేట్లు, హెచ్ఎన్‌డ‌బ్ల్యూఐ లు ఎల్‌టీసీజీ ప‌న్ను ప్ర‌యోజ‌నాలను పొందేందుకుగానూ పెద్ద మొత్తంలో న‌గ‌దును ఈక్వీటీల‌లో మదుపు చేసిన‌ట్లు తెలుస్తుంది. అందువ‌ల్ల రూ.1 ల‌క్ష కంటే ఎక్కువ ఉన్న దీర్ఘ‌కాల మూల‌ధ‌న రాబ‌డుల‌(ఎల్‌టీసీజీ)పై 10 శాతం ప‌న్ను విధించాల‌ని ప్ర‌భుత్వం రూల్ పాస్ చేసింది. స్వ‌ల్ప‌కాలిక మూల‌ధ‌న రాబ‌డుల‌(ఎస్‌టీసీజీ)పై 15 శాతం ప‌న్ను వ‌ర్తిస్తుంది.

డెట్ ఫండ్ల‌పై వ‌ర్తించే ప‌న్ను:
ఎస్‌టీసీజీ- పెట్టుబ‌డి పెట్టిన రోజు నుంచి 36 నెల‌ల లేదా మూడేళ్ల‌కంటే త‌క్కువ‌గా ఉంటే స్వ‌ల్ప‌కాల మూల‌ధ‌న ఆదాయంగా ప‌రిగ‌ణిస్తారు. మ‌దుప‌ర్ల స్లాబు రేటు ప్ర‌కారం ప‌న్ను లెక్కిస్తారు.
ఎల్‌టీసీజీ- మూడేళ్లకు పైబ‌డి చేస్తే దీర్ఘ‌కాల రాబ‌డులుగా ప‌రిగ‌ణిస్తారు. వీటిపై 20శాతం (ఇండెక్సేష‌న్) ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఒక సంస్థ‌కు సంబంధించి అనేక ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ స్కీమ్‌లు అందుబాటులో ఉంటాయి. కానీ ఇటివ‌ల సెబీ అమ‌లు చేస్తున్న నియ‌మాల ప్ర‌కారం ఏఎమ్‌సీలు ఒక్కో కేట‌గిరీలో ఒక‌టే మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాన్ని నిర్వ‌హించేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే ఇందులో డివిడెండ్‌, రీఇన్‌వెస్ట‌మెంట్‌, గ్రోత్‌ వంటి స‌బ్ కేట‌గిరీల‌ను ఎంచుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

డెట్ ఓరియంటెడ్ ఫ‌థ‌కాలు:
fun.jpg

ఈక్వీటీ ఓరియంటెడ్ ఫ‌థ‌కాలు:
funds1.jpg

హైబ్రీడ్‌, సొల్యూష‌న్ ఓరియంటెడ్‌, ఇత‌ర ఫ‌థ‌కాలు:
funds3.jpg
ఈ క్రింది లింక్ జూన్, 2018 నాటికి అన్ని ఫండ్ హౌసెస్ ద్వారా అమలు చేయబడిన పథకాల పునః వర్గీకరణ జాబితాను చూడొచ్చు.
మ్యూచువ‌ల్ ఫండ్ల కేట‌గిరీల వివ‌రాలు

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly