మ్యూచువ‌ల్ ఫండ్ స‌మీక్ష‌: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్ ఫండ్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్ మ్యూచువ‌ల్ ఫండ్ ప‌నితీరు, ఉద్దేశం, రాబ‌డి వివ‌రాల గురించి తెలుసుకుందాం.

మ్యూచువ‌ల్ ఫండ్ స‌మీక్ష‌: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్ ఫండ్‌

ఉద్దేశం

పెట్టిన పెట్టుబ‌డి వృద్ధి అయ్యేలా చూడ‌డం ఈ ఫండ్ ప్ర‌ధాన ఉద్దేశం. ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత పెట్టుబడుల్లో, డెట్‌, మ‌నీ మార్కెట్ సాధానాల క‌ల‌బోత‌గా పోర్ట్‌ఫోలియో ఉంటుంది.

క్యాట‌గిరి

బ్యాలెన్స్‌డ్‌

ఫండ్ మేనేజ‌ర్‌

చిరాగ్ సెతిల్వాద్‌

బీటా

0.88

ఆల్ఫా

6.31

నిర్వ‌హ‌ణ నిష్ప‌త్తి

డైరెక్ట్ ప్లాన్‌- 0.82శాతం
రెగ్యుల‌ర్ ప్లాన్‌- 1.96శాతం

టాప్ 10 హోల్డింగ్స్‌

HOLDING.png

రాబ‌డి(శాతాల్లో)

RETURN.png

ఫండ్ ప‌నితీరు

2000 సంవ‌త్స‌రంలో ఈ ఫండ్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. అప్పుడ‌ప్పుడే మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ప్రార‌భించారు. అందులో ఇదీ ఒక‌టి కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం ఈ ఫండ్ లోని సొమ్మును 70శాతం ఈక్విటీల్లోనూ, 30శాతం డెట్‌లోనూ పెట్టుబ‌డి పెడ‌తారు. స్థిరంగా కొన‌సాగడం దీని అతి పెద్ద ప్ర‌యోజ‌నం. బుల్ మార్కెట్‌లో ఈ ఫండ్ బాగా రాణించింది.

ఫండ్ మేనేజ‌ర్ ఫండ్ ప‌నితీరు మెరుగ్గా ఉండాల‌ని దీర్ఘ‌కాల ఉద్దేశంతో నాణ్య‌మైన షేర్ల‌నే ఎంపిక చేసుకుంటారు. రిస్క్ తీసుకోవ‌డంలో చాలా ప‌రిమితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఫండ్ బీటా విలువ‌ను తెలియ‌జేస్తుంది.

సార్వ‌భౌమ‌, AAA బాండ్ల‌లో అధిక కేటాయింపుల ద్వారా తెలుస్తుందేమిటంటే ఈ ఫండ్‌ను రిస్క్ త‌క్కువ‌గా ఉండే వాటిలో పెడుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈక్విటీలో అధిక కేటాయింపులు జ‌ర‌ప‌కుండా రిస్క్‌ను వీలైనంత త‌క్కువ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. త‌క్కువ నిర్వ‌హ‌ణ నిష్ప‌త్తి సైతం మ‌దుప‌రుల‌కు బాగా క‌లిసొచ్చే అంశం. తొలి నాళ్ల‌ల్లో మ‌దుపు ప్రారంభించిన‌వాళ్లు ఇలా ఈక్విటీ, డెట్ క‌ల‌బోత‌గా ఉన్న బ్యాలెన్స్‌డ్ ఫండ్‌ను పోర్ట్‌ఫోలియోలో ఉంచుకోవ‌డం చాలా మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly