మిరే అసెట్ ఫోకస్డ్ ఫండ్ ఎన్ఎఫ్ఓ

మిరే అసెట్ ఫోకస్డ్ ఫండ్ - మల్టీ క్యాప్ కేట‌గిరీకి చెందిన ఫోక‌స్డ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఎన్ఎఫ్ఓ

మిరే అసెట్ ఫోకస్డ్ ఫండ్ ఎన్ఎఫ్ఓ

మిరే అసెట్ ఫోకస్డ్ మ్యూచ్యువల్ ఫండ్ ఎన్ఎఫ్ఓ మ‌దుప‌ర్ల‌కు మే 7 వ‌ర‌కూ అందుబాటులో ఉంటుంది. ఇది ఓపెన్ ఎండెడ్ ప‌థ‌కం. ఈ ఫండ్ లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కేట‌గిరీల‌కు చెందిన‌ 30 కంపెనీల‌కు చెందిన షేర్లలో పెట్టుబడులు పెడుతుంది. సెబీ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఒక ఫోక‌స్డ్ ఫండ్ 30 కంటే ఎక్కువ షేర్ల‌లో పెట్టుబడులు చేయ‌కూడ‌దు. మల్టీ-క్యాప్, ఫోక‌స్డ్ ఫండ్ గా మిరే అస్సెట్ ఫోకస్డ్ ఫండ్ వేర్వేరు రంగాలు, కేట‌గిరీల‌కు చెందిన 30 కంపెనీల‌కు చెందిన షేర్ల‌లో పెట్టుబడులు పెడుతుంది. యూనిట్ ముఖ విలువ రూ.10. క‌నీస పెట్టుబ‌డి మొత్తం రూ.5000గా నిర్ణ‌యించారు. ఈ ఫండ్ బెంచ్‌మార్క్‌గా నిఫ్టీ 200 సూచీ(టీఆర్ఐ) వ్య‌వ‌హ‌రిస్తుంది. లోడ్ ఛార్జీల‌కు సంబంధించి ప్ర‌వేశ రుసుము ఉండ‌దు. ఏడాది కంటే ముందుగా యూనిట్ల‌ను విక్ర‌యిస్తే 1 శాతం లోడ్ ఛార్జీలు చెల్లించాలి.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly