కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు తీపి క‌బురు!

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల క‌నీస వేత‌నాన్ని పెంచేందుకు ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకోనుంది.

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు తీపి క‌బురు!

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌చ్చె నెల‌లో మోదీ ప్ర‌భుత్వం తీపి క‌బురు వినిపించ‌నుంది. అంతకు ముందు ఒక ప్యానెల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాన్ని 2.7 % పెంచమని సిఫార్సు చేసింది. దీని వల్ల కనీస వేతనం Rs. 7,000 నుండి Rs. 18,000 గా మారిన విషయం తెలిసిందే.

ఏడ‌వ వేత‌న స‌వ‌ర‌ణ సంఘ సిఫార్సుల‌క‌నుగుణంగా ఉద్యోగుల క‌నీస వేత‌నాన్ని కేంద్రం రూ.21 వేలకు పెంచ‌నుంది. దీనికోసం కేంద్రం ఫిట్‌మెంట్ ఫ్యాక్ట‌ర్‌ని 3.0 కి స‌వ‌రించ‌నుంది. ప్ర‌స్తుతం కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల క‌నీస వేత‌నం రూ.18 వేలుగా ఉంది.

అయితే ఫిట్‌మెంట్ ఫ్యాక్ట‌ర్‌ని 3.68 రెట్లు చేయాల‌ని ఉద్యోగ సంఘాలు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇలా చేసేట‌ట్ల‌యితే క‌నీస వేత‌నం రూ.26 వేలుగా మార‌నుంది. అయితే ఆర్థికంగా ప‌డనున్న భారాన్ని గ‌మ‌నించి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ త‌క్కువ వేత‌నం అందుకునే ఉద్యోగుల ఫిట్‌మెంట్ ఫ్యాక్ట‌ర్‌ని 3 రెట్లు చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు స‌మాచారం.

కనీస వేతనం లో మార్పు వల్ల పెరిగే అదనపు భారాన్ని మోసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటు సంకేతాలు కనిపిస్తున్నాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly