వ‌ర్షాభావం ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఎలా ప్ర‌భావం చూపుతుంది?

జూన్-సెప్టెంబర్ కాలంలో న‌మోద‌య్యే వర్షపాతం భారతదేశ వార్షిక వర్షపాతంలో 70% ఉంటుంది. దేశ‌ 2.5 ల‌క్ష‌ల కోట్ల‌ డాల‌ర్ల‌ ఆర్థిక వ్యవస్థకు ఇది కీలకం

వ‌ర్షాభావం ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఎలా ప్ర‌భావం చూపుతుంది?

నైరుతి రుతుపవనాల ఆలస్యం వ‌ల‌న‌ భారతదేశంలో వ్యవసాయంపై మ‌రింత ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంది .
వర్ష‌పాతంపై తాజా నివేదిక ఏం చెప్పింది?
నైరుతి రుతుపవనాలు తూర్పు భారతదేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్త‌రిస్తున్నాయి. బంగాళాఖాతంలో 4-5 రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో వ‌ర్ష‌పాత సూచ‌న ఉంద‌ని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) తెలిపింది. జూన్‌లో సాధార‌ణం కంటే 40 శాతం త‌క్కువ వ‌ర్ష‌పాతం న‌మోద‌వుతుంద‌ని స్కైమెట్ అంచ‌నా వేస్తుంది. వ‌రుస‌గా మూడో సంవ‌త్స‌రం త‌క్కువ వ‌ర్షపాతం న‌మోద‌వుతుంద‌ని చెప్తుంది. దీర్ఘ‌కాలంగా చూస్తే స‌గ‌టున 93 శాతం వ‌ర్ష‌పాతం ఉంటుందిని పేర్కొంది. వాతావ‌ర‌ణ శాఖ మాత్రం 96 శాతం వ‌ర్ష‌పాతం న‌మోవుతుంద‌ని పేర్కొంది.

వేస‌విలో పంట‌ల ప‌రిస్థితి ఏంటి?
వ్య‌వ‌సాయ‌ మంత్రిత్వ శాఖ గ‌ణాంకాల ప్ర‌కారం జూన్ 14 నాటికి ఖ‌రీఫ్ సీజ‌న్‌లో రైతులు 8.22 మిలియ‌న్ హెక్టార్ల‌లో పంట‌లు సాగుచేశారు. గ‌తేడాదితో పోలిస్తే ఇది 9 శాతం త‌క్కువ . ముఖ్యమైన ప్రాంతాల‌లో నైరుతి రుతుప‌వ‌నాలు ఆల‌స్యంగా రావ‌డం ఇందుకు కార‌ణంగా చెప్తున్నారు. ఈ ఏడాది ఈ సీజ‌న్‌లో వ‌ర్ష‌పాతం సాధార‌ణం కంటే 43 శాతం త‌క్కువ‌గా న‌మోదైంది. చాలావ‌ర‌కు నీటి పారుద‌ల లేని ప్రాంతాలలో ఖ‌రీఫ్ పంట‌లు వ‌ర్షం నీటిపై ఆధార‌ప‌డ‌తాయి. ఖ‌రీఫ్‌లో ముఖ్యంగా సాగు చేసే పంట వ‌రి, ఇది ఈ ఏడాది 426,000 హెక్టార్లలో సాగుచేశారు. కాగా, గ‌తేడాది ఇది 547,000 హెక్టార్లు ఉంది. ఇప్పుడే ఒక అంచ‌నాకు రావ‌డం స‌రైన నిర్ణ‌యం కాన‌ప్ప‌టికీ పంట‌ల సాగు త‌గ్గింద‌నే చెప్పుకోవాలి.

ఆహార ధాన్యాలు, కూర‌గాయ‌ల ధ‌ర‌లు పెరుగుతాయా?
పంట‌లు త‌గ్గినంత మాత్రాన ఆహ‌ర వ‌స్తువుల‌ ధ‌ర‌లు పెరుగుతాయ‌ని అంచ‌నా వేయ‌లేం. గత రెండేళ్లుగా చూస్తే పంట‌లు బాగా పండ‌టంతో వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ధ‌ర‌లు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. మ‌రోవైపు ఈ ఏడాది అద‌నంగా మ‌రో 2 కేజీలు ఎక్కువ‌గా ల‌బ్దిదారుల‌కు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. కేంద్రంలో ఉన్న నిల్వ‌ల‌ను త‌గ్గించేందుకు జాతీయ ఆహార భ‌ద్ర‌త ప‌థ‌కం కింద ల‌బ్దిదారుల‌కు ఆరు నెల‌ల వ‌ర‌కు నెల‌కు మ‌రో 2 కేజీలు అద‌నంగా బియ్యం, గోదుమ‌లు అందించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. గ‌త‌ కొన్ని నెల‌ల క్రితం వ‌ర‌కు చాలా వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులకు స‌రైన మ‌ద్ద‌తు ధ‌ర ల‌భించ‌లేదు. అయితే ఇప్పుడు ప‌రిస్థితులు కాస్త స‌ర్దుకున్నాయ‌నే చెప్ప‌వ‌చ్చు. ప్ర‌స్తుతం కూర‌గాయ‌ల ధ‌రలు పెరుగుతున్న‌ప్ప‌టికీ తృణ‌ధాన్యాల‌పై ఈ ప్ర‌భావం అంత‌గా లేదు. కూర‌గాయ‌ల ధ‌ర‌లు పెర‌గ‌డంతో మే నెల‌లో రిటైల్ ద్ర‌వ్యోల్బణం ఏడు నెల‌ల గ‌రిష్ఠంగా 3.05 శాతానికి చేరిన విష‌యం తెలిసిందే.

రాష్ర్టాల స్పంద‌న ఎలా ఉంది?
వ్య‌వ‌సాయ మంత్రిత్వ శాఖ ఎటువంటి ప‌రిస్థితులు ఎదురైనా సిద్ధంగా ఉండాలని రాష్ర్ట ప్ర‌భుత్వాల‌కు సూచించింది. జూన్ 13 నాటికి రిజ‌ర్వాయ‌ర్లలో 18 శాత‌మే నీరు ఉండ‌టంతో అంత‌గా దోహదం చేయ‌వ‌ని చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం రైతులని ఖరీఫ్ విత్తనాలను వాయిదా వేయాలని కోరగా, పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నాయి.

త‌క్కువ వ‌ర్షపాతం వృద్ధిని దెబ్బ‌తీస్తుందా?
దేశ జీడీపీలో వ్యవ‌సాయం వాటా త‌గ్గిపోతున్న‌ప్ప‌టికీ, గ్రామీణ‌ ఆర్థిక వ్య‌వ‌స్థ కొనుగోలు సామ‌ర్ధ్యంలో మాత్రం అంత‌గా మార్పు రాలేద‌నే చెప్పుకోవాలి. వాహ‌న సంస్థ‌లు ప్ర‌భుత్వం పెట్టిన నిబంధ‌న‌ల‌తో నిర్మాణాత్మ‌క మార్పులు చేప‌ట్ట‌డంతో ఈ రంగ‌ ఆదాయం త‌గ్గిపోవ‌చ్చు. హిందుస్తాన్ యూనిలీవర్ మరియు డాబర్ వంటి ఎఫ్‌ఎంసిజి సంస్థలు, ట్రాక్టర్ తయారీదారులు ఎం అండ్ ఎం, ఎస్కార్ట్స్ అమ్మకాల కోసం గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా ఆధారపడతాయి. వ్య‌వ‌సాయ ఆదాయం త‌గ్గ‌డంతో వీటిపై ప్ర‌భావం చూప‌వ‌చ్చు. సిమెంట్, పేయింట్ సంస్థ‌ల‌పై కూడా ఈ ప్ర‌భావం ఉండ‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly