ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌తో నెల‌వారీ ఆదాయం

ఖాతాలోని 75 శాతం డిపాజిట్‌పై ప్ర‌త్యేక అవ‌స‌రాల‌కు రుణం తీసుకునే అవ‌కాశం ఉంది

ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌తో నెల‌వారీ ఆదాయం

దేశీయ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వివిధ డిపాజిట్ స్కీముల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఫిక్స్డ్‌, రికరింగ్‌, ట్యాక్స్ సేవింగ్ వంటి విభిన్న డిపాజిట్ల‌ను ప‌రిచ‌యం చేసింది. ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ ఖాతా కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటిదే. ఇందులో ఒకేసారి ఎక్కువ మొత్తంలో న‌గ‌దును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి నెలవారిగా ఈఎమ్ఐ రూపంలో ఆదాయం పొంద‌వ‌చ్చు. ఈఎమ్ఐలో కొంత అస‌లుతో పాటు వ‌డ్డీ ఇస్తారు. వ‌డ్డీ కూడా ఖాతాలో ఉన్న మొత్తం ఆధారంగా త‌గ్గుతూ వ‌స్తుంది. చెల్లించిన అస‌లు మొత్తంలోని భాగాన్ని త‌గ్గించి మిగిలిన మొత్తంపై వ‌డ్డీని త్రైమాసికంగా కాంపౌండ్ చేస్తారు. ఖాతాదారుల చేసిన డిపాజిట్లు నెల‌వారీ వాయిదాల ప‌ద్ధ‌తిలో వ‌డ్డీతో పాటు చెల్లిస్తారు.

ఎస్‌బీఐ యూన్యుటీ ఫిక్స్‌డ్ డిపాజిట్ గురించి తెలుసుకోవాల్సిన 5 విష‌యాలు…

  1. డిపాజిట్ మొత్తం: ఎస్‌బీఐ యాన్యుటీ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా క‌నీస నిల్వ రూ.25 వేలు. గ‌రిష్ఠంగా ఎలాంటి పరిమితిలేదు. ఎంతైనా డిపాజిట్ చేసుకోవ‌చ్చు.
  1. కాల‌ప‌రిమితి: 3,5,7,10 సంవ‌త్స‌రాల‌ ఇలా మీ అవ‌స‌రాన్ని బ‌ట్టి వివిధ కాల‌ప‌రిమితులను ఎంచుకోవ‌చ్చు.

  2. వ‌డ్డీరేటు: ఖాతాదారులు ఎంచుకున్న కాల‌ప‌రిమితికి అనుగుణంగా ట‌ర్మ్ డిపాజిట్లు/ ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగానే వ‌డ్డీ రేట్లు అమ‌ల‌వుతుంది. తాజా ఎఫ్‌డీ రేట్ల ప్ర‌కారం 3 నుంచి 10 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి గ‌ల డిపాజిట్ల‌పై ఎస్‌బీఐ 6.25 శాతం వ‌డ్డీ ఆఫ‌ర్ చేస్తుంది. అంటే 36/60/84/120 నెల‌ల కాల‌ప‌రిమితి గ‌ల యాన్యూటీ డిపాజిట్ ప‌థ‌కాల‌పై ఎస్‌బీఐ 6.25 శాతం వ‌డ్డీ ఇస్తుంది.

  3. ప్రీమెచ్యూరిటీ చెల్లింపులు: ఖాతాదారుడు మెచ్యూరిటీ ముగియ‌క‌ముందే డ‌బ్బు తీసుకునే వీల్లేదు. అయితే డిపాజిట్‌దారుడు మ‌ర‌ణిస్తే అప్పుడు నామినీ ఈ ఖాతాను ఉప‌సంహ‌రించుకునే అవ‌కాశ‌ముంది.

  4. ఇత‌ర స‌దుపాయాలు:

  • ఈ ఖాతాల‌కు నామినీ స‌దుపాయం కూడా ఉంటుంది.
  • ఖాతాలోని 75 శాతం డిపాజిట్‌పై ప్ర‌త్యేక అవ‌స‌రాల‌కు రుణం తీసుకునే అవ‌కాశం ఉంది.
  • రుణం తీసుకున్న త‌ర్వాత చెల్లింపులు చేస్తే అవి రుణ ఖాతాలోకి చేర‌తాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly