రెండు నెల‌ల వాయిదాతో 10 నెల‌ల చెల్లింపు పెరిగే అవ‌కాశం

బ్యాంకులు రుణ‌గ్ర‌హీత‌ల‌కు మూడు ఆప్ష‌న్లు ఇచ్చే అవ‌కాశ‌ముంది

రెండు నెల‌ల వాయిదాతో 10 నెల‌ల చెల్లింపు పెరిగే అవ‌కాశం

లాక్‌డౌన్‌తో వ్య‌వ‌స్థ‌లో అనిశ్చితి ఏర్ప‌డ‌టంతో అంద‌రు రుణ చెల్లింపుల‌పై కొంత ఉప‌శ‌మ‌నం కోరుకుంటున్నారు. ఆర్‌బీఐ మూడు నెల‌ల ఈఎమ్ఐ ప్ర‌క‌టించ‌డంతో చాలా మందికి ఈ విష‌యంలో కొన్ని సందేహాలు ఉన్నాయి. బ్యాంకులు ఈ విష‌యంపై త‌మ విధానాల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి.

రెండు ఈఎమ్ఐల‌ను వాయిదా వేస్తే రుణ చెల్లింపు గ‌డువు 6 నుంచి 10 నెల‌లు పెరిగే అవ‌కాశ‌ముంది లేదా ఈఎమ్ఐ 1.5 శాతం పెరుగుతుంది. బ్యాంకులు రుణ‌గ్ర‌హీత‌ల‌కు మూడు ఆప్ష‌న్లు ఇచ్చే అవ‌కాశ‌ముంది.

  1. ఏప్రిల్, మే నెల‌లో చెల్లించ‌ని వ‌డ్డీ మొత్తం జూన్‌లో ఒకేసారి చెల్లించ‌డం
  2. చెల్లించ‌ని కాలానికి వ‌డ్డీ మొత్తం రుణానికి క‌లిపి ఈఎమ్ఐని పెంచుకోవ‌డం
  3. ఈఎమ్ఐ అదేవిధంగా కొన‌సాగించాల‌నుకుంటే రుణ కాల గ‌డువు పెంచ‌డం
    మిగ‌తా ఈఎమ్ఐలు రుణం చెల్లించాల్సిన గ‌డువుపై ఆధార‌ప‌డి ఉంటుంది. ఉదాహ‌ర‌ర‌ణ‌కు 9 శాతం వ‌డ్డీతో రూ.50 ల‌క్ష‌లు 20 ఏళ్ల కాల‌ప‌రిమితికి రుణం తీసుకున్నార‌నుకుంటే ఈఎమ్ఐ రూ.44,986 అవుతుంది. వ‌చ్చే రెండు నెల‌లు ఏప్రిల్, మే ఈఎమ్ఐ వాయిదా వేస్తే మీ రుణం పై ఎంత ప్ర‌భావం ప‌డుతుందో తెలుసుకోండి.
HOME-TABLE.png
  • ఇక్క‌డ పొడ‌గించిన కాల‌వ్య‌వ‌ధిలో రెండు వాయిదావేసిన‌ ఈఎమ్ఐలు లేవు

చెల్లించాల్సి న రుణ‌ కాల‌ప‌రిమితి ఎంత ఎక్కువ‌గా ఉంటే అంత‌ ఎక్కువ భారం ఉంటుంది. రుణ ప్రారంభంలో ఈఎమ్ఐలో వ‌డ్డీ శాతం ఎక్కువ‌గా ఉంటుంది. ఈ త‌ర్వాత త‌గ్గుతూ వ‌స్తుంది. మొద‌టి సంవ‌త్స‌రంలో ఈఎమ్ఐలో వ‌డ్డీ 80 శాతం ఉండ‌గా, 19 వ సంవ‌త్స‌రానికి 10 శాతంగా ఉంటుంది.

అయితే రుణం తీసుకొని ఇప్ప‌టికే 10-15 సంవ‌త్స‌రాలు అయితే ఎక్కువ‌గా భారం ఉండ‌దు. కాని, 2-3 ఏళ్ల‌యితే అధిక భారం ఉంటుంది. పాత రుణాల‌కు ఇప్పుడు వాయిదా వేయాల్సిన అవ‌స‌రం అంత‌గా ఉండ‌ద‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly