వాహ‌న బీమా ప్రీమియంలు త‌గ్గే అవ‌కాశం

వాహ‌న బీమా ప్రీమియంపై ఐఆర్‌డీఏ ముసాయిదా జాబితాను విడుద‌ల చేసింది

వాహ‌న బీమా ప్రీమియంలు త‌గ్గే అవ‌కాశం

చిన్న కార్లు, కొన్ని బైకుల‌పై థ‌ర్డ్ పార్టీ బీమా ప్రీమియంల‌ను తగ్గిస్తూ బీమా నియంత్ర‌ణ అభివృద్ధి ప్రాధికార సంస్థ‌(ఐఆర్‌డీఏ) ప్ర‌తిపాదన‌లు చేసింది. అదే స‌మ‌యంలో స‌ర‌కు ర‌వాణా వాహ‌నాల‌పైన మాత్రం ప్రీమియం రేట్ల‌ను పెంచాల‌ని యోచిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన థ‌ర్డ్ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్ల‌పై ముసాయిదా జాబితాను ఐఆర్‌డీఏ సిద్ధం చేసింది. వీటిపై మార్చి 22 వ‌రకు అభిప్రాయాలు తెల‌పాల్సిందిగా ప్ర‌జల‌ను ఐఆర్‌డీఏ కోరింది.

ముసాయిదా జాబితా ప్రకారం

  • 1000 సీసీ కంటే త‌క్కువ ఇంజిన్ సామ‌ర్థ్యం గ‌ల కార్ల‌పై బీమా ప్రీమియంను రూ.2055 నుంచి రూ.1850 ల‌కు త‌గ్గించాల‌ని ప్ర‌తిపాదించింది.
  • 1000 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామ‌ర్థ్యం గ‌ల కార్ల ప్రీమియంల‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
  • 75 సీసీ లోపు ఇంజిన్ గ‌ల బైకుల పై ప్రీమియంను రూ.569 నుంచి రూ.427 కి త‌గ్గించాల‌ని ఐఆర్‌డీఏ ప్ర‌తిపాదించింది.
  • 75-150 సీసీ శ్రేణిలోని బైకుల ప్రీమియంలో ఎలాంటి మార్పు లేదు.
  • ఇ-రిక్షాల‌పై ప్రీమియంను ప్ర‌స్తుత‌మున్న రూ.1440 నుంచి 1685 కి పెంచ‌నున్నారు.
  • 350 సీసీ కంటే అధిక సామ‌ర్థ్యం గ‌ల సూప‌ర్ బైకుల‌పై రెండింత‌లు(రూ.2323 )కి ప్రీమియాన్ని పెంచాల‌ని తెలిపింది.
  • వాణిజ్య వాహ‌నాల ప్రీమియం విష‌యంలో య‌థాత‌థ స్థితిని ప్ర‌తిపాదించిన ఐఆర్‌డీఏ, 40 టన్నులు(1 ట‌న్ను=1000 కిలోలు) మించి ర‌వాణా చేసే స‌ర‌కు వాహనాల‌పై మాత్రం ప్రీమియాన్ని రూ.33024 నుంచి రూ.39299 కి పెంచాల‌ని ప్ర‌తిపాదించింది.
  • 6 హెచ్‌పీ లోపు సామ‌ర్థ్యం గ‌ల ట్రాక్ట‌ర్ల‌పై ప్రీమియాన్ని రూ.816 నుంచి రూ.653 కి త‌గ్గించాల‌ని ఐఆర్‌డీఏ ప్ర‌తిపాదించింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly