మ‌ల్టీ ఇయ‌ర్ పాల‌సీల ప్రీమియంపై ప‌న్ను మిన‌హాయింపు ఎంత‌?

సంవ‌త్స‌రానికి మెడిక‌ల్ పాల‌సీ ప్రీమియం కింద ఒక వ‌క్తి రూ.75 వేల వరకు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు

మ‌ల్టీ ఇయ‌ర్ పాల‌సీల ప్రీమియంపై ప‌న్ను మిన‌హాయింపు ఎంత‌?

మీ ఆరోగ్య బీమా ప్రీమియం రెన్యువ‌ల్‌ గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతుంటే, మీరు సింగిల్ ప్రీమియం చెల్లించి మ‌ల్టీ-ఇయ‌ర్ పాల‌సీని కొనుగోలు చేస్తే మంచిది. ఇప్పుడు సంస్థలు ఈ పాల‌సీల‌పై డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. దీంతోపాటు ఒక‌టి కంటే ఎక్కువ సంవ‌త్స‌రాలు ఒకే ర‌క‌మైన ప్రీమియం లాక్ చేయ‌డంతో సంస్థ‌లు ధ‌ర‌లు పెంచిన‌ప్ప‌టికీ మీకు న‌ష్ట‌ముండ‌దు. ఒకవేళ మీ వ‌య‌సు ప‌రిమితికి మించి ఉంటే ప్రీమియంల‌లో మార్పు వ‌స్తుంది. అయితే ఈ పాల‌సీకి చెల్లించే ప్రీమియం ప‌న్ను మిన‌హాయింపును దాటితే సెక్ష‌న్ 80 డీ ప‌రిమితిని మించితే ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం దీనిని క్లెయిమ్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది.

సెక్ష‌న్ 80డీ ప్ర‌కారం, సంవ‌త్స‌రానికి మెడిక‌ల్ పాల‌సీ ప్రీమియం కింద ఒక వ‌క్తి త‌మ కోసం, భార్య లేదా భ‌ర్త‌, పిల్ల‌ల కోసం రూ.25 వేలు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. త‌ల్లిదండ్రుల కోసం చెల్లించే ప్రీమియంపై అద‌నంగా మ‌రో రూ.25 వేల వ‌ర‌కు మిన‌హాయింపు ల‌భిస్తుంది. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌యిన త‌ల్లిదండ్రుల పేరుతో మెడిక‌ల్ పాల‌సీ ప్రీమియం చెల్లిస్తున్న‌ట్ల‌యితే అద‌నంగా రూ.50 వేలు అంటే మొత్తం రూ.75 వేల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.

ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?

మ‌ల్టిపుల్ ఇయ‌ర్స్‌కు సింగిల్ ప్రీమియం చెల్లిస్తే క్లెయిమ్ చేసుకోవ‌డం ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. అయితే ఇది ఎలా ప‌నిచేస్తుందో తెలుసుకుందాం. ఉదాహ‌ర‌ణ‌కు న‌లుగురు కుటుంబ స‌భ్యులు (భార్య‌, భ‌ర్త‌, ఇద్ద‌రు పిల్ల‌లు) ఉన్న ఆరోగ్య బీమా పాల‌సీ ప్రీమియం ఏడాదికి రూ25 వేలు అనుకుంటే రెండేళ్ల పాల‌సీకి రూ.50 వేలు. బీమా సంస్థ 7.5 శాతం డిస్కౌంట్ ప్ర‌క‌టిస్తే రెండేళ్ల క‌వ‌ర్‌కి సింగిల్ ప్రీమియం రూ.46,250 చెల్లిస్తారు. ఒక‌వేళ వ‌య‌సు పెరిగే ప్రీమియం పెరుగుతుంది ఆ విష‌యాన్ని గుర్తుంచుకోవాలి.

ఈ విధంగా క్లెయిమ్ చేసుకుంటే రెండేళ్ల‌కు క‌లిపి స‌గం ప్రీమియం లేదా రూ.23,125 త‌గ్గింపు ల‌భిస్తుంది. బీమా సంస్థ‌లు ప్ర‌తి ఏడాది మీరు చేసుకునే క్లెయిమ్ మొత్తాన్ని స‌ర్టిఫికెట్ రూపంలో జారీ చేస్తాయి. మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే రెండేళ్ల‌కు ప్రీమియం లాక్ అవుతుంది. దీంతో బీమా సంస్థ‌లు ధ‌ర‌లు పెంచిన‌ప్ప‌టికీ ఎక్కువ‌గా చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అయితే దీనికోసం ప్రీమియంను న‌గ‌దు రూపంలో కాకుండా ఇత‌ర పద్ధ‌తిలో చెల్లించాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly