మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల‌కు 5 యాప్స్

మార్కెట్లో చాలా మ్యూచువ‌ల్ ఫండ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రాముఖ్య‌త క‌లిగిలిన 5 మ్యూచువ‌ల్ ఫండ్ యాప్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల‌కు 5 యాప్స్

దీర్ఘ‌కాల పెట్టుబ‌డులకు మ్యూచువ‌ల్ పండ్లు ఒక మంచి ఎంపిక‌. ఇందులో నేరుగా గానీ డిస్ట్రిబ్యూట‌ర్‌/ ఏజెంట్ ద్వారా గానీ మ‌దుపు చేయ‌వ‌చ్చు. వినియోగ‌దారుల‌కు మెరుగైన సేవ‌ల‌ను అందించేందుకు చాలా మ్యూచువ‌ల్ ఫండ్ కంపెనీలు ఆన్‌లైన్ పోర్ట‌ల్,మొబైల్ యాప్‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టాయి. ఈ యాప్‌ల ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపు చేయొచ్చు. మార్కెట్లో చాలా మ్యూచువ‌ల్ ఫండ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రాముఖ్య‌త క‌లిగిలిన 5 మ్యూచువ‌ల్ ఫండ్ యాప్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యాప్‌లు మీరు మ్యూచువ‌ల్ పండ్ల‌లో మ‌దుపు చేసేందుకు, మీ ఫోర్ట్‌ఫోలియోను ట్రాక్‌ చేసేందుకు, ఉప‌యోగ‌ప‌డ‌తాయి. కింది తెలిపిన ఆప్ లు డైరెక్ట్ ప్లాన్ లో మదుపు చేసే సౌకర్యం కల్పిస్తున్నాయి.

 1. మైక్యామ్స్ మ్యూచువ‌ల్ ఫండ్ యాప్‌:
  మైక్యామ్స్ యాప్ ద్వారా ప‌లు రకాల మ్యూచువల్‌ ఫండ్స్ పెట్టుబ‌డుల‌ను ఒకే చోట నిర్వహించ‌వచ్చు.
 • ఈ యాప్‌ను ఉప‌యోగించ‌డం చాలా సుల‌భం. ఎమ్‌పిన్ ద్వారా లావాదేవీలు జ‌రుప‌వ‌చ్చు.
 • ఈ యాప్‌ను ఉప‌యోగించి ఏక‌మొత్తంగా గానీ , సిప్(క్ర‌మానుగ‌త పెట్టుబ‌డి ప్ర‌ణాళిక‌) విధానాల ద్వారా కూడా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు చేయ‌వ‌చ్చు.
 • మై వాచ్ లిస్ట్‌ను ఏర్పాటు చేసుకుని పెట్టుబ‌డుల‌ను స‌మీక్షించుకోవ‌చ్చు.
 • భ‌విష్య‌త్తు లావాదేవీల కోసం షెడ్యూల్ ట్రాన్సాక్ష‌న్ ఆఫ‌న్ అందుబాటులో ఉంది.
 • ఆధార్‌తో కూడిన ఈ కేవైసీ సౌకర్యంతో కేవైసీ అప్‌డేట్ చేసుకోవ‌చ్చు.
 • ఈ యాప్ ద్వారా ఫండ్లను రీడీమ్ లేదా స్విచ్ చేసుకోవ‌చ్చు.
 • టూ ఫ్యాక్ట‌ర్ అథంటికేష‌న్ ద్వారా భ‌ద్ర‌త ప‌టిష్టంగా ఉంటుంది.

అయితే ఈ యాప్ ఫ్రాంక‌లిన్ ఇండియా, రిల‌య‌న్స్ మ్యూచువ‌ల్ పండ్ల వంటి కొన్ని ప్ర‌ముఖ మ్యూచువ‌ల్ ఫండ్ల‌కు స‌పోర్ట్ చేయ‌క‌పోవడం దీనిలో ఉన్న ప్ర‌ధాన లోపం. ఈ యాప్‌ను మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

 1. జెరోధా కాయిన్
  ఎటువంటి కమీషన్‌ చెల్లించకుండా ఆన్‌లైన్‌లో మ్యూచువల్‌ ఫండ్‌లను కొనుగోలు చేసే సదుపాయాన్ని కాయిన్ జెరోధా కల్పిస్తోంది.
 • నేరుగా మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వచ్చిన తొలి వేదిక ’ కాయిన్’
 • డైరెక్ట్ మ్యూచువ‌ల్ ఫండ్లు, ఈటీఎఫ్‌, స్టాక్స్‌, బాండ్ల అన్నింటి నిర్వ‌హ‌ణ‌కు ఒకే యూనిఫైడ్ పోర్ట్‌ఫోలియో ఉంటుంది.
 • ’ కాయిన్’ యాప్ ద్వారా వార్షిక వివ‌రాల‌తో పాటు మంచి రాబ‌డిని పొంద‌వ‌చ్చు.
 • సిప్ కోసం యూపీఐ ద్వారా చెల్లింపులు చేయ‌వ‌చ్చు.
 • ఏస‌మ‌యంలోనైనా సిప్స్‌ను క్రియేట్ చేయ‌డం, నిలిపివేయడం, మార్చుకోవ‌డం వంటివి ఒక్క బ‌ట‌ను క్లిక్ చేసి చేయ‌వ‌చ్చు.
 • ఒక స‌ర‌ళ‌మైన యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్ క‌లిగివుండ‌డం వ‌ల్ల సుల‌భంగా కార్య‌క‌లాపాలు నిర్వ‌హించుకోవ‌చ్చు.
 • యాప్ స్టోర్ నుంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
 1. గ్రో యాప్‌:
 • మీ పెట్టుబ‌డుల‌ను ట్రాక్ చేసేందుకు డ్యాష్ బోర్డ్ ఉంటుంది.
 • మ్యూచువ‌ల్ ఫండ్ సిప్ క్యాలుక్యులేట‌ర్ ద్వారా రాబ‌డుల‌ను లెక్కించ‌వ‌చ్చు.
 • మ్యూచువ‌ల్ ఫండ్ల‌కు సంబంధించి నిపుణుల స‌ల‌హాలు పొంద‌వ‌చ్చు.
 • డైరెక్ట్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌కు బ‌దిలీ చేసుకునే సౌక‌ర్యాన్ని ఉచితంగా కల్పిస్తుంది.
 • మ్యూచువ‌ల్ ఫండ్ల అమ్మ‌కం, కొనుగోలు చాలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు.
 • మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల‌కు సంబంధించి ట్రాకింగ్ చేసే విధానంలో ఈ యాప్ చాలా ఆధార‌ణ పొందిది. ఈ యాప్‌ని మీరు యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
 1. పేటీఎమ్ మ‌నీ:
  మ్యూచువ‌ల్ పెట్టుబ‌డుల‌లో ఇదొక కొత్త యాప్‌, దీనిలో పేప‌ర్ వ‌ర్క్ చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.
 • డిజిట‌ల్ కేవైసీ, 30 నిమిషాల‌లోనే ఆన్‌లైన్ ద్వారా మదుపు చేసేందుకు ఖాతాను తెరువ‌వ‌చ్చు.
 • ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్‌తో మీ ఖాతాను ట్రాక్ చేసుకోవ‌చ్చు.
 • మ్యూచువ‌ల్ ఫండ్ల జాబితాను చూపించ‌టంతో పాటు బుక్‌మార్క్ చేసే సౌక‌ర్యాన్ని కూడా అందుబాటులో ఉంది
 • పెట్టుబ‌డి పెట్టిన మొత్తం, స‌మ‌యం ఆధారంగా రాబ‌డిని లెక్కించేందుకు రిట‌ర్న్ క్యాలిక్యులేట‌ర్ అందుబాటులో ఉంటుంది.
 • ఏ స‌మ‌యంలోనైనా ఉచిత స్టేట్‌మెంటును పొంద‌వ‌చ్చు.
 • క‌మీష‌న్ ఉండ‌దు. లావాదేవీలు పూర్తి ఉచితంగా నిర్వ‌హించ‌వ‌చ్చు.
 • ప్ర‌స్తుతం ఉన్న మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఈ యాప్‌లోకి బ‌దిలీ చేసుకోవ‌చ్చు.
 • యూపీఐ ద్వారా పెట్టుబ‌డులు పెట్టే సౌక‌ర్యాన్ని అందిస్తుండ‌డంతో ఈ యాప్ ప్ర‌జాద‌ర‌ణ పొందుతుంది. ఈ యాప్‌ను యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
 1. ఈటీ మ‌నీ:
  ఇది పూర్తిగా ఆర్థిక ప్ర‌ణాళిక‌కు సంబంధించిన యాప్‌. మ్యూచువ‌ల్ ఫండ్లు ఇందులో ఒక భాగం మాత్ర‌మే. ఈ యాప్ ద్వారా న‌గ‌దు నిర్వ‌హ‌ణ‌, త‌క్ష‌ణ వ్య‌క్తిగ‌త రుణ స‌దుపాయం, ఎక్స్‌పెన్స్ ట్రాకింగ్ వంటివి చేయ‌వ‌చ్చు.
 • వ్యయం, ప్ర‌స్తుత సిప్‌, మ్యూచువ‌ల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోల‌ను ట్రాక్ చేయడం, నిర్వ‌హించ‌డం చేసుకోవ‌చ్చు.
 • సున్నా శాతం క‌మీష‌న్‌తో డెరెక్ట్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఏక‌మొత్తంగా గానీ, సిప్ ద్వారా గానీ మ‌దుపు చేయ‌వ‌చ్చు.
 • ఈఎల్ఎస్ఎస్‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా స్వ‌యం చాల‌కంగా ప‌న్ను ఆదా అవుతుంది.
 • త‌క్ష‌ణ వ్య‌క్తిగ‌త రుణం స‌దుపాయం ఉంటుంది.
 • వ్య‌యాన్ని ట్రాక్, నిర్వ‌హ‌ణ‌ చేయోచ్చు.
 • పెట్టుబ‌డులు, రుణం, వ్య‌య నిర్వ‌హ‌ణ వంటివి ఉండ‌డం వ‌ల్ల దీనిని 3 ఇన్‌1 యాప్‌గా చెప్పుకోవ‌చ్చు.

చివ‌రిగా:
పైన వివ‌రించిన మ్యూచువ‌ల్ ఫండ్ యాప్‌లతో పెట్టుబ‌డులు పెట్ట‌డంతో పాటు మీ పోర్ట్‌ఫోలియోను నిర్వ‌హ‌ణ చేసేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి. అయితే ఇందుకుకోసం మీరు అన్ని యాప్‌లోనూ లాగిన్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. మీకు న‌చ్చిన ఒక యాప్ నుంచి మ‌దుపు చేసి మీ ఫండ్లను మ‌రింత సుల‌భంగా నిర్వ‌హించుకోవ‌చ్చు. డైరెక్ట్ ప్లాన్లలో మదుపు చేయడం వల్ల మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly