మ్యూచువ‌ల్ ఫండ్ టైం స్టాంపింగ్‌

మ్యూచువల్ ఫండ్ల‌లో ఏ సమయంలో పెట్టుబడి పెడితే ఏరోజు ఎన్ఏవీ వర్తిస్తుందో తెలుసుకుందాం..

మ్యూచువ‌ల్ ఫండ్ టైం స్టాంపింగ్‌

పెట్టుబడి పెట్టేటప్పుడు మ్యూచువల్ ఫండ్ ద‌ర‌ఖాస్తు ఫారాన్ని ఏఎమ్‌సీకి లేదా సంబంధిత రిజిస్ట్రార్‌కు స‌మ‌ర్పించిన‌ప్పుడు ఫారంపై తేదీ, స‌మ‌యంతో ఒక ఎల‌క్ట్రానిక్ ముద్ర వేస్తారు. పెట్టుబ‌డి పెట్టిన‌ట్లుగా ఇదే తొలి రుజువు.

యూనిట్ల కేటాయింపు :

మ్యూచువ‌ల్ ఫండ్ ద‌ర‌ఖాస్తు ఫారాలపై తేదీ, స‌మ‌యంతో కూడిన ఎల‌క్ట్రానిక్ ముద్రను త‌ప్ప‌నిస‌రి చేస్తూ సెబీ నిబంధ‌న‌లు జారీ చేసింది. ద‌ర‌ఖాస్తు ఫారం అందుకున్న స‌మ‌యాన్ని, పెట్టుబ‌డి సొమ్ముకు త‌గిన‌ట్టు మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్ల కేటాయింపులు జ‌రుగుతాయి.

క‌టాఫ్ టైమింగ్స్‌:

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌లోపు అందే ద‌ర‌ఖాస్తు ఫారాల‌కు సంబంధించి ఫండ్లకు ఆ రోజుటి ఎన్ఏవీ వ‌ర్తింప‌జేస్తారు. అదే మ‌ధ్యాహ్నం 3 గంట‌ల త‌ర్వాత అందే ద‌ర‌ఖాస్తు ఫారాల‌కు మ‌రుస‌టి రోజు ఎన్ఏవీ ప్రకారం యూనిట్ల కేటాయింపు జ‌రుపుతారు.

లిక్విడ్ ఫండ్స్‌ మాటేంటి?

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌లోపు అందే ద‌ర‌ఖాస్తు ఫారాల‌కు అదే రోజు ఎన్ఏవీ వ‌ర్తింప‌జేసి యూనిట్ల కేటాయింపు చేస్తారు. 12 గంట‌ల త‌ర్వాత అందే ద‌ర‌ఖాస్తు ఫారాల‌కు మ‌రుస‌టి రోజు ఎన్ఏవీ వ‌ర్తింప‌జేసి యూనిట్లను కేటాయిస్తారు.

లాభ‌మేంటి:

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు స్టాక్ మార్కెట్ తో ముడిప‌డి ఉంటాయ‌న్న విష‌యం ఆఫ‌ర్ డాక్యుమెంట్ లో ప్ర‌ధానంగా క‌నిపిస్తుంది. మ్యూచువల్ ఫండ్ సంస్థ పెట్టుబడి పెట్టిన సాధనాల మార్కెట్

బ్రోక‌రింగ్ సంస్థ‌ల క‌టాఫ్ టైం :

బ్రోక‌రింగ్ సంస్థ‌ల క‌టాఫ్ టైం నిర్ణీత స‌మ‌యం కంటే ముందుగానే ముగుస్తుంది. ఎందుకంటే ఈ సంస్థ‌లు పెట్టుబ‌డిదారుల నుంచి సొమ్ము స్వీక‌రించి స‌రైన స‌మ‌యంలోగా ఫండ్ సంస్థ‌ల‌కు జ‌మ‌చేయాల్సి ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly