ఎన్‌పీఎస్ చందాదారులకు ఈ ప‌న్నులు మిన‌హాయింపు

50 ఏళ్లలోపు వ‌య‌సు వారి కోసం ఈక్విటీలో 75% వరకు పెట్టుబడిని ఎన్‌పీఎస్ అనుమతిస్తుంది

ఎన్‌పీఎస్ చందాదారులకు ఈ ప‌న్నులు మిన‌హాయింపు

మీరు నేరుగా లేదా మ్యూచువ‌ల్ ఫండ్ల ద్వారా స్టాక్స్‌లో పెట్టుబ‌డులు కంపెనీ లేదా స్టాక్, డివిడెండ్లను పంపిణీ చేసినప్పుడల్లా మీరు సెక్యూరిటీ లావాదేవీ పన్ను (ఎస్‌టిటి) తో పాటు డివిడెండ్ పంపిణీ పన్ను (డిడిటి) చెల్లించాలి. అయితే, మీరు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) ద్వారా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టినప్పుడు, ఈ ప‌న్నులు వ‌ర్తించ‌దు.

అంద‌రికీ అనుకూల‌మైన ప‌థ‌క‌మైన ఎన్‌పీఎస్, 50 ఏళ్లలోపు వ్యక్తుల కోసం ఈక్విటీలో 75% వరకు పెట్టుబడిని అనుమతిస్తుంది. 50 ఏళ్లు దాటితే, ఈ పరిమితి క్రమంగా ప్రతి సంవత్సరం 2.5% తగ్గుతుంది. మెచ్యూరిటీ లేదా 60 సంవత్సరాల వయస్సులో 50% ఈక్విటీ పెట్టుబ‌డుల‌కు ప‌రిమితం అవుతుంది. ఎన్‌పీఎస్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ ఖాతాలో 50% వరకు ఈక్విటీలలో పెట్టుబడి పెట్టవచ్చు.

ఈక్విటీలో ఎన్‌పీఎస్‌ పెట్టుబడులు పెన్షన్ ఫండ్ల ద్వారా జరుగుతాయి, కాని ఎన్‌పీఎస్‌ ట్రస్ట్, చందాదారుల తరపున పెట్టుబడులు పెడుతుంది. ఎన్‌పీఎస్‌ ట్రస్ట్‌కు ఎస్‌టిటి మరియు డిడిటి రెండింటినీ చెల్లించడం నుంచి మినహాయింపు ఉంది, దీంతో చందాదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థ‌ల‌కు ఈ మిన‌హాయింపులు లేవు.

ప్ర‌తీసారీ షేర్లు కొన‌డం లేదా అమ్మేట‌ప్పుడులు ఈ విలువ‌ రూ.5 ల‌క్ష‌లు ఉంటే ఎస్‌టిటి 0.1 శాతం వ‌ర్తిస్తుంది. ఎస్‌టీటీ రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మ్యూచువ‌ల్ ఫండ్ లావాదేవీలు చేసిన ప్ర‌తిసారి ఫండ్ నిక‌ర విలువ త‌గ్గుతుంది. కానీ ఎన్‌పీఎస్‌లో ఇలా జ‌ర‌గ‌దు.
డిడిటి స‌ర్ ఛార్జ్‌, సెస్‌ల‌తో క‌లిపి 20.56 శాతం వ‌ర్తిస్తుంది కంపెనీ డివిడెండ్ చెల్లించిన‌ప్పుడు. ఉదాహ‌ర‌ణ‌కు ఒక‌ కంపెనీ రూ.10 వేల డివిడెండ్ చెల్లిస్తే రూ.2,035 డిడిటి మినహాయించుకొని మీకు వ‌చ్చేది రూ.7,965 మాత్ర‌మే. ఎన్‌పీఎస్‌లో అయితే మొత్తం రూ.10 వేలు డివిడెండ్‌గా వ‌స్తుంది.

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో డివిడెండ్ ఆప్ష‌న్ ఎంచుకుంటే ద్వితీయ శ్రేణిలో డిడిటి చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈక్విటీల‌పై 11.648 శాతం, డెట్ ఫండ్ల‌పై 29.12 శాతం ప‌డుతుంది. ఖాతా మెచ్యూరిటీకి ముందు మీరు ఎన్‌పీఎస్ నుంచి ప్ర‌త్యేక‌ కారణాలతో 25% చొప్పును మూడు సార్లు పాక్షిక ఉపసంహరణలు చేయవచ్చు.

చివరగా, మీరు నేరుగా స్టాక్‌లలో పెట్టుబ‌డులు పెడితే, సంవత్సరంలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ డివిడెండ్‌లను స్వీకరిస్తే, మీరు అందుకున్న మొత్తానికి 10% చొప్పున ఇత‌ర‌ పన్నును చెల్లించాలి. అదే ఎన్‌పీఎస్‌లో అయితే ఇది వర్తించదు.

ఎస్‌టీటీ, డీడీటీ మినహాయింపులు చిన్నవిగా అనిపించవచ్చు, కానీ వాటి ప్రభావం కాలక్రమేణా పెరుగుతుంది. పదవీ విరమణ ప‌థ‌కాల‌ను ఎన్నుకునేటప్పుడు ఈ ఖర్చులను పరిగణించండి. ఫండ్లు, స్టాక్‌లు రిటైర్మెంట్ నిధిని ఏర్ప‌రుచుకోవ‌డంలో కూడా సహాయపడతాయి, కాని వాటికి ఎన్‌పీఎస్ మాదిరిగా ఎక్కువ పన్ను ప్రయోజనాలు లేవు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly