ఎన్ఆర్ఈ ఖాతాలో దేశీయ ఆదాయం డిపాజిట్ చేయవచ్చా?

ఎన్ఆర్ఈ ఖాతాలో, ఈ ఖాతా నుంచి చేసిన పెట్టుబడుల లాభాలు , విదేశీ నిధులను మాత్రమే నిర్వహించేందుకు వీలుంటుంది.

ఎన్ఆర్ఈ  ఖాతాలో దేశీయ ఆదాయం డిపాజిట్ చేయవచ్చా?

ఒక భారత పౌరుడి నివాస హోదా, ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 6 ద్వారా నిర్ణయిస్తారు . మీరు ఉద్యోగం కోసం కొన్ని సంవత్సరాలు విదేశాల్లో ఉండాలనుకుంటే చట్టం ప్రకారం, దేశంలో మీరు గత సంవత్సరంలో 182 కన్నా ఎక్కువ రోజులు గడిపి ఉండాలి. . అంటే 2019-20లో భారత దేశంలో 182 రోజులు అంతకంటే ఎక్కువ రోజులు ఉంటే భారతీయ పౌరుడుగానే కొనసాగుతారు . ఒకవేళ ఆలా లేకపోతే నాన్-రెసిడెంట్ పరిగణిస్తారు.

ఎన్ఆర్ఓ ఖాతా
ఒకసారి నాన్-రెసిడెంట్ గా గుర్తించిన తర్వాత మీ బ్యాంకు ఖాతాను విదేశీ ఖాతాగా (ఆర్డినరీ ) లేదా ఎన్ఆర్ఓ ఖాతాగా మార్చుకోవాల్సి ఉంటుంది . ఇది పొదుపు ఖాతా మాదిరిగానే పని చేస్తుంది . దేశీయంగా షేర్ల డివిడెండ్ , మ్యూచువల్ ఫండ్ల నుంచి వచ్చిన రాబడి , ప్రావిడెంట్ ఫండ్ వంటివి ఈ ఖాతాలో క్రెడిట్ చేసుకోవచ్చు. ఇందులో నుంచి ఫండ్లను దేశంలో పెట్టుబడులకు , ఇతర ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు .

ఎన్ఆర్ఈ ఖాతా
ఎన్ఆర్ఈ ఖాతాను కూడా ప్రారంభించవచ్చు. దీంతో విదేశాల నుంచి నగదును సులభంగా బదిలీ చేయవచ్చు. అయితే దేశీయ ఆదాయాన్ని ఇందులో డిపాజిట్ చేసేందుకు వీలుండదు. కేవలం ఎన్ఆర్ఈ నుంచి చేసిన పెట్టుబడులు, విదేశాల్లో సంపాదించిన నిధిని మాత్రమే జమ చేసుకునేందుకు వీలుంటుంది . ఇతర ఖాతాలకు లేదా ఎన్ఆర్ఓ ఖాతాలకు చెల్లింపులు చేయవచ్చు.

పీఎఫ్ ఖాతా
పీఎఫ్ కోసం కొత్తగా ఎలాంటి కేటాయింపులు చేయకపోతే ఖాతాలో ఉన్న వడ్డీ ఆదాయంపై పన్ను ఉంటుంది . అయితే పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకొని తాజాగా పెట్టుబడులు చేయాల్సిందిగా సూచిస్తారు. రిస్క్ ఆధారంగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లు డెట్ , ఈక్విటీ కలిపి ఉంటాయి కాబట్టి ఈ పెట్టుబడులు ఎంచుకోవడం మంచిది.

మ్యూచువల్ ఫండ్లలో ప్రస్తుతం ఉన్న పెట్టుబడులు సిప్ విధానంలో కొనసాగించవచ్చు . అయితే మ్యూచువల్ ఫండ్లను ఎన్ఆర్ఓ ఖాతాతో జత చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డీమ్యాట్ ఖాతాను ఎన్ఆర్ఓ డీమ్యాట్ ఖాతా గా మార్చాల్సి ఉంటుంది లేదా కొత్త ఖాతాను ప్రారంభించాల్సి ఉంటుంది. అప్పుడు కొత్త ఖాతాలోకి ఫండ్లు బదిలీ అవుతాయి.

(Source: Livemint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly