ఆర్థిక ప్రణాళిక అవ‌స‌ర‌మెంత‌?

జీవితం ఊహించని మలుపులతో ఉంటుంది. భవిష్యత్తును ఎవరూ అంచనా వేయలేరు. మనం దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలగాలి. జవాబులు లేని ప్రశ్నలెన్నింటిౖకీ సమాధానాలు వెతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆర్థిక ప్రణాళిక అవ‌స‌ర‌మెంత‌?

చిన్న చిన్న ప్రణాళికలతో జీవితాన్ని మనం కోరుకున్న విధంగా మలచుకోవచ్చు. మనకు అవసరమైన పనులన్నీ వాటంతటవే జరిగిపోతుంటే ఎంత సంతృప్తి కలుగుతుందో చెప్పలేం. జీవితం ఊహించని మలుపులతో ఉంటుంది. భవిష్యత్తును ఎవరూ అంచనా వేయలేరు. మనం దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలగాలి. జవాబులు లేని ప్రశ్నలెన్నింటిౖకీ సమాధానాలు వెతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నాకేమీ జ‌ర‌గ‌దు అనే భ్ర‌మ కూడ‌దు…
సామాజిక ఆర్థిక మార్పులు మన జీవనశైలిని సులభతరం చేశాయి. వాటిని ఎదుర్కొనేందుకు మనం ఆర్థికంగా సిద్ధంగా ఉన్నామా అనేది చూసుకోవాలి. నాకేమీ జరగదు… ఒకవేళ జరిగినా అప్పటికప్పుడు చూసుకోవచ్చు అనే భ్రమలో ఉండకండి. వాస్తవ ధోరణిలో ఉండి ఆలోచించండి.

ప్ర‌శ్న‌ల‌న్నింటికీ స‌మాధానం ఏమిటి?

మీ పెట్టుబడులకు పన్ను మినహాయింపులు ఉన్నాయా? మీ తదనంతరం మీ కుటుంబసభ్యులు క్షేమంగా ఉంటారా? మీ పిల్లల చదువులు, వాళ్ల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా ఉందా? మీ పదవీ విరమణ తర్వాత కావలసినంత డబ్బు ఉంచుకున్నారా?
పైన పేర్కొన్న ప్రశ్నలన్నింటికీ మీ సమాధానం ‘అవును’ అయితే ఫర్వాలేదు. ఏ ఒక్కదానికి ‘కాదు’ అనే సమాధానం అని ఉన్నా భవిష్యత్తులో ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది.

స‌మాధానాలు సృష్టించుకోవాలి
ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలి? ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆర్థికంగా స్వేచ్ఛగా ఉండగలమా లేదా ఒకరిపై ఆధారపడాల్సి ఉంటుందా? మనం పనిచేసే కంపెనీ నుంచి అన్ని లాభాలను పొందగలుగుతున్నామా? మన బాధ్యతలు, అవసరాలు, కోరికలు, లక్ష్యాలను, కలలను సాధించేందుకు సరైన ప్రణాళిక రూపొందించుకున్నామా లేదా చూసుకోవాలి. మన తర్వాత మన ఆస్తులు ఎవరికి చెందుతాయి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఉండవు. అయితే మనం వీటికి సమాధానాలను సృష్టించుకోవచ్చు.

ల‌క్ష్యాలు నెర‌వేరే దిశ‌గా…
ఈ ఇంటర్నెట్‌ యుగంలో సులభంగా సంపాదించగలుగుతున్నాం. ఖర్చుల గురించి కూడా ఆలోచిస్తే ఎక్కువ మదుపుచేసి సంపద సృష్టించుకోగలుగుతారు.
ఆర్థిక ప్రణాళికంటే మీ వద్ద ఉన్న వనరులను, రాబోయే ఆదాయ వనరులను ఒకచోట చేర్చి మన బాధ్యతలు, కలలు, లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ప్రయత్నించడం.

ఆర్థిక ప్రణాళిక అవ‌స‌ర‌మేమిటి?

ప్రపంచంలో మార్పు ఒక్కటే శాశ్వతమైనది. మీరు మారితే మీ ఆశయాలు మారతాయి, మీ జీవనవిధానంలో మార్పు వస్తుంది, పరిస్థితులు మారతాయి. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది. ఆర్థిక ఉత్పత్తులు, సేవల్లో మార్పు వస్తుంది.

పడిపోతున్న ఆదాయం, పెరుగుతోన్న ఖర్చులు, జీవనశైలి మార్పులు, ఉపాధి అస్థిరత్వం, విచ్ఛిన్న కుటుంబాలు … ఈ పరిస్థితులన్నీ ఆర్థిక ప్రణాళిక రూపొందించేందుకు పురిగొల్పుతాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly