మనకు ఆర్ధిక సలహాదారుని అవసరం ఉందా?

ఆర్థిక స‌ల‌హాదారులు మీ ల‌క్ష్యాల‌కు త‌గిన‌ సలహాలు, సూచనలు చేస్తూ, వ్యక్తిగత ఆర్థిక‌ అభివృద్ధికి కృషి చేస్తారు.

మనకు ఆర్ధిక సలహాదారుని అవసరం ఉందా?

కంపెనీలకు సిఎఫ్ఓ - చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ ఉంటారు. కంపెనీ ఆర్ధిక విషయాలైన ఖాతా పుస్తకాలు, పన్నులు, విశ్లేషణ, పధక రచన, మూలధన సమీకరణ , లాభాలను పెంచేందుకు వ్యూహ రచన, నగదు సమకూర్చడం, ప్రభుత్వం ప్రకటించే విధానాలను ఎలా ఉపయోగించుకోవచ్చు వంటి అనేక వాటిని చూస్తూవుంటారు.

ఇటువంటి విషయాలలో కంపెనీ కార్యనిర్వహాణాధికారికి సలహాలు ఇవ్వడం ద్వారా కంపెనీ అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంటారు. కంపెనీ అందించే వస్తు సేవలలో ఖర్చు తగ్గించి, దీర్ఘకాలంపాటు లాభాలబాట నడిచేందు కృషిచేస్తుంటారు. కాలానుగుణంగా వస్తున్నమార్పులను , ప్రభుత్వ విధానాలను గమనిస్తూ కంపెనీపై వాటి ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూసి తగిన సలహాలను, సూచనలను అందిస్తుంటారు. ఇటువంటి వారి అవసరము ప్రతి కంపెనీ కి ఉంటుంది.

అలాగే, ప్రతి వ్యక్తి తన కుటుంబం కోసం ఎంతో కష్టపడి సంపాదిస్తారు. మారుతున్న కాలంతో సంపాదన పెరగడంతోపాటు జీవనప్రమాణాలు, జీవన విధానములో మార్పులు వస్తుంటాయి. కొన్ని ఆర్ధిక లక్ష్యాలను చేరుకోవటానికి వివిధ పద్ధతులలో మదుపు చేస్తుంటారు. అయితే చాలా విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోకుండానే చేస్తుంటారు. ఎందుకంటే అందరికి అన్ని విషయాలు తెలుసుకోవటం సాధ్యం కాదు కాబట్టి. దీని కోసం చుట్టుపక్కల బంధువులు, స్నేహితులు, సహచర ఉద్యోగులు, బ్యాంకు లేదా బీమా ఉద్యోగులు, ఏజెంట్ల సలహాలు పాటిస్తుంటారు. దీని వలన చాలా లక్ష్యాలకు తగిన మదుపు జరగదు. చేతిలో సొమ్ము ఉంటె ఎక్కడో అక్కడ మదుపు చేస్తాం.

ప్రతి లక్ష్యాన్ని చేరుకోవాలంటే కొన్ని పద్ధతులను పాటించాలి. దీని కోసం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి.
ముందుగా ఆ లక్ష్యం ప్రస్తుత ఖర్చు ఎంత ? దానికి తగిన ద్రవ్యోల్బణం ఎంత ఉంటుంది? ఆ లక్ష్యం చేరటానికి ఎంత సమయం ఉంది, ఎటువంటి వాటిలో మదుపు చేయాలి, వాటిపై ఎంత రాబడి వస్తుంది, పెట్టుబడి కి భద్రత, పన్నుల ప్రభావం ఏమిటి వంటి విషయాల గురించి తెలుసుకోవాలి. కొన్ని సార్లు మన జీవన విధానం, అవసరాలలో మార్పు, ప్రభుత్వ విధానాలలో వచ్చే మార్పు వంటి వాటిని గమనిస్తూ, మన పెట్టుబడులలో కూడా మార్పులు చేయాలి. అయితే, ఇటువంటి విషయాల గురించి ఆలోచించే అవగాహన గాని, సమయం గాని అందరికి ఉండదు.

ఇటువంటి సమస్యలనుంచి బయట పడడానికి సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ప్లానర్ (సి.ఎఫ్.పీ)ను సంప్రదించవచ్చు. వీరు వ్యక్తిగత ఫైనాన్సియల్ అడ్వైజర్ గా సలహాలు, సూచనలు చేస్తూ, వ్యక్తిగత ఆర్ధిక అభివృద్ధికి కృషి చేస్తారు. ఫీజు చెల్లించటం ద్వారా తగిన సహాయం పొందవచ్చు. వారిని జవాబుదారునిగా చేయవచ్చు. మీకు ఎటువంటి సందేహాలు ఉన్న సమయానుకూలంగా తగిన సహాయం చేస్తారు.

అధిక ఆదాయం ఉన్నవారు ఒక సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ప్లానర్ ను సంప్రదించినట్లైతే , మరింత దీర్ఘకాలంలో లాభపడే అవకాశాలు ఉంటాయి. సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ప్లానర్ కోసం ఈ కింది లింకు ద్వారా తెలుసుకొనండి :
https://india.fpsb.org/cfp-certificants-directory/?search_by=&search=&city=&state=&employment=

వీరు ఫైనాన్సియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ (యు ఎస్ ఏ) లో రిజిస్టర్ అయి ఉంటారు.

ముగింపు:
ప్రతి ఒక్కరు తమ లక్ష్యాలను గుర్తించి ఆర్ధిక ప్రణాళిక చేసుకున్నట్లైతే దీర్ఘకాలంలో మంచి వృద్ధిని సాధించాలని ఆశిస్తున్నాము. అయితే, చాలా మంది ఇండిపెండెంట్ ఫైనాన్సియల్ అడ్వైసర్ ల పేరిట సలహాలు, సూచనలు ఇస్తుంటారు. వీరి ముఖ్య ఉద్దేశ్యం వారి వారి పెట్టుబడి/బీమా పధకాలను అమ్మడమే అని గమనించండి. దీని వలన మీకంటే వారికే ఉపయోగం ఎక్కువ.

కింది పట్టిక ను గమనిస్తే, 25 దేశాలలో మొత్తం రిజిస్టర్ అయి ఉన్న1,81,360 సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ప్లానర్ లలో , జనాభా ప్రాతిపదిక తీసుకుంటే మన దేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు.
CFPs rev.jpg

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly