మ‌హిళలకు జీవిత‌ బీమా త‌ప్ప‌నిస‌రి.. ఎందుకంటే ..

కుటుంబం సంక్షేమం కోసం మ‌హిళ‌ల‌కు కూడా జీవిత‌ బీమా త‌ప్ప‌నిస‌రి అనే విషంయ గుర్తించాలి.

మ‌హిళలకు జీవిత‌ బీమా త‌ప్ప‌నిస‌రి.. ఎందుకంటే ..

బీమా నియంత్ర‌ణ సంస్థ ఐఆర్‌డీఏఐ వివ‌రాల ప్ర‌కారం 2017-18 సంవ‌త్స‌రంలో 90 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌లు జీవిత బీమా పాల‌సీలు తీసుకున్నారు. అదే స‌మ‌యంలో 1.91 కోట్ల పాల‌సీలు పురుషులు ఈ పాల‌సీల‌ను కొనుగోలు చేశారు. అంటే మొత్తం బీమా పాల‌సీల‌లో మ‌హిళ‌లు తీసుకున్న పాల‌సీలు ఒక‌టిలో మూడ‌వ వంతు. అయితే ప్రైవేటు బీమా సంస్థ‌లు తీసుకుంటున్న చొర‌వ‌తో గ‌త ద‌శాబ్దంతో పోలిస్తే మ‌హిళ‌లు బీమా పాల‌సీల కొనుగోలు పెరిగాయ‌నే చెప్పుకోవ‌చ్చు. 2017-18 లో బీమా ఏజెంట్లు , మ‌ద్య‌వ‌ర్తీయులు ప్ర‌తి 10 వేల మ‌హిళ‌ల జ‌నాబాలో 139 మ‌హిళ‌ల‌కు పాల‌సీల‌ను విక్ర‌యించారు. అంటే చాలావ‌ర‌కు మ‌హిళ‌లు జీవిత బీమా పాల‌సీని త‌మ‌కు అవ‌స‌రంగా భావించ‌లేదు. దీంతో ఆర్థిక ప్ర‌యోజ‌నాలు లేవ‌నే ఉద్దేశంతో ఉన్నారు. దీనిప‌ట్ల మ‌హిళ‌ల‌కు అవ‌గాహ‌న పెంచాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే బీమా సంస్థ‌లు కూడా మ‌హిళ‌ల‌ను దృష్టిలో పెట్టుకొని వారికి ప్ర‌యోజ‌నాల‌ను క‌ల్పించే మ‌రిన్ని పాల‌సీల‌ను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంది.

బీమాతో ఆర్థిక భ‌ద్ర‌త‌

సంపాదించే వ్య‌క్తి మ‌ర‌ణిస్తే జీవిత బీమా పాల‌సీ కుటుంబ స‌భ్యుల‌కు ఆర్థిక భ‌ద్ర‌త ఇస్తుంది. సాధార‌ణంగా పురుషులే ఈ పాల‌సీని తీసుకోవ‌డం చూస్తుంటాం. ఒక ఇంట్లో మూడు లేదా నాలుగో పాల‌సీ భార్య లేదా పిల్లల పేరుతో ఉంటుంది. పురుషుల‌తో పోలిస్తే మ‌హిళ‌ల‌కు జీవిత‌కాలం ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి వారిక క్ర‌మ‌మైన‌ ఆర్థిక ప్ర‌ణాళిక అవ‌స‌రం. ముఖ్యంగా జీవిత బీమా పాల‌సీ తీసుకోవ‌డం సూచించ‌ద‌గిన‌ది. 60 ఏళ్ల వ‌య‌సులో మెచ్యూరిటీ పూర్త‌య్యే జీవిత బీమా పాల‌సీ తీసుకోవ‌డం మేలు.

స‌మ‌యానికి ప్రీమియం చెల్లించడం

ప్రీమియం స‌మ‌యానికి తేదికి ముందే చెల్లించ‌డం లేదా గడువు లోగా చెల్లించ‌డం పూర్తి చేస్తే జీవిత బీమా పాల‌సీని త‌రచుగా స‌మీక్షించాల్సిన అవ‌స‌రం లేదు. ఫండ్ల మాదిరిగా సంద‌ర్భాన్ని బ‌ట్టి ఒక‌దాని నుంచి మ‌రొక దానికి మార్చాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. పాల‌సీని మ‌ధ్య‌లో నిలిపివేసే అవ‌కాశం ఉండ‌దు. బోన‌స్‌తో క‌లిపి హామీ రూపంలో ల‌భిస్తుంది. 60 ఏళ్ల త‌ర్వాత మెచ్యూరిటీ ఉంటే బీమా సంస్థ నుంచి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎక్కువ మొత్తంలో మ‌హిళ‌లు హామీ పొంద‌వ‌చ్చు. యాన్యుటీ పాల‌సీని తీసుకోవ‌చ్చు లేదా ఏవైనా ఇత‌ర‌ అవ‌స‌రాలు ఉంటే ఉప‌యోగించుకోవ‌చ్చు. మ‌హిళ‌ల దీర్ఘాయువును దృష్టిలో పెట్టుకొని కొన్ని కంపెనీలు వారికి త‌క్కువ ప్రీమియం చెల్లించే అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నాయి.

సామాజిక భ‌ద్ర‌త‌
కొంత‌మంది మ‌హిళ‌లు వృత్తి ప‌రంగా లేదా ఆరోగ్యం ప‌రంగా త‌మ‌కు ప్ర‌మాదం ఉంద‌ని తెలిసిన‌ప్పుడు బీమా పాల‌సీ తీసుకుంటారు. అనాధ పిల్ల‌ల‌కు లేదా త‌ల్లిదండ్ర‌లు కోల్పోయిన పిల్ల‌ల‌కు ఎలాంటి సామాజిక భ‌ద్ర‌త ఉండ‌దు కాబ‌ట్టి మ‌హిళ‌లు వారి పిల్ల‌ల కోసం జీవిత బీమా పాల‌సీ తీసుకోవాల్సిన అస‌వ‌రం త‌ప్ప‌క ఉంటుంది. గృహిణులు బీమా పాల‌సీ తీసుకుంటే ప్రీమియం త‌మ భ‌ర్త ఆదాయం నుంచి చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు వారికి సెక్ష‌న్ 80సీ ప్ర‌కారం ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. అదేవిదంగా సంపాద‌న ఉన్న మ‌హిళ‌లు కూడా ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు. క్లెయిమ్ చేసుకున్న‌ప్పుడు కూడా ప‌న్ను ఉండ‌దు.

భ‌ర్త క‌చ్చితంగా త‌మ భార్య పేరుతో ఒక జీవిత బీమా పాల‌సీ తీసుకోవాలి. అది భార్య‌కు 60 ఏళ్లు వ‌చ్చేనాటికి మెచ్యూరిటీ పూర్త‌య్యే విధంగా ఉండాలి. ఒక‌వేళ భ‌ర్త‌, భార్య పేరుతో పాల‌సీ తీసుకోక‌పోతే త‌మ పేరుతో జీవిత బీమా పాల‌సీని మ‌హిళ ఆస్తి చ‌ట్టం (MWP) కింద కొనుగోలు చేయాలి. MWP తో పాల‌సీలు కొనుగోలు చేస్తే వ‌చ్చిన డ‌బ్బును కేవ‌లం భార్య‌, పిల్లల సంక్ష‌మానికే ఉప‌యోగిస్తారు. ఏ కార‌ణాల చేత ఇత‌ర అధికారానికి ఇది వ‌ర్తించ‌దు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly