రెండు రోజులు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌..

అభిమానులు డిసెంబ‌రు 5,6 తేదీలో సి‌నిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ఇత‌ర‌ కంటెంట్‌‌ను ఉచితంగా వీక్షించ‌వ‌చ్చు

రెండు రోజులు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌..

అమెరికాకు చెందిన కంటెంట్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాట్ నెట్‌ఫ్లిక్స్‌ డిసెంబ‌రు 5,6 తేదిలో ‘స్ట్రీమింగ్ ఫెస్ట్’ నిర్వ‌హిస్తున్న‌ట్లు శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. దీంతో చందాదారులు కానీ వారు కూడా ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ అనుభూతిని పొంద‌వచ్చు.

భార‌త ఓటీటీ(ఓవ‌ర్ ది టాప్‌) మార్కెట్లో అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్ని+హాట్‌స్టార్‌, జీ5 వంటి అభివృద్ధి చెందిన ప్లాట్‌ఫామ్‌ల‌కు గ‌ట్టిపోటీ ఇస్తూ మ‌రింత మంది కొత్త వినియోగ‌దారులను నెట్‌ఫ్ల‌క్స్‌కి తీసుకురావ‌డం ల‌క్ష్యంగా స్ట్రీమింగ్ ఫెస్ట్‌ను నిర్వహిస్తున్న‌ట్లు సంస్థ తెలిపింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అద్భుత‌‌మైన క‌థ‌ల‌ను భార‌త దేశంలోని వినోద అభిమానులంద‌రికి అందుబాటులోకి తీసుకురావ‌ల‌ని మేము భావిస్తున్నాం. ఇందుకోసం డిసెంబ‌రు 5,6 తేదీల్లో(డిసెంబ‌రు 5 రాత్రి 12.01 గంట‌ల నుంచి డిసెంబ‌రు 6 రాత్రి 11.59 గంట‌ల వ‌ర‌కు) నెట్‌ఫ్ల‌క్స్ కంటెంట్‌ను పూర్తి ఉచితంగా అందిస్తున్నాం. అని నెట్‌ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్(కంటెంట్‌) మోనికా షెర్గిల్ చెప్పారు.

చందాదారులు కాని వారు ఉచితంగా స్ట్రీమింగ్ ప్రారంభించేందుకు, త‌మ పేరు, ఈమెయిల్/ ఫోన్ నెంబ‌రు సంబంధిత పాస్‌వ‌ర్డ్‌తో సైన‌ప్ అవ్వాల్సి ఉంటుంది. స్ట్రీమ్‌ఫెస్ట్‌లో లాగిన్ అయిన ఎవ‌రైనా స్టాండ‌ర్డ్ డెఫినెషెన్‌లో వీక్షించ‌వ‌చ్చు. ఒక లాగిన్ ఐడితో ఒక్క‌రిని మాత్ర‌మే అనుమ‌తిస్తారు. అందువ‌ల్ల ఒక‌రి లాగిన్ స‌మాచారాన్ని మరొక‌రు ఉప‌యోగించేందుకు వీలుండ‌దు. వీక్ష‌కుల సంఖ్య‌ను ప‌రిమితం చేయ‌డం వ‌ల్ల ప్ర‌తీ ఒక్క‌రికి మొరుగైన స్ట్రీమింగ్ అనుభ‌వం ల‌భిస్తుందని షెర్గిల్ తెలిపారు.

స్ట్రీమ్‌ఫెస్ట్‌లో లాగిన‌య్యే వినియోగదారులకు, ప్ర‌స్తుతం ఉన్న చంద‌దారుల మాదిరిగానే ప్రొఫైల్‌లను(పిల్ల‌ల ప్రొఫైల్స్‌తో స‌హా) క్రియేట్ చేయ‌డం, తల్లిదండ్రుల నియంత్రణలను సెట్ చేయడం, హిందిలో బ్రౌజ్ చేయడం, సిరీస్\ సినిమాల‌ను 'నా జాబితా’కు జోడించడం, వంటి ప్ర‌తీ ఫీచ‌ర్ అందుబాటులో ఉంటుంద‌ని షెర్గిల్ వివరించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌మ‌కు 195.15 పేయిడ్ స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నార‌ని ఆమె తెలిపారు. అయితే ఏ దేశం నుంచి ఎంత మంది వినియోగ‌దారులు ఉన్నార‌నే వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేదు.

నెట్‌ఫ్లిక్స్ 2016లో భార‌త్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ప్ర‌స్తుతం నెట్‌ఫ్లిక్స్ మూడు స్లాబ్‌ల‌(రూ.499, రూ.699, రూ.799)లో నెల‌వారి స‌బ్‌స్క్రిప్ష‌న్ ప్లాన్‌ను అందిస్తుంది. ఇవి కాకుండా నెల‌కు రూ.199ల‌తో మ‌రొక ప్లాన్‌ను కూడా అందుబాటులో ఉంచింది. అయితే ఇది మొబైల్ యాప్ వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంది.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly