ఐటీఆర్ ఫైలింగ్‌ కోసం పాస్‌పోర్ట్, విదేశీ ప్ర‌యాణ వివ‌రాలు

ఆదాయపు పన్ను విభాగం ఇప్పుడు మీ విదేశీ ప్రయాణ ఖర్చులు, విద్యుత్ బిల్లు చెల్లింపులను కూడా ప‌రిశీలించ‌నుంది

ఐటీఆర్ ఫైలింగ్‌ కోసం పాస్‌పోర్ట్, విదేశీ ప్ర‌యాణ వివ‌రాలు

వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి ఐటీఆర్ ఫైలింగ్ చేసేముందు మీ ఆదాయం, పెట్టుబ‌డుల వివ‌రాల‌తో పాటు పాస్‌పోర్ట్, విదేశీ ప్ర‌యాణాలు, విద్యుత్ బిల్లులు వంటివి కూడా అవ‌స‌ర‌మ‌వుతాయి. ఆదాయ ప‌న్ను శాఖ 2020-21 మ‌దింపు సంవ‌త్స‌రానికి ఆదాయ ప‌న్ను ఫారంల‌లో చేసిన మార్పులు ఇందుకు కార‌ణం. ప్ర‌తి ఏడాది ఐటీ శాఖ ఐటీఆర్‌-1 నుంచి ఐటీఆర్‌-7 వ‌ర‌కు ఏడు ఫారంల‌ను విడుద‌ల చేస్తుంది. వ‌చ్చే ఏప్రిల్ నుంచి ప్రారంభ‌మ‌య్యే కొత్త ఆర్థిక సంవ‌త్స‌రానికి ఇప్పుడు ఐటీఆర్ -1 (స‌హ‌జ్‌), ఐటీఆర్-4 (సుగ‌మ్‌) జారీచేసింది. త్వ‌ర‌లో అన్ని విడుద‌ల చేయ‌నుంది.

ఐటీఆర్ ఫారంల‌లో చేసిన మార్పులు

  1. వ‌చ్చే ఏడాది నుంచి బ్యాంకు క‌రెంటు ఖాతాలో కోటి రూపాయ‌ల‌కు పైగా జమ చేసిన, విదేశీ ప్రయాణానికి రూ. 2 లక్షలు ఖ‌ర్చు చేసినా లేదా సంబంధిత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ బిల్లు లక్ష రూపాయ‌లు దాటిన వారికి ఐటీఆర్‌-1 ఫారం వ‌ర్తించ‌దు.
  2. ఐటీఆర్ 1 ఫారమ్‌ను సాధారణ వ్య‌క్తులు దాఖ‌లు చేయ‌వ‌చ్చు. వేత‌నం, వృత్తి, వ్యాపారం, అద్దె, వ‌డ్డీ, పెన్ష‌న్‌ ద్వారా వ‌చ్చే ఆదాయం రూ.50 ల‌క్ష‌లు మించ‌నివారికి ఇది వ‌ర్తిస్తుంది. ఇక ఐటీ ఐటీఆర్‌-4 ఫారం వ్య‌క్తులు, హిందు అవిభాజ్య కుటుంబాలు, సంస్థలకు (ఎల్ఎల్‌పీ కాకుండా) మొత్తం ఆదాయం రూ. 50 లక్ష‌లు మించ‌నివారికి ఉంటుందిజ‌. వ్యాపారం, వృత్తి లేదా వడ్డీ ఆదాయం మొదలైన వాటి నుంచి ఆదాయం పొందిన‌వారు దీనిని దాఖ‌లు చేయాలి.
  3. మీరు వేరొకరితో క‌లిపి ఉమ్మ‌డిగా ఇంటిని కలిగి ఉంటే, అప్పుడు మీరు ఐటీఆర్‌ ఫైల్ చేయడానికి ఐటీఆర్ 1 లేదా ఐటీఆర్‌ 4 ఫారమ్‌ను ఉపయోగించలేరు.
  4. మీకు పాస్‌పోర్ట్ ఉంటే ఐటీఆర్ 1, ఐటీఆర్ 2 ఫైలింగ్ చేసేందుకు పాస్‌పోర్ట్ నంబ‌ర్‌ అవ‌స‌రం ఉంటుంది
  5. ఐటీఆర్ 4 ఫారం, మీ విదేశీ ప్ర‌యాణాల‌కు రూ.2 ల‌క్ష‌ల కంటే ఎక్కువ ఖ‌ర్చు చేస్తే ఆ వివ‌రాలు అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా విద్యుత్ బిల్లుల‌పై సంవ‌త్స‌రానికి ల‌క్ష రూపాయ‌ల కంటే ఎక్కువ ఖ‌ర్చు చేశారా లేదా అనే వివ‌రాలు తెల‌పాల్సి ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly