ఐటీర్ ఫార‌మ్‌ల ఫైలింగ్‌లో చోటుచేసుకున్న 10 మార్పులు

2019-20 మ‌దింపు సంవ‌త్స‌రానికి ఐటీర్‌-1, ఐటీర్ -4 ఫార‌మ్‌లు ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఈ-ఫైల్లింగ్ పోర్ట‌ల్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఐటీర్ ఫార‌మ్‌ల ఫైలింగ్‌లో చోటుచేసుకున్న 10 మార్పులు

నూత‌న‌ అసెస్మెంటు(మ‌దింపు) సంవత్స‌రం 2019-20 గానూ ఆదాయ‌పు ప‌న్ను శాఖ, కొత్త ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్‌(ఐటీఆర్‌) ఫారమ్‌ల‌ను నోటిఫై చేసింది. గ‌త సంవ‌త్స‌రం మాదిరిగానే ఈ సంవ‌త్స‌రం కూడా ఏడు ఐటీఆర్ ఫార‌మ్‌ల‌ను విడుద‌ల చేసింది. 2019-20 అసిస్మెంటు సంవ‌త్స‌రానికి ఐటీర్‌-1, ఐటీర్ -4 ఫార‌మ్‌లు, ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఈ-ఫైల్లింగ్ పోర్ట‌ల్‌లో ఇప్ప‌టికే అందుబాటులో ఉండ‌గా, ఇత‌ర ఐటీర్ ఫార‌మ్‌ల‌ను త్వ‌ర‌లోనే అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు ఐటీ శాఖ తెలిపింది. ఐటీర్ ఫార‌మ్‌ల‌ను ప్ర‌తీ సంవ‌త్స‌రం అప్‌డేట్ చేస్తారు. ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభానికి ముందు ప్ర‌వేశ‌పెట్టిన ఆర్థిక బిల్లు ప‌న్ను నిబంధ‌న‌ల‌లో చేసిన మార్పుల‌కు అనుగుణంగా ఐటీఆర్ ఫార‌మ్‌లను అప్‌డేట్ చేస్తారు. 2019-20 అసెస్మెంటు సంవ‌త్స‌రానికి ప్ర‌వేశపెట్టిన ఐటీర్ ఫార‌మ్‌ల‌లో వ‌చ్చిన 10 మార్పుల‌ను ఇప్పుడు ప‌రిశీలిద్దాం.

ద‌ర‌ఖాస్తు చేయాల్సిన ఫార‌మ్‌లు:

 1. ఐటీఆర్ ఫార‌మ్‌-1:
  వేత‌నం, హౌస్ ప్రాప‌ర్టీ, వ‌డ్డీ ఆదాయం వంటి ఇత‌ర‌ ఆదాయ వ‌న‌రుల‌ ద్వారా వ‌చ్చే ఆదాయం రూ. 50 ల‌క్ష‌లు లోపు ఉన్న వారు, వ్య‌య‌సాయం నుంచి వ‌చ్చిన ఆదాయం రూ.5 వేలు మించ‌ని వారు ఐటీఆర్‌-1 ఫార‌మ్‌ను దాఖ‌లు చేయాల్సి ఉంటుంది. అయితే ఒక సంస్థ‌కు డైరెక్ట‌ర్‌గా ఉన్నా, వ్య‌క్తి పేరుపై అన్‌లిస్టెడ్ ఈక్వీటీ షేర్లు ఉన్నా, ఇత‌ర వ్య‌క్తుల‌చే టీడీఎస్(మూలం వ‌ద్ద ప‌న్ను) డిడ‌క్ట్ అయిన వారు ఐటీఆర్‌-1 ఉప‌యోగించ‌కూడ‌ద‌ని నంగియా అడ్వైజర్స్ Llp (ఆండ‌ర్‌స‌న్‌ గ్లోబల్), చార్టర్డ్ అకౌంటెన్సీ సంస్థ డైరెక్టర్, శైలేష్ కుమార్ తెలిపారు.

 2. ఐటీఆర్ ఫార‌మ్‌-4:
  మొత్తం ఆదాయం రూ. 50 ల‌క్ష‌లు ఉన్న‌వ్య‌క్తులు, హిందూ అవిభాజ్య కుంటుంబాలు, సంస్థ‌లు(లిమిటెడ్ లైబిలిటీ భాగ‌స్వామ్యం ఉన్న కంపెనీలు త‌ప్ప‌) ఐటిఆర్-4 ఫారంల‌ను దాఖలు చేయ‌వ‌చ్చు. అంచనాల పన్ను చెల్లింపు పథకం కిందకి వ‌చ్చేవారు ఇందులోకి రారు. అయితే భార‌త‌దేశంలో నివ‌సించ‌ని వారు, నాన్‌- రెసిడెంట్ భాగ‌స్వామ్య సంస్థ‌లు, కంపెనీ డైరెక్ట‌ర్లు, అన్‌లిస్టెడ్ షేర్లులో పెట్టుబ‌డి పెట్టిన వారు, ఒక‌టి కంటే ఎక్క‌వ ఇళ్లు క‌లిగిన వారు ఈ ఫార‌మ్‌ల‌ను ఉప‌యోగించ‌కూడ‌ద‌ని కుమార్ తెలిపారు.

 1. కాంటాక్ట్ వివ‌రాలు:
  మీరు ఐటీర్‌-1 ఫారం దాఖ‌లు చేస్తుంటే, మీరు భార‌త‌దేశంలో నివ‌సిస్తున్న చిరునామా, మోబైల్ నెంబ‌రు వివ‌రాల‌ను త‌ప్ప‌నిస‌రిగా న‌మోదు చేయాలి. దీని ద్వారా ఆదాయ‌పు ప‌న్ను శాఖ ప‌న్నుచెల్లింపు దారుల‌ను సుల‌భంగా సంప్ర‌దించేందుకు వీల‌వుతుంది. అయితే కాంటాక్ట్ వివ‌రాల‌ను ఇత‌ర ఐటీఆర్ ఫార‌మ్‌ల‌లో కూడా త‌ప్ప‌నిస‌రి అవుతుందా అనేది సూచ‌న‌లు విడుద‌ల చేసిన త‌రువాత తెలుస్తుంద‌ని డెలాయిట్ ఇండియా భాగ‌స్వామి త‌ప‌తీ ఘోస్ అన్నారు.

 2. శాల‌రీ స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌:
  ఏప్రిల్‌1,2018 నుంచి ఉద్యోగుల‌ శాల‌రీపై స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టింది. అందువ‌ల్ల ఉద్యోగులు వేత‌నంతో పాటు, ప్యాకేజీలో భాగంగా ఉన్న ఇత‌ర అల‌వెన్స్‌ల వివ‌రాల‌ను తెల‌పాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ఐటీర్ ఫార‌మ్‌లో మార్పులు చేశారు.
  ఉద్యోగులు వారి జీత భ‌త్యాలు, మిన‌హాయింపు అల‌వెన్సులు, ఎంట‌ర్‌టైన్‌మెంట్ అల‌వెన్సుల డిడ‌క్ష‌న్లు, ప్రొఫిష‌న‌ల్ ట్యాక్స్‌, స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ వంటివి వేరువేరుగా న‌మోదు చేయాలి. ఫారం 16 లో ఇచ్చిన వివ‌రాల‌ను స‌రిపోల్చుకునేందుకు గానూ ఈ మార్పు చేసిన‌ట్లు ఘోస్ తెలిపారు.
  గ‌తంలో ఫార‌మ్ 16లో ఇచ్చిన వివ‌రాలు, ఐటీఆర్ ఫ‌లితాల మ‌ధ్య క‌నిపించే వ్య‌త్యాసాల వ‌ల్ల సెంట్ర‌ల్ ప్రాసెసింగ్ సెంట‌ర్‌(సీపీసీ)లో అనేక ప్ర‌శ్న‌లు త‌లెత్తేవి. ఈ రెండింటికి మ‌ధ్య వ్య‌త్యాసం రాకుండా చేసేందుకు అద‌న‌పు వివ‌రాలు అవ‌స‌ర‌మ‌ని భావించి ఈమార్పు చేసిన‌ట్లు తెలుస్తుంది.

 3. గృహ ఆదాయం:
  ఇప్ప‌టి వ‌ర‌కు, ఒక కంటే ఎక్కువ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇళ్ళు ఉన్న‌ప్ప‌టికీ, ఒక‌ ఇంటిని మాత్రామే సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇంటిగా ప‌రిగ‌ణించేవారు. మిగిలిన ఇళ్ళ‌ను అద్దెకు ఇచ్చిన‌ట్ల‌గా భావించి, అద్దె ఆదాయాన్ని లెక్కించి ప‌న్ను చెల్లించాల్సి వ‌చ్చేది.
  అయితే బ‌డ్జెట్ 2019లో ఈ నియ‌మాన్ని స‌వ‌రించారు. ఈ సంవ‌త్స‌రం నుంచి రెండు ఇళ్ళ‌ను సెల్ఫ్ ఆక్యుఫైడ్ ప్రాప‌ర్టీలుగా ప‌రిగ‌ణించ‌వ‌చ్చు. ఈ నియమం త‌రువాతి మ‌దింపు సంవ‌త్స‌రానికి వ‌ర్తిస్తుంది. దీనికి త‌గిన‌ట్ల‌గా ఐటీర్ ఫార‌మ్‌ల‌లో మార్ప‌లు చేశారు. ఈ "డీమ్‌డ్ లెట్ ఔట్ ఆప్ష‌న్ష‌ ఐటీఆర్‌-1, ఐటీఆర్‌-4 ల‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది. అద్దెకు ఉన్న వారి పాన్ వివ‌రాల‌ను ఐటీర్‌-2లో అందించాలి. ఒక‌వేళ అద్దెకు ఉన్న వ్య‌క్తి టీడీఎస్‌ను డిడ‌క్ట్ చేస్తే ఆ వివ‌రాల‌ను కూడా న‌మోదు చేయాల‌ని ఘోస్ తెలిపారు.

 4. క్యాపిట‌ల్ గెయిన్స్:
  ఆదాయ‌పు ప‌న్ను నియ‌మాల ప్ర‌కారం, రూ. 50 లక్ష‌లు మించి విలువ ఉన్న ప్రాప‌ర్టీని కొనుగోలు చేసిన వ్య‌క్తి, ప్రాప‌ర్టీ విలువ‌పై 1 శాతం మూలం వ‌ద్ద ప‌న్ను (టీడీఎస్‌) డిడ‌క్ట్ చేయాలి. ఆస్తిని విక్ర‌యించిన వ్య‌క్తి ఈ వివ‌రాల‌ను ఐటీఆర్‌లో ఫైల్ చేసేందుకు వీలుగా ఐటీఆర్ ఫార‌మ్‌ల‌ను స‌వ‌రించారు. ఒక‌వేళ టీడీఎస్ డిడ‌క్ట్ చేస్తే, డిడ‌క్ట్ చేసిన కొనుగోలు దారుని వివ‌రాలు, పాన్ నెంబ‌రుతో స‌హా త‌ప్ప‌నిస‌రిగా ఇవ్వాలి. ఇందులో కొనుగోలు దారుని పేరు, పాన్ నెంబ‌ర్‌, ప‌ర్స‌టేంజ్ షేర్‌, ఆస్తి విలువ‌, ఆస్తి చిరునామా వంటి వివ‌రాల‌ను తెలియ‌చేయాల‌ని ఘోస్ వెల్ల‌డించారు.
  లిస్టెడ్ ఈక్వీటీ షేర్లు, ఈక్వీటీ-ఓరియంటెడ్ ఫండ్ల‌పై వ‌చ్చిన దీర్ఘ‌కాల మూల‌ధ‌న రాబ‌డిపై ఏప్రిల్‌1,2018 నుంచి ప‌న్ను వ‌ర్తిస్తుంది. వీటికి సంబంధించిన మార్పుల‌ను కూడా ఐటీర్ ఫార‌మ్‌ల‌లో చేశారు.

 5. ఇత‌ర ఆదాయ వ‌న‌రులు:
  “ఇత‌ర ఆదాయ వ‌న‌రుల” కింద వ‌ర్గీక‌రించిన మార్గాల ద్వారా మీకు వ‌డ్డీ ఆదాయం వ‌స్తుంటే వాటికి సంబంధించిన స‌మాచారాన్ని వివ‌ర‌ణాత్మ‌కంగా ఇవ్వాలి. బ్యాంకు సేవింగ్స్ ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల నుంచి వ‌చ్చే వ‌డ్డీలు, ట్యాక్స్ రీఫండ్ వంటి ఇత‌ర మార్గాల ద్వారా వ‌చ్చే ఆదాయాల‌కు వేరు వేరు వివ‌ర‌ణ ఇవ్వాలి.

 6. రెసిడెన్సిష‌య‌ల్ స్టేట‌స్‌:
  త‌రుచుగా విదేశాల‌కు ట్రావెల్ చేసే వారు, అద‌న‌పు వివ‌రాల‌ను అందించాల్సి ఉంటుంది. ప‌న్ను చెల్లింపుదారులు ఇప్ప‌టి వ‌ర‌కు, వ్య‌క్తిగ‌త‌ నివాస ధృవీక‌ర‌ణ ప‌త్రం ఇచ్చేవారు. అయితే ప్ర‌స్తుతం వ్య‌క్తులు విదేశాల‌లో ఎన్ని రోజులు ఉన్నారు అనే దానిపై వివ‌ర‌ణ ఇవ్వాలి. ఒక వ్య‌క్తి ట్యాక్స్ రెసిడెంట్‌గా ప‌రిగ‌ణించేందుకు వారు భార‌తదేశంలో ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో 182 రోజులు అంత‌కంటే ఎక్కువ కాలం నివ‌సించాలి లేదా ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో 60 రోజులు అంత‌కంటే ఎక్కువ కాలం నివ‌సించి, అంత‌కు ముందు 4 ఆర్థిక సంవ‌త్స‌రాల‌లో 365 రోజులు, అంత‌కంటే ఎక్కువ కాలం నివ‌సించి ఉండాలి. భార‌త‌దేశంలో రెసిడెన్షియ‌ల్ స్టేట‌స్ ఆధారంగా ఆదాయంపై ప‌న్ను విధిస్తారు.

 7. ఎన్ఆర్ఐ వివ‌రాలు:
  భార‌త‌దేశంలో ఆదాయం మార్గం ఉన్న నాన్‌-రిసిడెన్షియ‌ల్ భార‌తీయులు(ఎన్ఆర్ఐ) లు కూడా భార‌త‌దేశంలో రిట‌ర్నుల‌ను ఫైల్ చేయాలి. కొత్త ఐటీఆర్ ఫార‌మ్‌ల‌లో ప‌న్ను చెల్లింపుదారులు వారు నివ‌సిస్తున్న దేశం, గుర్తింపు సంఖ్య, ఇండియాలో నివ‌సించిన రోజులు(ఒక‌వేళ భార‌త పౌరుడు, లేదా భార‌త సంత‌తి చెందిన వారు అయితే ) మొద‌లైన వివ‌రాల‌ను తెల‌పాలి.
  విదేశీ ఆదాయం గురించి అద‌న‌పు స‌మాచారం అవ‌స‌ర‌మైన మ‌దింపు అధికారికి పై వివ‌రాలు స‌హాయప‌డ‌తాయి. సమాచార మార్పిడి ద్వారా అవసరమైనప్పుడు, ప‌న్ను చెల్లించ‌ని ఆదాయాన్ని గుర్తించ‌వ‌చ్చు.

 8. విదేశీ ఆస్తులు:
  భార‌తీయుల‌కు ఉన్న విదేశీ ఆస్తుల‌పై స‌మాచారాన్ని సేక‌రించేందుకు గ‌త కొద్ది సంవ‌త్స‌రాల‌లో ప్ర‌భుత్వం ఆదాయ‌పు ప‌న్ను నియ‌మాల‌లో అనేక స‌వ‌ర‌ణ‌లు చేసింది. అందులో భాగంగా ఈ కొత్త సంవ‌త్స‌రంలో కూడా ఐటీఆర్ ఫారంల‌లో వివిధ మార్పులు చేసింది.
  విదేశీ బ్యాంకు ఖాతాలతో పాటు, విదేశీ డిపాజిట‌రీ ఖాతాల వివ‌రాలు కూడా ఇవ్వ‌ల్సిన అవ‌స‌రం ఉంది. విదేశీ క‌స్టోడియ‌ల్ ఖాతాలు, విదేశీ ఈక్వీటీలు, డెట్‌, విదేశీ న‌గ‌దు విలువ‌పై ఉన్న బీమా కాంట్రాక్ట్ వివ‌రాల వంటి వాటిని ఐటీఆర్ ఫారంలో విడివిడిగా రాయాలి. స‌రైన స‌మాచారం ఇవ్వ‌క‌పోతే ఇబ్బందులు ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంది.

ఇత‌ర మార్పులు:
ఐటీర్ ఫార‌మ్‌ల‌లో వివిధ మార్పులు చోటుచేసుకున్నాయి. మీరు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చిన నగదు, ఇతర మార్గాల‌లో విడివిడిగా చేసిన విరాళాల మొత్తాన్ని తెల‌పాలి. వ‌డ్డీ ఆదాయం ఉన్న సీనియ‌ర్ సిటిజ‌న్లు సెక్ష‌న్‌ 80 టీటీబీ కింద క్లెయిమ్ చేసుకున్న డిడ‌క్ష‌న్‌ను ఫార‌మ్ ఇచ్చిన ఖాళీలో పూర్తిచేయాలి.
రూ. 5 ల‌క్ష‌ల కంటే ఎక్కువ వ్య‌వ‌సాయ ఆదాయం ఉన్న‌వారు జిల్లాపేరు, పిన్‌కోడ్‌, భూమి వైశాల్యం, సొంత భూమి లేదా, కౌలు భూమి, వ‌ర్షాధారిత భూమి లేదా మోట‌రు పైపుల ద్వారా నీటి స‌దుపాయం అందుతుందా మొద‌లైన వివ‌రాల‌ను తెల‌పాలి.

ఈ ఏడాది ఐటీ రిట‌ర్నులు దాఖలు చేసే సమయంలో ఆదాయం-పన్ను మదింపుదారులు మరింత సమాచారం వెల్లడి చేయవలసి ఉన్నప్పటికీ, ఆదాయం-పన్ను శాఖ ద్వారా ఎదుర‌య్యే ప్రశ్నలు, పరిశీల‌న‌లు తగ్గుతాయ‌ని నిపుణులు భావిస్తున్నారు

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly