న‌గ‌దు నిల్వ‌ల‌పై ఎస్‌బీఐ కొత్త నిబంధ‌న‌లు

క‌నీస న‌గ‌దు నిల్వ‌ల‌ను కొన‌సాగించ‌ని వారిపై ఎస్‌బీఐ విధించే కొత్త పెనాల్టీల వివ‌రాలిలా ఉన్నాయి.

న‌గ‌దు నిల్వ‌ల‌పై ఎస్‌బీఐ కొత్త నిబంధ‌న‌లు

దేశంలో అతి పెద్ద బ్యాంకైన ఎస్‌బీఐ ఏప్రిల్ 1 నుంచి పొదుపు ఖాతాల‌లో కొన‌సాగించాల్సిన క‌నీస న‌గ‌దు నిల్వ‌ల‌కు సంబంధించి నూత‌న నిబంధ‌న‌ల‌ను విడుద‌ల చేసింది. క‌నీస న‌గ‌దు నిల్వ‌లను కొన‌సాగించ‌ని వారిపై విధించే జ‌రిమానాలను ఎస్‌బీఐ గ‌త నెల‌లో 75 శాతానికి పైగా త‌గ్గించిన విష‌యం విదిత‌మే. బ్యాంక్ శాఖ‌, డిపాజిట్ ప‌రిమితి ప్ర‌కారం కొత్త ఛార్జీలు ఉంటాయ‌ని బ్యాంక్ ప్ర‌క‌టించింది. అయితే పొదుపు ఖాతాల‌లో కొన‌సాగించాల్సిన క‌నీస న‌గ‌దు నిల్వ‌ల విష‌యంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

క‌నీస న‌గ‌దు నిల్వ‌ల‌ను కొన‌సాగించ‌ని వారిపై పెనాల్టీల రూపంలో 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రం ఏప్రిల్‌- న‌వంబ‌ర్ నెల‌ల్లో ఎస్‌బీఐ రూ.1771.67 కోట్ల‌ను వ‌సూలు చేసింది. దీనిపై విమ‌ర్శ‌లు రావడంతో బ్యాంక్ త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్న విష‌యం తెలిసిందే.

ఏప్రిల్ 1 నుంచి అమ‌ల్లోకి రానున్న కొత్త పెనాల్టీల వివ‌రాలు…

f46edb4f-6d2a-51e7-a53a-a7cc05bf466b.jpg

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly