బ‌డ్జెట్‌లో ప్ర‌తిపాదించిన ఎన్‌పీఎస్ ప్ర‌యోజ‌నాలు

బడ్జెట్ 2019 లో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌పై కొన్ని ప్రత్యేక ప్ర‌యోజ‌నాల‌ను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది

బ‌డ్జెట్‌లో ప్ర‌తిపాదించిన ఎన్‌పీఎస్ ప్ర‌యోజ‌నాలు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ 2019లో ప‌ద‌వీ విమ‌ర‌ణ పెన్ష‌న్ ప‌థ‌కం ఎన్‌పీఎస్‌ పెట్టుబ‌డులు, ఉప‌సంహ‌ర‌ణ‌, వంటివి నియంత్రించేందుకు ఆదాయ‌పు ప‌న్ను నిబంధ‌న‌ల‌లో ప‌లు మార్పులు తీసుకువ‌చ్చింది. అయితే అందులో కొన్నింటిని గ‌త ఏడాది కేంద్ర మంత్రి వ‌ర్గం ఆమోదించింది. తాజాగా ఎన్‌పీఎస్ నుంచి చేసుకునే విత్‌డ్రాల‌కు ప‌న్ను ప‌రిమితిని పెంచుతూ ఆర్థిక శాఖ నిర్ణ‌యం తీసుకుంది. అంతేకాకుండా ఎన్‌పీఎస్‌కి కాంట్రీబ్యూట్ చేసే కేంద్ర‌ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కొన్ని అద‌న‌పు ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను కూడా ఇస్తుంది. ప‌న్ను నిపుణులు ఎన్‌పీఎస్‌పై అధిక మిన‌హాయింపు ప‌రిమితిని అందిస్తున్నారు. అయితే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంచిన ఈ ప్ర‌యోజ‌నాల‌ను మిగిలిన అన్ని వ‌ర్గాల‌కు అందుబాటులో ఉంచాలని భావిస్తుంది. ఈ స‌వ‌ర‌ణ‌లు అసెస్మెంటు సంవ‌త్స‌రం 2020-21 నుంచి అమ‌లులోకి వ‌స్తాయి. 7వ వేత‌న‌ క‌మీష‌న్ ప్ర‌తిపాద‌న‌ల మేర‌కు ప్ర‌స్తుత బ‌డ్జెట్లో ఈ మార్పులు చేయ‌డం జ‌రిగింది.

ఎన్‌పీఎస్‌కు సంబంధించి బ‌డ్జెట్‌లో చేసిన ప్ర‌తిపాద‌న‌లు:

  1. ప్ర‌స్తుతం ప‌దవీ విర‌మ‌ణ స‌మయంలో వ‌చ్చే ఎన్‌పీఎస్ నుంచి 60 శాతం నిధిని ఏక మొత్తంగా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. మిగిలిన 40 శాతం ఎన్‌పీఎస్‌ను యాన్యూటీ ప్లాన్‌ల‌లో పెట్టుబ‌డి పెట్టాలి. అయితే ఏక మొత్తంగా విత్‌డ్రా చేసుకునే 60 శాతం ఎన్‌పీఎస్‌లో 40 శాతంపై మాత్ర‌మే ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది. మిగిలిన 20 శాతం ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్ర‌స్తుత బ‌డ్జెట్‌లో ఆదాయ‌పు ప‌న్ను ప‌రిమితి 40 శాతం నుంచి 60 శాతానికి పెంచాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించింది. దీంతో ఎన్‌పీఎస్ నిధిపై పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. ఈ ప్ర‌యోజ‌నం ఎన్‌పీఎస్ చందాదారులంద‌రికీ వ‌ర్తిస్తుంది.

  2. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల టైర్‌-I ఖాతాకు ప్ర‌భుత్వం అందించే కాంట్రీబ్యూష‌న్‌ను 10 శాతం నుంచి 14 శాతానికి పెంచేందుకు కేంద్ర క్యాబినేట్ గ‌త ఏడాది ఆమోదం తెలిపింది. దీని వ‌ల్ల ఎన్‌పీఎస్ ప‌రిధిలో ఉన్న 18 ల‌క్ష‌ల మంది కేంద్ర ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతుంది. జ‌న‌వ‌రి1 తేదీ, ఆ త‌రువాత కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగంలో చేరిన వారు ఎన్‌పీఎస్ ప‌రిధిలోకి వ‌స్తారు. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు వారి బేసిక్ వేత‌నంలో 10 శాతం మొత్తాన్ని త‌ప్ప‌నిస‌రిగా ఎన్‌పీఎస్ కాంట్రీబ్యూట్ చేయాల్సి ఉంటుంది.

దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 14% వరకు ప్ర‌భుత్వ కాంట్రీబ్యూష‌న్‌ను మిన‌హాయించేందుకు, ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం, సెక్ష‌న్ 80సీసీడీ(2)లో అవ‌స‌ర‌మైన స‌వ‌ర‌ణ‌ల‌ను బ‌డ్జెట్‌లో ప్ర‌తిపాదించారు.

ఉద్యోగి ఎన్‌పీఎస్ నిధికి, సంస్థ చేసే కాంట్రీబ్యూష‌న్‌పై సెక్ష‌న్ 80సీసీడీ(2) వ‌ర్తిస్తుంది. ఈ ప్ర‌యోజ‌నం సెక్ష‌న్ 80సీ కింద ల‌భించే రూ.1.5 ల‌క్ష‌ల ప్ర‌యోజ‌నానికి, అదేవిధంగా సెక్ష‌న్ 80సీసీడీ(1బి) కింద ల‌భించే రూ.50 వేల అద‌న‌పు ప్ర‌యోజ‌నానికి అద‌నంగా ల‌భిస్తుంది.

అయితే ఈ ప్ర‌యోజ‌నాన్ని ప్రైవేట్ రంగంలో ప‌నిచేసే ఉద్యోగుల‌కూ అందించాల‌ని ప‌న్ను నిపుణులు సూచిస్తున్నారు. ఎన్‌పీఎస్‌తో పాటు వివిధ ర‌కాల పెట్టుబ‌డులు కూడా సెక్ష‌న్ 80 సీ కిందకి రావ‌డంతోపాటు, మిన‌హాయింపు పెంచ‌క‌పోవ‌డంతో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు పెంచిన 14 శాతం (10 శాతానికి బ‌దులుగా) కాంట్రీబ్యూష‌న్‌ను ప్ర‌వైట్ ఉద్యోగుల‌కు అమ‌లు చేస్తే, మ‌రింత ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు వీలుంటుంద‌ని క్లియ‌ర్ ట్యాక్స్‌.కామ్ సీఈఓ అర్చిత్ గుప్తా అభిప్రాయ‌ప‌డ్డారు.

3.కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు ఎన్‌పీఎస్ టైర్‌-II ఖాతాలో చేసే కాంట్రీబ్యూష‌న్ల‌ను కూడా సెక్ష‌న్ 80 సీ కింద‌కి తీసుకురావాల‌ని బ‌డ్జెట్‌లో ప్ర‌తిపాదించారు. అయితే క‌నీసం 3 సంవ‌త్స‌రాల లాక్ ఇన్ ప‌రియ‌డ్‌తో ఉన్న మొత్తానికి మాత్ర‌మే ఈ మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది.

ఎన్‌పీఎస్‌లో రెండు ఖాతాలు ఉంటాయి. - టైర్‌-I ఖాతా లేదా ప‌ద‌వీవిర‌మ‌ణ ఖాతా. దీనిని ఉద్యోగులు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. టైర్‌-II ఖాతా త‌ప్ప‌నిస‌రి కాదు. దీనిలో విత్‌డ్రా స‌దుపాయం కూడా ల‌భిస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly