ఈటీఎఫ్‌, ఇండెక్స్ ఫండ్ల‌లో కొత్త నిబంధ‌న‌లతో మ‌రింత వైవిధ్య‌త‌

ఇండెక్స్ ఫండ్లు, ఈటీఎఫ్ ల‌కు కూడా వైవిధ్య‌త క‌ల్పించేందుకు కొత్త నిబంధ‌న‌ల‌ను తోడ్ప‌డ‌తాయ‌ని నిపుణులు అభిప్రాయం వ‌క్యంచేస్తున్నారు.

ఈటీఎఫ్‌, ఇండెక్స్ ఫండ్ల‌లో కొత్త నిబంధ‌న‌లతో మ‌రింత వైవిధ్య‌త‌

ఇండెక్స్ ఫండ్లు, ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్) పోర్టుఫోలియోలో కేంద్రీకృత న‌ష్ట‌భ‌యాన్ని(కాన్స‌న్‌ట్రేటెడ్ రిస్క్) తగ్గిం చే విధంగా వారి పోర్ట్ఫోలియోలను నిర్మించాల‌ని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇటీవ‌లె ఒక సర్కులర్ విడుద‌ల చేసింది. అయితే ఇండెక్స్ ను అనుక‌రించి పెట్టుబ‌డి చేసే ఇండెక్స్ ఫండ్, ఈటీఎఫ్ ల్లో మార్పులను మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు ఏ సంద‌ర్భంలో చేయాలి అనే దానికి సంబంధించి నిబంధ‌న‌లు జారీచేసింది. ఎక్స్ఛేంజ్ ట్రేడర్ ఫండ్స్ (ఈటీఎఫ్), ఇండెక్స్ ఫండ్స్ రెండూ ఏదైనా ఒక సూచీని అనుక‌రించి పెట్టుబ‌డులు చేస్తుంటాయి. స‌ద‌రు ఇండెక్స్ లో ఉండే షేర్లు, వాటి ప‌రిమాణాల‌కు అనుగుణంగా పెట్టుబడి పెడ‌తాయి. బెంచ్ మార్క్ కంటే కొంచెం శాతం రాబ‌డిని త‌క్కువ‌గా అందిస్తాయి. ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్ల నిర్వ‌హణ వ్యయాల నిష్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫండ్ నిర్వాహకుడికి ప‌రిశోధ‌న‌, వ్యూహాలు త‌దిత‌ర అంశాలేమీ ఉండ‌వు. కేవలం బెంచ్ మార్కును అనుసరిస్తూ ఉంటారు. కాబ‌ట్టి వీటిలో నిర్వ‌హ‌ణ‌ రుసుం త‌క్కువ‌గా ఉంటుంది. అయితే ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్లు ఇండెక్స్ లో ఉన్న కాన్స‌న్‌ట్రేటెడ్ రిస్క్ త‌గ్గించ‌లేవు.

కొత్త నిబంధనల ప్రకారం, నిష్క్రియాత్మకంగా నిర్వహించే ఫండ్ అది ఇండెక్స్ ఫండ్ లేదా ఒక ఈటీఎఫ్-ట్రాక్స్ కనీసం 10 స్టాక్‌ల‌ను ట్రాక్ చేయాలి. ఏ ఒక్క స్టాక్ ప‌రిమాణం గ‌రిష్టంగా సెక్టార్ సూచీలైతే 35% ఇతర సూచీలైతే 25% మించ‌కూడ‌దు. దీంతో పాటు ఇండెక్స్లో టాప్ మూడు స్టాక్లు కలిపి, పోర్ట్ఫోలియోలో 65% కంటే ఎక్కువ ఉండ‌కూడ‌దు. పోర్ట్ఫోలియోలో చేర్చిన స్టాక్ల లిక్విడిటీ అర్హత నిబంధనలను కూడా సెబీ పేర్కొంది.

సెక్టార్ ఇండెక్స్ ఫండ్లు, ఈటీఎఫ్ లు ప్రస్తుతం నిబంధన‌ల‌కు అనుగుణంగా మార్పులు చేయాల్సి ఉంది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్, నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ వంటి వాటిని అనుక‌రిస్త‌న్న‌ ఇండెక్స్ ఫండ్లు కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా స‌ర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ తీసుకుంటే ఎస్‌బీఐ ఒక్క‌టే 72 శాతం వెయిటేజీని క‌లిగి ఉంది.

ప్ర‌స్తుతం ఇండెక్స్ ఫండ్లు లేదా ఈటీఎఫ్‌లు య‌థాతథంగా సూచీని అనుక‌రించి పెట్టుబ‌డి చేస్తున్నాయి. అయితే ఇప్ప‌డు కొత్తగా ప్ర‌వేశ‌పెట్టిన‌ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇండెక్స్ ఫండ్లు, ఈటీఎఫ్‌లు సెబీ పేర్కొన్న నిబంధ‌న‌ల‌ను అమ‌లుచేయాలి. దీని ద్వారా కొంత వైవిధ్య‌త పెరుగుతుంద‌ని నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. సూచీల‌ను అనుక‌రించి పెట్టుబ‌డి చేసే ఫండ్లు కొన్ని సంద‌ర్భాల్లో ఎక్కువ భాగం కొన్ని షేర్లు లేదా రంగాల‌కు ప‌రిమిత‌మై పెట్టుబ‌డి చేయాల్సి ఉంటుంది. త‌ద్వారా న‌ష్ట‌భ‌యం పెరుగుతుంది. ఇండెక్స్ ఫండ్లు, ఈటీఎఫ్ ల‌కు కూడా వైవిధ్య‌త క‌ల్పించేందుకు కొత్త నిబంధ‌న‌ల‌ను తోడ్ప‌డ‌తాయ‌ని నిపుణులు అభిప్రాయం వ‌క్యంచేస్తున్నారు.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly