రూపే కార్డుల‌పై ఎండీఆర్ ఛార్జీలు ర‌ద్దు

ఎండీఆర్ అంటే క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా వినియోగ‌దారుల‌ చెల్లింపును అంగీకరించినందుకు ఒక వ్యాపారి బ్యాంకుకు చెల్లించే ఛార్జీలు

రూపే కార్డుల‌పై ఎండీఆర్ ఛార్జీలు ర‌ద్దు

కేంద్ర బడ్జెట్‌కు ముందు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం త‌ర్వాత‌ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మ‌ర్చంట్ డిస్కౌంట్‌ రేటును (ఎండిఆర్) రుసుమును ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్రకటించారు.

జనవరికి నుంచి వార్షిక టర్నోవర్ రూ. 50 కోట్లకు పైగా ఉన్న వ్యాపారులు ఎండిఆర్ రుసుమును వసూలు చేయకుండా రూపే డెబిట్ కార్డ్, యుపిఐ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు సౌకర్యాన్ని అందించడానికి రెవెన్యూ శాఖ (డిఓఆర్) తప్పనిసరి చేయాలని చెప్పారు.

డెబిట్ కార్డులపై ఎండిఆర్‌ అనేది ఒక వినియోగదారు తన కార్డును పాయింట్-ఆఫ్-సేల్స్ (పీఓఎస్‌) టెర్మినల్‌లో స్వైప్ చేసినప్పుడు ఒక వ్యాపారి తన సర్వీసు ప్రొవైడర్లకు చెల్లించాల్సిన మొత్తం. ఇది ఆన్‌లైన్ లావాదేవీలు, క్యూఆర్ ఆధారిత లావాదేవీలకు కూడా వర్తిస్తుంది.

ప్రతి లావాదేవీకి వ్యాపారి చెల్లించే మొత్తం ముగ్గురు వాటాదారుల మధ్య పంపిణీ అవుతుది-లావాదేవీని ప్రారంభించే బ్యాంక్, పీఓఎస్ మిష‌న్ వ్యవస్థాపించే విక్రేత, వీసా లేదా మాస్టర్ కార్డ్ వంటి కార్డ్ నెట్‌వర్క్ ప్రొవైడర్. క్రెడిట్ కార్డులపై ఎండీఆర్‌ లావాదేవీ మొత్తంలో సున్నా నుంచి గ‌రిష్ఠంగా 2% వరకు ఉంటుంది.

రూ. 50 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు తమ వినియోగదారులకు తక్కువ ఖర్చుతో కూడిన డిజిటల్ స‌దుపాయాల‌ను అందించాలని, ఆర్‌బీఐ, బ్యాంకులు లావాదేవీల వ్యయాన్ని భ‌రించాల‌ని తన తొలి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా రెండోసారి బ‌డ్జెట్‌ను ఫిబ్ర‌వ‌రి 1, 2020 న ఆమె ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly