బ్యాంకులకు వ‌రుస సెల‌వులు లేవు

బ్యాంకుల‌కు వ‌రుస సెల‌వులు లేద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు

బ్యాంకులకు వ‌రుస సెల‌వులు లేవు

ఈనెల 29 నుంచి బ్యాంకులకు 5 రోజుల వరుస సెలవులనే ప్రచారం జ‌రుగుతోన్న నేప‌థ్యంలో అది వాస్త‌వం కాద‌ని అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య స్ప‌ష్టం చేసింది. ఈ నెల 29 న‌ గురువారం మహావీర్‌ జయంతి అయినా తెలుగు రాష్ట్రాల్లో సెలవు లేదని తెలిపారు. 30న గుడ్‌ఫ్రైడే సందర్భంగా సెలవు. శనివారం (31న) బ్యాంకులు యథావిథిగా పనిచేస్తాయి. బ్యాంకులకు 2, 4 శనివారాలు మాత్రమే సెలవు. ఈసారి వచ్చేది అయిదో శనివారం కాబ‌ట్టి య‌ధావిధిగా పనిచేస్తాయి.

ఆదివారం (ఏప్రిల్‌ 1) సెలవు. ఆర్థిక సంవత్సరం ముగింపు గణాంకాలు చూసుకునేందుకు సోమవారం (ఏప్రిల్‌ 2) బ్యాంకులకు సెల‌వు లేదు కానీ, ఈనెల 30, ఏప్రిల్‌ 1, 2 తేదీల్లోనే ఖాతాదార్లకు సేవలందవు. ఏప్రిల్‌ 3, 4 తేదీల్లో పనిచేస్తాయి. 5న జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా మళ్లీ సెలవు.

మ‌రోవైపు స్టాక్ మార్కెట్ల‌కు గురువారం నుంచి వ‌రుస‌గా 4 రోజులు సెల‌వులు రానున్నాయి. దీంతో మ‌దుప‌ర్లు అప్ర‌మ‌త్త‌త వ‌హించేచ అవ‌కాశం ఉంది. అయితే క్రితం సెష‌న్లో భారీ లాభాల‌ను క‌న‌బ‌రిచిన మార్కెట్లు నేడు కూడా అదే జోరును కొన‌సాగిస్తున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్ల మేర లాభ‌ప‌డ‌గా, నిఫ్టీ 64 పాయింట్లు లాభంతో ట్రేడ‌వుతున్నాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly