బ‌డ్జెట్ 2019లో ఆదాయ‌ప‌న్ను మిన‌హాయింపులు

ఆదాయపు పన్ను పరిమితిని రూ.5లక్షలకు కేంద్రం పెంచింది.

బ‌డ్జెట్ 2019లో ఆదాయ‌ప‌న్ను మిన‌హాయింపులు

వార్షిక వేత‌నం రూ. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు పూర్తి ప‌న్ను రిబేటు(రూ. 12,500) క‌ల్పించారు. సెక్ష‌న్ 80సీ కింద‌ పొదుపు, పెట్టుబడులతో(రూ. 1.50 ల‌క్ష‌ల) కలిపి రూ. 6.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ల‌భిస్తుంది. వార్షిక వేత‌నం రూ. 5 ల‌క్ష‌ల(పన్ను మినహాయింపుల తర్వాత) కంటే ఎక్కువ ఉన్న వారికి ఎటువంటి మార్పులు ఉండవు.

స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితి ప్ర‌స్తుతం ఉన్న రూ. 40 వేల నుంచి రూ.50 వేలకు పెంచారు.

పోస్టల్‌, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్‌ పరిమితి ప్ర‌స్తుతం ఉన్నరూ.10 వేల నుంచి రూ. 40 వేలకు పెంచారు.

ఇంటి అద్దెలపై టీడీఎస్‌ రూ.1.80 లక్షల నుంచి రూ. 2.4 లక్షలకు పెంచారు.

గ్రాట్యూటీ పన్ను మినహాయింపు ప‌రిమితిని రూ. 30 ల‌క్ష‌లుకు పెంచారు.

ఆదాయ పన్ను చట్టం సెక్షన్‌ 54 కింద రెండు ఇళ్లపై పెట్టుబడులు పెట్టవచ్చు. దీనికి సంబంధించి రూ. 2 కోట్ల వరకు మూలధన రాబ‌డి నుంచి మినహాయింపు. జీవిత కాలంలో ఇది ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది.

డిజిట‌ల్ విధానంలో 24 గంటల్లో ప‌న్నుల రిట‌ర్నుల ప్రాసెసింగ్ పూర్త‌య్యేలా చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు ఆర్థిక మంత్రి బ‌డ్జెట్ లో ప్ర‌క‌టించారు

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly