ఇక‌పై స్వ‌యంచాల‌కంగా ఈపీఎఫ్ ఖాతా బ‌దిలీలు

ఉద్యోగం మారిన ప్ర‌తీసారి ఈపీఎఫ్ బ‌దిలీకి ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేకుండా ఈపీఎఫ్ఓ ఏర్పాట్లు చేస్తుంది

ఇక‌పై స్వ‌యంచాల‌కంగా ఈపీఎఫ్ ఖాతా బ‌దిలీలు

ఉద్యోగ భ‌విష్య నిధి (ఈపీఎఫ్‌ఓ) చందాదారులు వ‌చ్చే ఏడాది నుంచి ఉద్యోగం మారిన ప్రతిసారీ భవిష్య నిధికి జమ చేసే సొమ్ము వివరాలపై కొత్తగా దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదని, త‌దుప‌రి ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి స్వయంచాలిత (ఆటోమేటిక్‌) పద్ధతిని అమలు చేయాలని నిర్ణ‌యించిన‌ట్లు కార్మిక మంత్రిత్వశాఖ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగులకు సార్వత్రిక ఖాతా సంఖ్య (యూనివర్సల్‌ అకౌంట్‌ నెంబర్‌ -యూఏఎన్‌) ఉన్నప్పటికీ ఉద్యోగం మారిన ప్రతిసారీ ఈపీఎఫ్‌ క్లెయింల విషయమై దరఖాస్తు సమర్పించాల్సి వస్తోంది. ఏటా ఇలాంటి దరఖాస్తులు ఎనిమిది లక్షల వరకు వస్తున్నట్టు ఈపీఎఫ్‌ఓ వర్గాలు తెలిపాయి. లావాదేవీలన్నింటినీ కాగిత రహితంగా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నందున ఆటోమేటిక్‌ పద్ధతిలో క్లెయింలను మార్పిడి చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఈపీఎఫ్ఓ త‌న‌ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను అధ్య‌యనం చేసేందుకు సీ-డీఏసీ ను నియ‌మించింది. ఈపీఎఫ్ఓలో ప్ర‌స్తుతం 80 శాతం ప‌నులు ఆన్‌లైన్ ద్వారా జ‌రుగుతున్నాయి. స్యయం చాలిత బ‌దిలీ ద్వారా ఈపీఎఫ్ఓ పూర్తి పేప‌రు ర‌హితంగా ప‌నిచేస్తుంది. కొత్త యజమాని నూతనంగా చేరిన ఉద్యోగి పేరున నెలవారీ పీఎఫ్‌ చందాను చెల్లించేటప్పుడే యూఏఎన్‌ను పేర్కొంటారని, దాని ఆధారంగా అతని ఖాతాలో సొమ్ము జమ అవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పాత యజమాని జమ చేసిన సొమ్ము, దానిపై వచ్చిన వడ్డీ అన్నీ కొత్త ఖాతాలో జమ అవుతాయి. అంటే ఇక నుంచి యూఏఎన్‌ కూడా బ్యాంకు ఖాతా మాదిరిగానే పనిచేస్తుంది. ఎన్ని ఉద్యోగాలు, ప్రదేశాలు మారినా జీవితాంతం పీఎఫ్‌ ఖాతా మాత్రం మారదు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly