భార‌త మార్కెట్‌లోకి నోకియా 4.2

ప్రత్యేకంగా గూగుల్‌ అసిస్టెంట్‌ బటన్‌తో ఈ ఫోన్ అందుబాటులోకి వ‌చ్చింది. ధ‌ర రూ.10,999.

భార‌త మార్కెట్‌లోకి నోకియా 4.2

నోకియా బ్రాండ్ లైసెన్స్ పొందిన‌ హెచ్‌ఎండీ గ్లోబల్‌ మరో స్మార్ట్‌ఫోన్‌ను నోకియా 4.2 పేరుతో భారత విఫ‌ణిలోకి విడుదల చేసింది. 3జీబీ ర్యామ్‌ 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ ,స్నాప్‌డ్రాగన్‌ 439 ప్రాసెసర్ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ధ‌ర రూ. 10,999 గా నిర్ణ‌యించారు. ఈ రోజు మొద‌లుకుని వారం రోజుల పాటు నోకియా ఆన్‌లైన్‌ స్టోర్‌లో మాత్ర‌మే ఈ నోకియా 4.2 ఫోన్‌ను అందుబాటులో ఉంటుంద‌ని, మరో వారం రోజుల్లో అంటే మే 14 తేదీ నుంచి రీటైల్ పార్ట‌నర్స్ అయిన క్రోమా, రిల‌య‌న్స్‌, సంగీత‌, పూర్వికా, బిగ్‌సీ, మైజీ వంటి ప్రముఖ మొబైల్‌ విక్రయ దుకాణాల్లో విక్ర‌యానికి తీసుకురానున్నట్లు హెచ్‌ఎండీ గ్లోబల్‌ వెల్లడించింది. నోకీయా.కామ్‌/ ఫోన్స్‌తో పాటు భార‌తదేశ‌మంత‌టా అన్ని రిటైల్ షోర‌మ్‌ల‌లోనూ మే 21నుంచి అందుబాటులో ఉంటుంది.

ప్రారంభ ఆఫర్‌ కింద నోకియా ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.500 రాయితీ ఇస్తుంది. www.nokia.com/phone ద్వారా నోకియా 4.2 కొనుగోలు చేసే వారు ‌“LAUNCHOFFER" ప్రోమో కోడ్‌ను ఉప‌యోగించి కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ ఆఫ‌ర్ ప‌రిమితంగానే ఉంటుంది. వొడాఫోన్ -ఐడియా వినియోగదారులు రూ.2,500 విలువైన 50 వోచర్లను పొందవచ్చు. అంతేకాదు, ఆరునెలల పాటు రూ. 3500 విలువైన ఉచిత స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ సదుపాయాన్ని హెచ్‌ఎండీ గ్లోబల్‌ కల్పిస్తోంది. ఈ స్మాట్ ఫోన్ కంపెనీ ఈ ఫోన్‌తో పాటు నోకియా9 ప్యూర్ వ్యూ, నోకియా 3.2 నోటియా 1 ప్ల‌స్ అనే మూడు ఫోన్ల‌ను కూడా బార్సిలోనాలో విడుద‌ల చేసింది.

మొబైల్‌ ఆండ్రాయిడ్‌ వన్‌ ఫ్లాట్‌ఫాంపై పనిచేస్తుంది. అంతేకాదు, ప్రత్యేకంగా గూగుల్‌ అసిస్టెంట్‌ బటన్‌తో ఈ ఫోన్‌ వస్తుండటం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో దీన్ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. హెచ్‌ఎండీ గ్లోబల్‌ రెండు వేరియంట్లలో నోకియా 4.2ను తయారు చేయగా, ఒక వేరియంట్‌ను మాత్రమే తీసుకొచ్చింది. బ్లాక్‌, పింక్‌ శాండ్‌ రంగుల్లో ఇది లభ్యం కానుంది.

‘భారత్‌లోని నోకియా ఫ్యాన్స్‌ కోసం సరికొత్త 4.2 స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో అనేక అధునాతన ఫీచర్లను జోడించాం. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ 9 ‘పై’ ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నాం. ఆండ్రాయిడ్‌ వన్‌ ప్రొగ్రాంలో భాగంగా తర్వాతి రెండు అప్‌డేట్‌ల(క్యూ, ఆర్‌)ను కూడా ఇస్తాం’ అని హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఇండియా హెడ్‌ అజయ్‌ మెహతా తెలిపారు.
నోకియా 4.2 ఫీచ‌ర్లు:

  • స్నాప్‌డ్రాగన్‌ 439 ప్రాసెసర్‌
  • 3జీబీ ర్యామ్‌+ 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • ముందువైపు 8మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా
  • వెనుక వైపు 13+2 డ్యుయల్‌ కెమెరా సెటప్‌
  • ఆండ్రాయిడ్‌ 9
  • ఎస్డీ కార్డు సాయంతో 400 జీబీ వరకూ మెమొరీని పెంచుకునే సదుపాయం
  • 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly