ప‌న్ను రిట‌ర్నుల‌కు పాన్ త‌ప్ప‌నిస‌రి కాదు

ఇక‌ ఐటీ రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేసేందుకు పాన్ లేక‌పోతే ఆధార్ ఉంటే స‌రిపోతుంది.

ప‌న్ను రిట‌ర్నుల‌కు పాన్ త‌ప్ప‌నిస‌రి కాదు

నేడు ప్ర‌వేశ‌పెట్టిన 2019 బ‌డ్జెట్‌లో ఆదాయ ప‌న్ను నిబంధ‌న‌ల్లో కొన్ని మార్పుల‌ను చేశారు. ఇక‌పై ప‌న్ను చెల్లింపుదారులు రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేసేందుకు పాన్ లేదా ఆధార్ ఉంటే స‌రిపోతుంద‌ని కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఐటీఆర్ ఫైల్ చేసేందుకు పాన్‌, ఆధార్ క‌చ్చితంగా అవ‌స‌రం అన్న సంగ‌తి తెలిసిందే.

  1. ప‌న్ను చెల్లింపుదారుల సౌకర్యం కోసం పాన్‌కు ప్ర‌త్యామ్నాయంగా ఆధార్‌ను ప‌న్ను రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేసేందుకు ఉప‌యోగించ‌వ‌చ్చ‌ని ఆర్థిక మంత్రి ప్ర‌క‌టించారు. అదేవిధంగా పాన్ అవ‌స‌ర‌మైన చోట దానికి బ‌దులుగా ఆధార్ ఉప‌యోగించుకోవ‌చ్చని తెలిపారు.
  2. ఆదాయ ప‌న్ను శాఖ‌ పాన్ కార్డు ఆధార్ వివ‌రాల ఆధారంగానే జారీచేస్తుంది కాబ‌ట్టి పాన్ లేక‌పోయినా ఆధార్ ఉంటే స‌రిపోతుంద‌ని ప్ర‌తిపాదించారు.
  3. ప‌న్ను చెల్లింపుదారుడు ఇప్ప‌టికే పాన్‌-ఆధార్‌తో అనుసంధానం చేస్తే ఆదాయ ప‌న్ను చ‌ట్టం కింద‌ పాన్‌కి బ‌దులుగా ఆధార్ ఉప‌యోగిస్తే స‌రిపోతుంది
  4. భారీ మొత్తంలో న‌గ‌దు లావాదేవీలకు పాన్ లేదా ఆధార్ త‌ప్ప‌నిస‌రి చేసింది.
  5. ప్ర‌స్తుతం ఆదాయ ప‌న్ను నిబంద‌న‌ల ప్ర‌కారం పాన్-ఆధార్ అనుసంధానం చేయ‌క‌పోతే దానిని నిర్ధారించ‌రు. కానీ ఇప్పుడు ఆధార్ ఉంటే స‌రిపోతుంది. అయితే ఒక వ్యక్తి ఆధార్ నంబర్‌ను తెలియజేయడంలో విఫలమైతే, అలాంటి వ్యక్తికి కేటాయించిన పాన్ కూడా ప‌నిచేయ‌ద‌ని వెల్ల‌డించారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly