పేటీఎమ్ ద్వారా ట‌ర్మ్ ఇన్సురెన్స్ అందిస్తున్న ఐసీఐసీఐ..

ఇప్పుడు ఐసీఐసీఐ ప్రూ ఐప్రొటెక్ట్ స్మార్ట్ ట‌ర్మ్ ఇన్సురెన్స్ పాల‌సీని, పేటీఎమ్ యాప్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు

పేటీఎమ్ ద్వారా ట‌ర్మ్ ఇన్సురెన్స్ అందిస్తున్న ఐసీఐసీఐ..

ట‌ర్మ్ పాల‌సీని వినియోగ‌దారుల‌కు అందించేందుకు ఐసీఐసీఐ ప్రొడెన్షియ‌ల్ లైఫ్ ఇన్సురెన్స్‌, పేటీఎమ్‌తో చేతులు క‌లిపింది. ప్ర‌సిద్ధి చెందిన ఐసీఐసీఐ ప్రూ ఐప్రొటెక్ట్ స్మార్ట్ ట‌ర్మ్ ఇన్సురెన్స్ పాల‌సీని పేటీఎమ్ ద్వారా అందించ‌నుంది. ఇది ఒక స్వ‌చ్ఛ‌మైన ట‌ర్మ్ పాల‌సీ. జీవిత బీమాతో పాటు క్రిటిక‌ల్ ఇల్‌నెస్‌, వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా వంటి అద‌న‌పు క‌వ‌ర్‌తో వ‌స్తుంది. 34 క్లిష్ట‌మైన వ్యాధులు ఇందులో క‌వ‌ర్ అవుతాయి.

ఐసీఐసీఐ ప్రూ ఐప్రొటెక్ట్ స్మార్ట్ 85 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌ర‌కు క‌వ‌ర్ అవుతుంది. అంతేకాకుండా 99 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌ర‌కు మొత్తం జీవిత బీమా పొందే అవ‌కాశం ఉంద‌ని బీమా సంస్థ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. క్లెయిమ్ చేసేందుకు వినియోగ‌దారులు ఎటువంటి హాస్ప‌ట‌ల్ బిల్లు అందించ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. రోగ నిర్ధార‌ణ నివేదిక ఫోటో కాపీని స‌బ్మిట్ చేస్తే స‌రిపోతుంద‌ని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తెలిపింది.

ఇప్పుడు పేటీఎమ్ వినియోగ‌దారులు యాప్ ద్వారా కొద్ద నిమిషాల‌లోనే ఐసీఐసీఐ ప్రూ ఐప్రొటెక్ట్ స్మార్ట్ ప్లాన్‌ను సుల‌భంగా కొనుగోలు చేయ‌వ‌చ్చు. అయితే ఇందుకోసం పేటీఎమ్‌లో కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. కొనుగోలు చేయ‌డం మాత్ర‌మే కాకుండా పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ కూడా పేటీఎమ్ యాప్ ద్వారా చేసుకోవ‌చ్చు. పేటీఎమ్ యాప్‌లో క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను సుల‌భంగా పూర్తి చేయ‌వ‌చ్చు.

పేటీఎమ్ యాప్‌ను వినియోగిస్తున్న ల‌క్ష‌లాదిమంది ఖాతాదారుల‌కు వినూత్న రీతిలో, కొత్త కొత్త బీమా పాల‌సీల‌ను అందించ‌డంపై దృష్టి సారించిన‌ట్లు పేటీఎమ్ అధ్య‌క్షుడు అమిత్ నాయ‌ర్ తెలిపారు.

ప్ర‌తీ క‌స్ట‌మ‌ర్ పోర్ట్‌ఫోలియోలో ట‌ర్మ్ ఇన్సురెన్స్ అనేది ఒక కీల‌క‌భాగం. ఈ ఒప్పందంతో పేటీఎమ్ వినియోగ‌దారులు, జీవిత బీమా త్వ‌రిత గ‌తిన‌, ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసి, వారి కుటుంబానికి ఆర్థికంగా భ‌ద్ర‌త క‌ల్పించ‌గ‌ల‌రు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తూనే, జీవిత బీమాను కొనుగోలు చేయ‌డం సుల‌భ‌త‌రం చేస్తున్న‌ట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ నందా అన్నారు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly