ఇక‌పై పాల‌సీదారుడే టీపీఏను ఎంచుకోవ‌చ్చు..

ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల‌ను ప్రాసెస్ చేయ‌డంలో టీపీఏలు బీమా సంస్థ‌కు, పాల‌సీదారునికి మ‌ధ్య వార‌ధిలా ప‌నిచేస్తాయి.

ఇక‌పై పాల‌సీదారుడే టీపీఏను ఎంచుకోవ‌చ్చు..

ఆరోగ్య బీమా పాల‌సీల‌ను మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా మార్చేందుకు బీమా రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏఐ) ప‌లు మార్పులు చేస్తుంది. ఇందులో భాగంగా పాల‌సీల‌ను కొనుగోలు చేసిన‌ప్పుడు లేదా పున‌రుద్ధ‌రించిన‌ప్పుడు థ‌ర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేట‌ర్ల‌ను పాల‌సీదారుడు స్వ‌యంగా ఎంచుకునేందుకు ఐఆర్‌డీఏఐ అనుమ‌తించింది.

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్ - హెల్త్ సర్వీసెస్) (సవరణ) రెగ్యులేషన్స్, 2019 ప్రకారం, పాలసీని విక్రయించే సమయంలో పాలసీదారులకు టీపీఏల‌ను అందించాలని ఆరోగ్య బీమా సంస్థ‌లను ఐఆర్‌డీఏఐ కోరింది. కొనుగోలుదారులు వారి అవసరానికి తగినట్లుగా టీపీఏను ఎంచుకోవ‌చ్చు. అయితే పునరుద్ధరణ సమయంలో పాలసీదారులు తమకు నచ్చిన టీపీఏకు మారేందుకు అనుమతిస్తారు. ఆరోగ్య బీమా పాల‌సీ, నివ‌సిస్తున్న ప్రాంతం ఆధారంగా బీమా సంస్థ టీపీఏ సంఖ్యను పరిమితం చేయవచ్చు. ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల‌ను ప్రాసెస్ చేయ‌డంలో టీపీఏలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. టీపీఏలు బీమా సంస్థ‌కు, పాల‌సీదారునికి మ‌ధ్య వార‌ధిలా ప‌నిచేస్తాయి.

టీపీఏకి సంబంధించి ఐఆర్‌డీఏఐ తీసుకొచ్చిన మార్పులు:

  1. బీమా సంస్థ అనుసంధాన‌మైన టీపీఏ ల‌లో ఒక‌దాన్ని పాల‌సీదారుడు ఎంచుకునే అవ‌కాశం ఉంటుంద‌ని నియంత్ర‌ణ సంస్థ తెలిపింది.
  2. పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలో లేదా పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో బీమా సంస్థ ఇచ్చిన టీపీఏల నుంచి మాత్ర‌మే ఒక‌దాన్ని పాల‌సీదారుడు ఎంచుకోవాలి.
  3. ఒక‌వేళ పాలసీ దారుడు ఎంచుకోక‌పోతే, టీపీఏను కేటాయించే అధికారం బీమా సంస్థ‌కు ఉంటుంది.
  4. ఒక ఆరోగ్య బీమా ప్రొడెక్ట్‌ నుంచి సంస్థ టీపీఏ తొల‌గిస్తే, పాల‌సీదారుడు ఆ స్థానంలో మ‌రొక టీపీఏను ఎంపిక చేసుకునేందుకు సంస్థ అనుమ‌తించాలి.
    5.బీమా సంస్థ ఒక టీపీఏతో మాత్ర‌మే అనుసంధాన‌మై ఉంటే, పాల‌సీదారుడు ఖ‌చ్చితంగా ఆ టీపీఏనే తీసుకోవాలి. మ‌రొక ఆప్ష‌న్ ఉండ‌దు.

టీపీఏని నియ‌మించుకునేందుకు లేదా సేవ‌ల‌ను ర‌ద్దు చేయ‌డంపై బీమా సంస్థదే తుది నిర్ణ‌యం. నిర్ధిష్ట ఆరోగ్య బీమా పాల‌సీ కోసం టీపీఏను ఎంపిక‌చేసుకునేందుకు, లేదా సేవ‌ల‌ను నిలిపివేసేందుకు బీమా సంస్థ‌కు పూర్తి హ‌క్కు ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly