క్యాష్‌బ్యాక్‌ ఆఫర్స్‌, రివార్డ్‌ పాయింట్స్‌తో ఓలా క్రెడిట్‌కార్డులు

ఎలాంటి రుసుము చెల్లించకుండా ఓలా యాప్‌ ద్వారా ఈ క్రెడిట్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

క్యాష్‌బ్యాక్‌ ఆఫర్స్‌, రివార్డ్‌ పాయింట్స్‌తో ఓలా క్రెడిట్‌కార్డులు

ప్ర‌ముఖ‌ క్యాబ్ సేవ‌ల సంస్థ‌ ఓలా, భార‌త‌దేశంలో అత్య‌ధిక క్రెడిట్ కార్డుల‌ను జారీ చేసే వారిలో ఒక‌రైన ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు(ఎస్‌బీఐ కార్డు), వీసాల‌ భాగస్వామ్యంతో ఓలా మ‌నీని ప్ర‌వేశ‌పెట్టింది. బెంగుళూరుకు చెందిన ఈ సంస్థ అనేక ప్ర‌యోజ‌నాల‌తో పాటు, సౌకర్యవంతమైన చెల్లింపు వ్యవస్థను అందించ‌డ‌మే లక్ష్యంగా ప‌నిచేస్తున్న‌ట్లు కంపెనీ ప్ర‌తినిధులు తెలిపారు. 2022 నాటికి ఒక‌ కోటి ఓలా క్రెడిట్‌ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఎలాంటి రుసుము చెల్లించకుండా ఓలా యాప్‌ ద్వారా ఈ క్రెడిట్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది. నిర్ధిష్ట వ్యాలెట్ విధానంలో చెల్లింపు చేయ‌డం వ‌ల్ల‌ వినియోగదారులకు ఉత్తమమైన సేవలు లభిస్తాయని, ఈ పరిష్కారంతో వారి చెల్లింపుల విధానాన్ని మార్చడానికి అవకాశం ఉంటుంద‌ని, ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్‌ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా 15 కోట్లకు పైగా డిజిట‌ల్ -ఫ‌స్ట్ వినియోగ‌దారులు, ఓలా చెల్లింపుల ప‌రిష్కారంతో, ఇండియా ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌ను డిజిట‌లైజేష‌న్ వైపుకు న‌డిపించేందుకు ఒక ఉత్ప్రేరకంగా ప‌నిచేస్తుంద‌ని అగ‌ర్వాల్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ విధ‌మైన విభిన్న కార్య‌క్ర‌మాల‌తో ఎస్‌బీఐ కార్డు, దాని కార్డు ఫోర్ట్‌ఫోలియోను ప‌టిష్టం చేయ‌డంతో పాటు మొబిలిటీ విభాగంలో వినియోగ‌దారుల‌కు వారి ప్ర‌యాణ ఖ‌ర్చుల‌పై వీలైనంత ఎక్కువ, ప్ర‌త్యేక‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంద‌ని ఎస్‌బీఐ కార్డు, ఎండీ, సీఈఓ హ‌ర్ధాయాల్ ప్ర‌సాద్ అన్నారు. ఓలా మనీ వ్యాలెట్ ద్వారా పోస్ట్ పెయిడ్ చెల్లింపులు, ఓలా ప్లాట్‌పామ్ ద్వారా బుక్ చేసుకున్న రైడ్‌ల‌కు అందించే మైక్రో-భీమా డిజిటల్ ఫైనాన్షియల్ ఆఫర్ల కోసం ఈ కార్డు ప్రారంభించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌యాణ‌, ర‌వాణా చెల్లింపుల‌కు డిజిట‌ల్ చెల్లింపుల విధానాన్ని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. ఈ విధానం ద్వారా ల‌క్ష‌లాది మంది ఓలా ప్రయాణికులు సౌల‌భ్యంగా ప్ర‌యాణిస్తారు.

లైఫ్‌టైం వ్యాలిడిటీతో వస్తున్న ఈ క్రెడిట్‌ కార్డులతో వివిధ రకాల క్యాష్‌బ్యాక్‌ ఆఫర్స్‌, రివార్డ్‌ పాయింట్స్‌ను అందిస్తోందని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. 2015లో ఓలా మనీ వ్యాలెట్‌, 2016లో ఓలా క్రెడిట్‌ సదుపాయాలను సంస్థ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆర్థికపరమైన సేవల్లో భాగంగా వ్యాలెట్‌, పోస్ట్‌ పెయిడ్‌ బిల్లింగ్‌, ఓలా రైడ్స్‌నకు మైక్రో ఇన్సూరెన్స్‌, తదితర సేవలను సమీప భవిష్యత్తులో అందించేందుకు కార్యచరణ రూపొందిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly