ఒక్క రోజులో 23 ట‌న్నుల బంగారం కొనుగోళ్ళు

అక్ష‌య‌తృతీయ సంద‌ర్భంగా, భార‌తీయులు ఒక్క రోజులోనే 23 ట‌న్నుల బంగారాన్ని కొనుగోలు చేశారు

ఒక్క రోజులో 23 ట‌న్నుల బంగారం  కొనుగోళ్ళు

ఈ సంవ‌త్స‌రం అక్ష‌య‌తృతీయ సంద‌ర్భంగా ఒక్క‌రోజులో 23 ట‌న్నుల బంగారాన్ని భార‌తీయులు కొనుగోలు చేశార‌ని, గ‌త ఏడాదితో పోలిస్తే నాలుగు ట‌న్నుల బంగారం కొనుగోళ్ళు పెరిగాయ‌ని, భారత బులియన్ అండ్ జ్యూయలర్స్ అసోసియేషన్ (ఐబిజెఏ) జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా తెలిపారు. అక్ష‌య‌తృతీయ రోజున బంగారం క‌నుగోలుకు మంచిద‌ని కొంత‌మంది విశ్వాసం. దీనికి తోడు బంగారం ధ‌ర‌ల త‌గ్గ‌డం కూడా కొనుగోళ్ళు పెరుగుద‌ల‌కు కార‌ణం అంటున్నారు మార్కెట్ నిపుణులు. అయితే వ‌చ్చే నెల‌ల్లో బంగారం ధ‌ర‌లు పెర‌గొచ్చ‌ని, కేడియా క‌మోడిటీ డైరెక్ట‌ర్ అజ‌య్ కేడియా అభిప్రాయ‌ప‌డ్డారు. మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్ (ఎమ్‌సీఎక్స్) లో ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.34,031కి పెరిగింది. అయితే ఆ త‌రువాత బంగారం ధ‌ర‌ల‌లో అధిక స్థాయిలో హెచ్చుత‌గ్గులు న‌మోద‌య్యాయి. అక్ష‌యతృతీయ ముందు రోజు(సోమ‌వారం) ఎమ్‌సీఎక్స్ లో 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.31,563 వ‌ద్ద ముగిసింది. ధ‌ర‌ల‌లో త‌గ్గుద‌ల కార‌ణంగా పెద్దఎత్తున కొనుగోళ్ళు చోటుచేసుకున్నాయి. అక్ష‌య‌తృతీయ రోజు(మంగ‌ళ‌వారం) కొనుగోళ్ళు అధిక స్థాయిలో పెర‌గడంతో, ఆ తరువాతి రోజు(బుధ‌వారం) బంగారం ధ‌ర అధికంగా పెరిగింది. ముంబై బులియ‌న్ మార్కెట్‌లో బుధ‌వారం 22 - క్యారెట్ల 10గ్రాముల బంగారం ధ‌ర రూ.32,700 కాగా చివ‌రి సెస‌న్‌తో పోలిస్తే ఇది రూ.255 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.255 పెరిగి రూ.32,850 స్థాయికి చేరింది. దేశ‌రాజ‌ధాని ధిల్లీలో 3 శాతం వ‌స్తు-సేవ‌ల ప‌న్నుతో క‌లిపి, 22-క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.32,750 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధ‌ర రూ.32,900గా ఉంది. ధిల్లీ మార్కెట్లో రూ.310 పెరుగుద‌ల న‌మోదైంది. కిలో వెండి ధ‌ర రూ.375 పెరిగి రూ.38,395 వ‌ద్ద స్థిర ప‌డింది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly