వ‌న్ నేష‌న్ వ‌న్ కార్డ్ అంటే ఏంటి? ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంది?

ఇక‌పై మీ వ‌ద్ద డ‌జ‌న్ల కొద్ది కార్డుల‌ను పెట్టుకొని తిర‌గాల్సిన అవ‌స‌రం లేకుండా ఒకే కార్డుతో అన్ని ప‌నులు చేసుకోవ‌చ్చు.

వ‌న్ నేష‌న్ వ‌న్ కార్డ్ అంటే ఏంటి? ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంది?

వ‌న్ నేష‌న్ వ‌న్ కార్డ్ అనేది కొత్త మొబిలిటీ కార్డ్‌. ఇది మెట్రో, సబర్బన్ రైల్వేస్, బస్సు, షాపింగ్, న‌గ‌దు ఉపసంహరణ వంటి అన్ని చెల్లింపుల‌కు ఉపయోగప‌డే భారతదేశంలోని మొదటి దేశీయ కార్డు. ఒక్క మాట‌లో చెప్పాలంటే వన్ నేషన్ వన్ కార్డు అన్ని ఇతర కార్డులకు ప్ర‌త్యామ్నాయంగా ప‌నిచేస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కు మీరు ప్ర‌యాణాల‌కు, షాపింగ్‌ల‌కు, ఇత‌ర అస‌రాల‌కు వేర్వేరు కార్డుల‌ను ఉప‌యోగిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు మీరు ఒక న‌గ‌రంలో నివ‌సిస్తున్న‌వార‌నుకుంటే మెట్రోతో పాటు ఇత‌ర ప్ర‌జా ర‌వాణా వాహ‌నాల‌లో ప్ర‌యాణిస్తున్నారనుకుందాం. అప్పుడు దీనికోసం రెండు రకాల కార్డులు అవ‌స‌ర‌ముంటాయి లేదా వ‌రుస‌లో నిల‌బ‌డి టిక్కెట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అదే వ‌న్ నేష‌న్ వ‌న్ కార్డుతో ఈ ఇబ్బందులు ఏమి ఉండ‌వు. ఒకే ఒక్క కార్డుతో దేశం మొత్తం ప్ర‌యాణాలు చేయ‌వ‌చ్చు, షాపింగ్ చేయ‌వ‌చ్చు, న‌గ‌దు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఇంకా ఎక్క‌డ ఏ కార్డు అవ‌స‌ర‌మైనా ఈ కార్డుతో ప‌నైపోతుంది. అన్ని ఆటోమేటిక్ ఫేర్ సిస్ట‌మ్స్ వ‌ద్ద ఇది ప‌నిచేస్తుంది. ప్ర‌యాణాలు చేస్తున్న‌ప్పుడు మీరు కొన్ని ర‌కాల స‌మ‌స్య‌లు ఎదురుకోవ‌చ్చు. అంటే వ‌రుస‌లో నిల‌బ‌డి టిక్కెట్ తీసుకోవ‌డం, మీ వ‌ద్ద న‌గ‌దు ఉంచుకోవాల్సి రావ‌డం, వేర్వేరు కార్డుల‌ను ఉప‌యోగించడం వంటివి. ఒఎన్ఓసీతో ఇలాంటి స‌మ‌స్య‌ ఏముండ‌దు. ఎక్క‌డ ఇబ్బంది ప‌డాల్సిన అవ‌స‌రం లేకుండా హాయిగా ప్ర‌యాణాలు చేసుకోవ‌చ్చు.

వ‌న్ నేష‌న్ వ‌న్ కార్డ్ ఫీచ‌ర్లు, ప్ర‌యోజ‌నాలు:

 • ఇది అన్ని సేవ‌ల‌ను పొందేందుకు ఆటోమేటిక్‌గా ప‌నిచేసే మొబిలిటీ కార్డు
 • బ‌స్సు, రైలు, మెట్రో, పార్కింగ్ ప్లేస్, టోల్ గేట్‌, షాపింగ్‌తో పాటు న‌గ‌దు విత్‌డ్రా కూడా ప‌నిచేసే ఏకైక కార్డు
 • ఈ కార్డుతో స్వైప్ చేసుకునే స‌దుపాయం ఉంటుంది. అంటే మెట్రో స్మార్ట్ కార్డ్ మాదిరిగా క్విక్ పేమెంట్ జ‌రిగిపోతుంది.
 • కార్డు ఈవీఎం టెక్నాల‌జీతో కూడిన భ‌ద్ర‌త ఉంటుంది. చిప్ కార్డుతో పేమెంట్ చేస్తే ఎలాంటి సైబ‌ర్ నేరాల‌కు భారీన ప‌డే అవ‌కాశం ఉండ‌దు.
 • ఓపెన్ లూప్ కార్డ్ కావ‌డంతో పీఓఎస్, ఏటీఎం మిష‌న్ల విద్ద కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు.
 • ఆఫ్‌లైన్‌లో కార్డుతో వేగంగా చెల్లింపులు చేయ‌వ‌చ్చు.
 • నెల‌వారి పాస్‌లు, టిక్కెట్లు, ఇత‌ర కార్డుల‌కు బ‌దులుగా ఈ కార్డును ఉప‌యెగించ‌వ‌చ్చు.
 • ప్ర‌యాణాలు చేసేవారు కూడా దీనిని ప్రీపెయిడ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డుగా ఉప‌యోగించ‌వ‌చ్చు. దీనికి ఎస్‌బీఐ, పీఎన్‌బీ వంటి 25 బ్యాంకుల భాగ‌స్వామ్యం ఉంది.
 • అదేవిధంగా ఈ కార్డుల‌పై కొనుగోళ్ల‌కు 10 శాతం క్యాష్‌బ్యాక్, విదేశాల్లో ఏటీఎంల వ‌ద్ద ఉప‌యోగిస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది.
 • అంత‌ర్జాతీయంగా కొనుగోళ్ల‌కు ఏటీఎంల నుంచి న‌గ‌దు విత్‌డ్రా చేసుకునేందుకు కూడా ప‌నికొస్తుంది.

వ‌న్ నేష‌న్ వ‌న్ కార్డును ఎంచుకున్నారా?

వ‌న్ నేష‌న్ వ‌న్ కార్డ్‌తో ప్ర‌యాణాలు సుల‌భం అవుతాయి. వ‌రుస‌లో నిల‌బ‌డి టిక్కెట్లు తీసుకునే స‌మ‌స్య ఉండ‌దు. స‌మ‌యం ఆదా అవుతుంది. మీరు త‌రుచుగా ప్ర‌యాణాలు చేసేవారైతే లేదా ప్ర‌యాణాలు ఇష్ట‌ప‌డేవారైతే క‌చ్చితంగా ఈ కార్డు తీసుకోవాల్సిందే. ఈ కార్డు మెట్రోతో పాటు ఇత‌ర ప్ర‌యాణాలకు కూడా ప‌నికొస్తుంది. ఇది డెబిట్ కార్డు మాదిరిగా కూడా ప‌నిచేస్తుంది. న‌గ‌దు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు, షాపింగ్ చేసేట‌ప్పుడు రిటైల్ దుకాణాల్లో ఉప‌యోగించ‌వ‌చ్చు.

వ‌న్ నేష‌న్ వ‌న్ కార్డుకి ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి?

వ‌న్ నేష‌న్ వ‌న్ కార్డ్ రూపే డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వంటిది. ఎస్‌బీఐ తో స‌హా 25 బ్యాంకులు ఈ కార్డును అందిస్తున్నాయి. పేటీఎం స‌దుపాయం కూడా ఉంటుంది. ప్ర‌స్తుతం దీనికోసం ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం లేదు. మీ బ్యాంకును సంప్ర‌దించి ఈ కార్డును తీసుకోవ‌చ్చు. మొద‌ట ఈ కార్డును ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ త‌ర్వాత గ్రామీణ ప్రాంతాల‌కు విస్త‌రించనున్నారు. ఇది కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న ప్ర‌తిష్ఠాత్మ‌క నిర్ణ‌యంగా చెప్తున్నారు. దీంతో న‌గ‌దు ర‌హిత లావాదేవీలు పెర‌గ‌డంతో ప్ర‌యాణాల‌కు సుల‌భంగా ఉంటుంది.

వ‌న్ నేష‌న్ వ‌న్ కార్డు కొత్త మొబిలిటీ కార్డు . దేశంలో అన్ని సేవ‌ల‌ను పొందేందుకు ఉప‌యోగించే ఏకైక కార్డు. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే వాలెట్‌లో డ‌జ‌న్ల కొద్ది కార్డుల‌కు బ‌దులుగా ఒక్క కార్డుతో అన్ని ప‌నుల‌ను చేసుకోవ‌చ్చు. ఈ కింద ఇచ్చిన ఉదాహ‌ర‌ణ‌తో కార్డు గురించి పూర్తిగా అర్థం చేసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం…

ఇప్పుడు మీరు అన్ని అవ‌స‌రాల కోసం ర‌కార‌కాల కార్డుల‌ను ఉప‌యోగిస్తుండ‌వ‌చ్చు. రైలు ప్ర‌యాణాల‌కు, ఇత‌ర ప్ర‌యాణాల‌కు వేర్వేరు కార్డులు అవ‌స‌ర‌ముంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు మీరు ముంబ‌యిలో నివ‌సిస్తుంటే ముంబ‌యి మెట్రోతో పాటు ఇత‌ర వాహ‌నాల‌లో ప్ర‌యాణిస్తున్నార‌నుకుందాం. దీనికోసం మెట్రో కార్డుతో పాటు ఏటీవీఎం స్మార్ట్ కార్డు కొనుగోలు చేయాలి లేదా వ‌రుస‌లో నిల‌బ‌డి టిక్కెట్లు తీసుకోవాలి. వ‌న్ నేష‌న్ వ‌న్ కార్డ్ ఈ స‌మ‌స్య‌కు చెక్ పెడుతుంది. వీటికి ప్ర‌త్యామ్నాయంగా ఒకే ఒక్క కార్డుతో దేశ‌మంతా ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. ఇది ఆటోమేటిక్‌గా ప‌నిచేస్తుంది.

“వ‌న్ నేష‌న్ వ‌న్ కార్డును ఇటీవ‌ల‌న దేశ ప్రధాని న‌రేంద్ర‌మోదీ ప్రారంభించారు. దీనిని నేష‌న‌ల్ కామ‌న్ మొబిలిటీ కార్డ్ అని కూడా అంటారు.మేక్ ఇన్ ఇండియా కార్య‌క్ర‌మంలో భాగంగా నేష‌న‌ల్ పేమెంట్ కార్పొరేష‌న్‌తో క‌లిపి ఈ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చారు.”

వ‌న్ నేష‌న్ వ‌న్ కార్డ్ అనేది జీఎస్‌టీ వంటిది. అన్ని ప‌రోక్ష ప‌న్నుల‌న్నింటిని ఏక‌తాటిపైకి తీసుకొస్తూ ప్ర‌భుత్వం జీఎస్‌టీని ఎలా ప్ర‌వేశ‌పెట్టిందో అదేవిధంగా ప‌లు ర‌కాల కార్డుల‌కు బ‌దులుగా ఒకే ఒక్క కార్డును ఉప‌యోగించేలా ఈ కార్డును ఆవిష్క‌రించింది. దీంతో ప్ర‌యాణాలు, పార్కింగ్, కొనుగోళ్లు , న‌గ‌దు విత్‌డ్రా ఇలా ఇప్ప‌టివ‌ర‌కు దేనికోసం అయితే కార్డులు ఉప‌యోగిస్తున్నారో వాటికి బ‌దులుగా వ‌న్ నేష‌న్ వ‌న్ కార్డ్ ఉంటే స‌రిపోతుంది. అన్నింటికీ ఒకే కార్డును ఉప‌యోగించ‌డ‌మే ల‌క్ష్యంగా దీనిని అందుబాటులోకి తెచ్చారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly