మ‌రింత క్షీణిస్తోన్న మార్కెట్లు

సెన్సెక్స్‌ 369పాయింట్లు కోల్పోయి 36,649 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ 111 పాయింట్లు నష్టపోయి 10,868 వద్ద కొనసాగుతోంది.

మ‌రింత క్షీణిస్తోన్న మార్కెట్లు

నేడు మార్కెట్లు భారీ న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు న‌ష్ట‌పోగా, నిఫ్టీ 10,900 దిగువ‌కు చేరింది. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ కూడా బ‌ల‌హీన‌డ‌పడి రూ.69.25 వ‌ద్ద కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం నిఫ్టీలో అన్ని రంగాల షేర్లు న‌ష్టాల‌తో కొన‌సాగుతున్నాయి. లోహ‌, ఆటో, ఇన్‌ఫ్రా, ఎఫ్ఎంసీజీ, ఇంధ‌న‌, ఫార్మా రంగాల షేర్లు భారీగా క్షీణిస్తున్నాయి.

బలహీన ఆర్థిక గణాంకాలకు తోడు… విదేశీ మదుపర్లు విక్రయాలు కొనసాగించడం, నిరుత్సాహకర త్రైమాసిక ఫలితాలు సెంటిమెంటును దెబ్బతీశాయని ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు. ఇక యూఎస్‌ఫెడరల్‌ రిజర్వ్‌ దశాబ్దకాలంలోనే తొలిసారిగా రుణ రేట్లను పావు శాతం మేర కోత వేసి 2.0-2.5 శాతానికి పరిమితం చేసింది. అయితే ఈ రేట్ల కోతకు ఇదే ప్రారంభమని… మరిన్ని కోతలు భవిష్యత్‌లో ఉంటాయని పేర్కొనడం… అంతర్జాతీయ మార్కెట్లను నష్టాల పాలుచేసింది. కంపెనీల త్రైమాసిక ఫ‌లితాల‌పై మ‌దుప‌ర్లు దృష్టి వ‌హించ‌నున్నారు. ఆసియా మార్కెట్లు న‌ష్టాల‌తో కొన‌సాగుతున్నాయి.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly