లాభాల‌తో ట్రేడింగ్ ప్రారంభం

ప్ర‌స్తుతం సెన్సెక్స్ 236 పాయింట్ల లాభంతో 37,564 వ‌ద్ద‌, నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో 11,086 వ‌ద్ద ట్రేడ‌వుతున్నాయి.

లాభాల‌తో ట్రేడింగ్ ప్రారంభం

దేశీయ మార్కెట్లు నేడు లాభాల‌తో ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ 150 పాయింట్లు లాభ‌ప‌డ‌గా, నిఫ్టీ 50 పాయింట్లు పైకి చేరింది. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.70.55 వ‌ద్ద కొనసాగుతోంది. ఐటీ మిన‌హాయించి అన్ని రంగాల షేర్లు లాభ‌ప‌డుతున్నాయి.

క్రితం భారీ లాభాల‌ను న‌మోదు చేసిన మార్కెట్లు నేడు కూడా జోరుగా ట్రేడ‌వుతున్నాయి. ఎఫ్‌పీఐలపై పన్ను సర్‌ఛార్జీ విధింపు ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవచ్చన్న వార్తలు మార్కెట్ వ‌ర్గాల‌ను ఉత్సాహ‌ప‌రిచాయి. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ)ను సైతం సమీక్షించొచ్చన్న అంచనాలతో భారీగా కొనుగోళ్లకు ముందుకు రావడంతో మార్కెట్లు లాభ‌ప‌డుతున్నాయి. ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలు కూడా క‌లిసొచ్చాయి.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly