న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్లు

సెన్సెక్స్ ప్ర‌స్తుతం 203 పాయింట్ల న‌ష్టంతో 36,343 పాయింట్ల వ‌ద్ద‌, నిఫ్టీ 53 పాయింట్ల న‌ష్టంతో 10,890 వ‌ద్ద న‌మోద‌వుతున్నాయి.

న‌ష్టాల‌తో  ప్రారంభ‌మైన  మార్కెట్లు

దేశీయ మార్కెట్లు ఈరోజు స్వ‌ల్ప న‌ష్టాల‌తో ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ 52 పాయింట్ల న‌ష్టంతో 36,493 వ‌ద్ద‌, నిఫ్టీ 36 పాయింట్ల న‌ష్టంతో 10,906 వ‌ద్ద ప్రారంభ‌మ‌య్యాయి. నేడు డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.71.23 వ‌ద్ద కొన‌సాగుతోంది. డాక్ట‌ర్ రెడ్డీస్ షేర్లు 4 శాతం ప‌డిపోయాయి.

అంతర్జాతీయ సంకేతాలు, దేశీయ ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. దేశీయంగా చూస్తే… 12న పారిశ్రామికోత్పత్తి, రిటైల్‌ ద్రవ్యోల్బణం, 13న టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్నాయి. కంపెనీల‌ మూడో త్రైమాసిక ఫలితాలపై మదుపర్లు దృష్టి పెట్టనున్నారు. ముడిచమురు ధరలు, డాలర్‌తో రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ, డీఐఐల పెట్టుబడుల ధోరణి నుంచి మదుపర్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. అంతర్జాతీయంగా చూస్తే… అమెరికా- చైనా వాణిజ్య పరిణామాలు కీలకం కానున్నాయి.

నిఫ్టీలో ప్ర‌స్తుతం టాటా స్టీల్, సిప్లా, కోట‌క్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా లాభ‌ప‌డుతున్నాయి. ఇండియాబుల్స్ హౌసింగ్, మ‌హింద్రా అండ్ మ‌హీంద్రా, హీరో మోటోకార్ప్, డాక్ట‌ర్ రెడ్డీస్ షేర్లు న‌ష్ట‌పోతున్నాయి.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly