లాభాల‌తో కొన‌సాగుతోన్న మార్కెట్లు

ప్ర‌స్తుతం సెన్సెక్స్ 145 పాయింట్ల లాభంతో ట్రేడ‌వుతుండ‌గా, నిఫ్టీ 35 పాయింట్లు లాభ‌ప‌డింది

లాభాల‌తో కొన‌సాగుతోన్న మార్కెట్లు

దేశీయ మార్కెట్లు బుధ‌వారం ఫ్లాట్‌గా ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ 52 పాయింట్ల లాభంతో 37,198 వ‌ద్ద‌, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 11,012 వ‌ద్ద ప్రారంభ‌మ‌య్యాయి. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.71.84 వ‌ద్ద కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం లోహ‌, ఆటో, ఫార్మా, బ్యాంక్, ఇన్‌ఫ్రా రంగాల షేర్లతో కొనుగోళ్లు క‌న‌బ‌డుతుండ‌గా, ఇంధ‌న‌, ఐటీ రంగాల షేర్లు న‌ష్ట‌పోతున్నాయి.

ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాల‌తో ప్ర‌స్తుతం మార్కెట్లు లాభాల‌తోనే కొన‌సాగుతున్నాయి. ప్ర‌భుత్వం జీడీపీ వృద్ధిపై దృష్టి సారించిన‌ట్లు ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామ‌న్ వ్యాఖ్య‌లు కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగించాయి. అయితే ఫిచ్ రేటింగ్, ప్ర‌స్తుత సంవ‌త్స‌రానిక దేశ జీడీపీ అంచ‌నాను 6.8 శాతం నుంచి 6.6 శాతానికి త‌గ్గించ‌డంతో మ‌దుప‌ర్లు కొంత అప్ర‌మ‌త్త‌త వ‌హించే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly