న‌ష్టాల‌తో ట్రేడింగ్ ప్రారంభం

మ‌దుప‌ర్లు లాభాల స్వీక‌ర‌ణ‌కు మొగ్గుచూపుతుంటంతో నేడు మార్కెట్లు న‌ష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి.

న‌ష్టాల‌తో  ట్రేడింగ్   ప్రారంభం

దేశీయ మార్కెట్లు బుధ‌వారం న‌ష్టాల‌తో ట్రేడింగ్ ప్రారంభించాయి. వ‌రుస‌గా మూడు రోజులు లాభ‌ప‌డిన సూచీలు నేడు న‌ష్టాల బాట ప‌ట్టాయి. నేడు సెన్సెక్స్ 141 పాయింట్ల న‌ష్టంతో 39,808 వ‌ద్ద‌, నిఫ్టీ 45 పాయింట్ల న‌ష్టంతో 11,920 వ‌ద్ద ప్రారంభ‌మయ్యాయి. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.69.45 వ‌ద్ద కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం ఐటీ, ఫార్మా, ఆటో, బ్యాంకింగ్, ఇన్ఫ్రా రంగాల షేర్లు న‌ష్ట‌పోతున్నాయి.

ఏప్రిల్, మే నెల‌ల‌కు సంబంధించిన రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం, పారిశ్రామికోత్ప‌త్తి వృద్ధి గ‌ణాంకాలు నేడు వెల్ల‌డికానున్న నేప‌థ్యంలో మ‌దుప‌ర్లు అప్ర‌మ‌త్త‌త వ‌హిస్తున్నారు. ఆసియా మార్కెట్లు న‌ష్టాల‌తో కొన‌సాగుతుండ‌టంతో ఆ ప్ర‌భావం దేశీయ మార్కెట్ల‌పైనా ప‌డింది. నిఫ్టీలో ప్ర‌స్తుతం టాటా స్టీల్, వేదాంతా, ఏషియ‌న్ పేయింట్స్, గెయిల్ ఇండియా షేర్లు లాభ‌ప‌డుతున్నాయి. మ‌రోవైపు ఇండియాబుల్స్ హౌసింగ్, య‌స్ బ్యాంక్, భార‌తీ ఇన్‌ఫ్రాటెల్, ఎయిర్‌టెల్ షేర్లు న‌ష్ట‌పోతున్నాయి.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly