నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభం
సూచీలు నేడు నష్టాలతో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 178, నిఫ్టీ 65 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి.
దేశీయ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. వరుస సెలవుల తర్వాత నేడు ట్రేడవుతోన్న మార్కెట్లు నెమ్మదించాయి. మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపకపోవడంతో నష్టపోతున్నా యి. సెన్సెక్స్ ప్రారంభంలోనే 100 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 11,100 దిగువకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.71.14 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం ఇంధన రంగం మినహాయించి అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. బక్రీద్, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ వారం మార్కెట్లు మూడు రోజులే పనిచేయనున్నాయి. రిటైల్, టోకు ద్రవ్యల్బోణం గణాంకాలపై మదుపర్లు దృష్టివహించారు. ఆగస్ట్ నెలలో ఇప్పటివరకు రూ.9,197 కోట్ల విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలు జరిగాయన్న సమాచారం కొంత నిరుత్సాహపరిచింది. ఆసియా మార్కెట్లు నష్టాలతో కొనసాగుతోన్నాయి.
సిరి లో ఇంకా
మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్
Comments
0