తిరిగి 12,200 పైకి చేరిన నిఫ్టీ

దేశీయ సూచీలు నేడు లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు తిరిగి కీల‌క పాయింట్ల‌కు చేరుకున్నాయి

తిరిగి 12,200 పైకి చేరిన నిఫ్టీ

దేశీయ మార్కెట్లు వారాంతంలో లాభ‌ప‌డుతున్నాయి. నేడు సెన్సెక్స్ 167 పాయింట్ల లాభంతో 41,626 వ‌ద్ద‌, నిఫ్టీ 49 పాయింట్ల లాభంతో 12,223 వ‌ద్ద ప్రారంభ‌మ‌య్యాయి. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.71.30 వ‌ద్ద కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం అన్ని రంగాల షేర్లు లాభ‌ప‌డుతున్నాయి.

క్రితం న‌ష్టాల‌తో ముగిసిన మార్కెట్లు ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాల‌తో లాభాల‌ను న‌మోదు చేస్తున్నాయి. నేడు టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణ గ‌ణాంకాలు వెల్ల‌డికానున్న నేప‌థ్యంలో మ‌దుప‌ర్లు దానిపై దృష్టి వ‌హించారు. డిసెంబ‌ర్ త్రైమాసికంలో విదేశీ ప్ర‌త్యక్ష పెట్టుబ‌డులు పెరిగిన‌ట్లు స‌మాచారం రావ‌డం మార్కెట్ల‌కు కొంత క‌లిసొచ్చే అంశంగా మారింద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly