స్త‌బ్దుగా కొన‌సాగుతోన్న మార్కెట్లు

దేశీయ సూచీలు నేడు ప్రారంభంలో కాస్త ఒత్తిడికి గుర‌వుతున్నాయి. నిఫ్టీ 10,600 స్థాయి వ‌ద్ద కొన‌సాగుతోంది.

స్త‌బ్దుగా కొన‌సాగుతోన్న మార్కెట్లు

మంగ‌ళ‌వారం మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ 6 పాయింట్ల లాభంతో 35,360 వ‌ద్ద, నిఫ్టీ 8 పాయింట్ల న‌ష్టంతో 10,619 వ‌ద్ద న‌మోద‌య్యాయి. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.70.89 వ‌ద్ద కొన‌సాగుతోంది. ఐటీ, ఫార్మా రంగాల షేర్లు లాభ‌ప‌డుతున్నాయి. లోహ రంగ షేర్లు న‌ష్ట‌పోతున్నాయి.

మదుపర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో క్రితం భారీ లాభాల‌తో ముగిసిన మార్కెట్లు నేడు స్త‌బ్దుగా కొన‌సాగుతున్నాయి. ఆసియా మార్కెట్ల ప్ర‌తికూల సంకేతాల‌తో ఒడుదొడుకుల‌కు లోన‌వుతున్నాయి. సెప్టెంబ‌ర్ త్రైమాసికంలో దేశ జీడీపీ 7.5-7.6 శాతానికి నెమ్మ‌దించ‌వ‌చ్చ‌ని ఎస్‌బీఐ నివేదిక తెల‌ప‌డంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బ‌తినే అవ‌కాశ‌ముంది.

నిఫ్టీలో ప్ర‌స్తుతం య‌స్ బ్యాంక్, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్, డాక్ట‌ర్ రెడ్డీస్ షేర్లు లాభ‌ప‌డుతున్నాయి. మ‌రోవైపు జేఎస్‌డ‌బ్ల్యూ స్టీల్‌, బజాజ్ ఆటో, వేదాంతా, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ షేర్లు న‌ష్ట‌పోతున్నాయి.

సిరి లో ఇంకా
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly