మ్యూచువ‌ల్ ఫండ్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు పాన్ అప్‌డేట్ త‌ప్ప‌నిస‌రి

పెట్టుబ‌డుదారులు మ్యూచువ‌ల్ ఫండ్ వెబ్‌సైట్ లేదా ఆర్‌టీఏల‌ ద్వారా ఫోలియోలో పాన్ అప్‌డేట్‌ చేయ‌వ‌చ్చు

మ్యూచువ‌ల్ ఫండ్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు పాన్ అప్‌డేట్ త‌ప్ప‌నిస‌రి

పెట్టుబ‌డుదారులు మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రించుకునేందుకు పాన్ అప్‌డేట్ చేసుకోవ‌డం యాంఫీ త‌ప్ప‌నిస‌రి చేసింది . తాజాగా సెబీ జ‌రిపిన ప‌రిశోధ‌న‌లో చాలావ‌రకు మ్యూచువ‌ల్ ఫండ్లు, రిజిస్ర్టార్ అండ్ ట్రాన్స్‌ఫ‌ర్ ఏజెంట్స్ (ఆర్‌టీఏ) పాన్ వివ‌రాలు అప్‌డేట్ చేయ‌కుండానే ఉప‌సంహ‌ర‌ణ ప్రాసెసింగ్ చేసిన‌ట్లు గుర్తించడంతో ఈ నిర్ణ‌యం తీసుకుంది.

పాన్ అప్‌డేట్ చేసుకునేందుకు పెట్టుబ‌డుదారులు మ్యూచువ‌ల్ ఫండ్ వెబ్‌సైట్ , ఆర్‌టీఏ ద్వారా లేదా ప‌త్రాల‌ను నేరుగా ఇవ్వాల‌నుకుంటే మ్యూచువ‌ల్ ఫండ్ కార్యాల‌యంలో, ఇన్వెస్ట‌ర్ స‌ర్వీస్ సెంట‌ర్‌లో పాన్ అందించాల్సి ఉంటుంది. క్యామ్స్, కార్వీ వంటి ఆర్‌టీఏలు కూడా ఆన్‌లైన్‌లో పాన్ వివ‌రాల‌ను అందించేందుకు, అప్‌డేట్ చేసేందుకు అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నాయి.

సంబంధిత AMC ని ఎంచుకుని, ఫోలియో నంబర్‌ను అందించడం ద్వారా పెట్టుబడిదారులు లాగిన్ అవ్వవచ్చు. నిర్ధార‌ణ‌ కోసం పుట్టిన తేదీ లేదా డిఫాల్ట్ బ్యాంక్ నంబర్ కూడా ఇవ్వాలి. పాన్ వివ‌రాల‌ను అప్‌లోడ్ చేయాలి. ఇమేజ్ ఫైల్ 1MB మించకూడదు. పాన్ నవీకరించబడటానికి ముందు సంతకం RTA తో ధృవీకరణ జ‌రుగుతుంది. ఇది పూర్తయిన తర్వాత పెట్టుబడిదారుడికి తెలియజేస్తారు. పెట్టుబడిదారుడు పెట్టుబడులు పెట్టే ప్రతి మ్యూచువల్ ఫండ్ కోసం ఇది ఒక్కొక్కటిగా చేయవలసి ఉంటుంది.

కేవైసీ రిజిస్ర్టేష‌న్ ఏజెన్సీ (KRA) అంటే Cams, Karvy వంటి ఏజెన్సీల ద్వారా KYC/KYC change request form లో వివ‌రాల‌ను అప్‌డేట్ చేయ‌డం ద్వారా సుల‌భంగా కేవైసీ లేదా పాన్ అప్‌డేట్ చేసుకోవ‌చ్చు. ఆర్‌టీఏలు పాన్ లేదా కేవైసీ వివ‌రాల‌ను KRA ద్వారా తీసుకొని అన్ని మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఈ వివ‌రాల‌ను అప్‌డేట్ చేస్తాయి.

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు ప్రారంభించిన‌ప్పుడే కేవైసీ కోసం పాన్ వివ‌రాలు అందించాల్సి ఉంటుంది. అయితే కొన్ని కేట‌గిరీల‌కు చెందిన పెట్టుబ‌డుదారుల‌కు పాన్ మిన‌హాయింపు ఉంది. సంవ‌త్స‌రానికి రూ.50 వేలు పెట్టుబ‌డులు పెట్టేవారు పాన్ వివ‌రాలు అందించాల్సిన అవ‌స‌రం లేదు. పాన్‌కు బ‌దులుగా ఇత‌ర దృవీక‌ర‌ణ ప‌త్రాలు అందిస్తే పాన్ మిన‌హాయింపుతో కూడిన‌ కేవైసి రిఫ‌రెన్స‌న్ నంబ‌ర్ (PEKRN) వారికి కేటాయిస్తారు.

https://www.livemint.com/mutual-fund/mf-news/update-pan-details-to-redeem-mutual-fund-investments-1569307009773.html

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly