పాన్ ఎవ‌రికి అవ‌స‌రం.. ఎవ‌రికి కాదు ?

భారతదేశంలో పన్ను చెల్లించాల్సిన వారందరు, మైనర్లు, విదేశీయులు కూడా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు

పాన్ ఎవ‌రికి అవ‌స‌రం.. ఎవ‌రికి కాదు ?

పన్ను చెల్లింపుదారులకు లేదా ఆదాయపు పన్ను మదింపుదారులకు ప్రత్యేకమైన గుర్తింపు కార్డుగా ప‌ది అంకెల సంఖ్య‌ను ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. భారతదేశంలో పన్ను చెల్లించాల్సిన వారందరూ, మైనర్, విదేశీయులు కూడా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ప‌న్ను చెల్లింపుదారుల వివ‌రాలు, టీడీఎస్‌, టీసీఎస్ క్రెడిట్స్‌, ఆదాయం, లావాదేవీలు వంటివి పాన్ ద్వారా ఆదాయ ప‌న్ను శాఖ ట్రాక్ చేస్తుంది. ఇది మీ సమాచారాన్ని సులభంగా తిరిగి పొందటానికి, వివిధ పెట్టుబడులు, రుణాలు, ఇతర వ్యాపార కార్యకలాపాలను గురించి తెలుసుకునేందుకు వీలు కల్పిస్తుంది.

పాన్ కార్డ్ ఎప్పుడు అవ‌స‌రం?

  1. మీరు ఏదైనా ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించేందుకు లేదా ఆదాయపు పన్ను రిటర్నులను (ఐటిఆర్) దాఖలు చేసేందుకు అవ‌స‌రం.
  2. ఏదైనా వ్యాపారం లేదా వృత్తి ద్వారా వ‌చ్చే ఆదాయం రూ.5 ల‌క్ష‌లు దాటితే పాన్ అవ‌స‌రం.
  3. వీటితో పాటు, పాన్ తప్పనిసరి అయిన సంద‌ర్భాలు కొన్ని ఉంటాయి. కారు అమ్మడం లేదా కొనడం, బ్యాంక్ ఖాతా లేదా డీమాట్ ఖాతా తెరవడం, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం, హోటల్ లేదా రెస్టారెంట్ బిల్లు రూ. 50,000 కంటే ఎక్కువ నగదు చెల్లించడం, విదేశీ కరెన్సీ లేదా మ్యూచువల్ కొనుగోలు వంటివి.

పాన్ ఎవ‌రికి అవ‌స‌రం లేదు?

  1. మైనర్లకు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోతే వారి తండ్రి, తల్లి లేదా సంరక్షకుడి పాన్ ఇవ్వ‌వ‌చ్చు.
  2. కొన్ని సందర్భాల్లో, ఎన్ఆర్ఐలు లావాదేవీలు చేస్తున్నప్పుడు కూడా పాన్ కార్డు అవ‌స‌రం లేదు.
  3. మీ ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చే పరిమితి కంటే తక్కువగా ఉంటే, మీకు పాన్ కార్డు అవసరం లేదు. బ్యాంక్ ఖాతా తెరవడం, రూ. 50,000 కంటే ఎక్కువ మ్యూచువ‌ల్ ఫండ్లను కొనుగోలు చేయ‌డం కొనడం వంటి నిర్దిష్ట లావాదేవీలను నిర్వహించడానికి, మీరు పాన్ కార్డును కలిగి లేరని ప్రకటించే ఫారం 60 పై సంతకం చేయవచ్చు.

పాన్‌కు బ‌దులుగా ఆధార్‌
సెప్టెంబ‌ర్ 2019 నుంచి ఆదాయ ప‌న్ను శాఖ పాన్‌కు బ‌దులుగా ఆధార్ ప్ర‌త్యామ్నాయాన్ని తీసుకొచ్చింది. ఒక‌వేళ మీకు పాన్ లేక‌పోతే ఆదాయ ప‌న్ను రిట‌ర్నుల‌కు ఆధార్‌ను ఇవ్వొచ్చు. అప్పుడు ఆటోమేటిక్‌గా వారికి పాన్ ల‌భిస్తుంది. అంతేకాకుండా పాన్ అవ‌స‌ర‌మైన చోట ఎక్క‌డైనా ఆధార్ ఉప‌యోగించ‌వ‌చ్చు. అయితే దీనికి పాన్‌-ఆధార్ అనుసంధానం చేసి ఉండాల‌న్న సంగ‌తి గుర్తుంచుకోండి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly