మహిళల సాధికారత గురించి పాన్ డేటా ఏం సూచిస్తుంది?

గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం ముగిసేనాటికి 435.2 మిలియ‌న్ల ప్ర‌జ‌లు పాన్ క‌లిగి ఉన్నారు

మహిళల సాధికారత గురించి పాన్ డేటా  ఏం సూచిస్తుంది?

ఆర్థిక వ్య‌వ‌హ‌రాల్లో మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం పెరుగ‌తుంద‌ని చెప్ప‌డానికి పాన్ కార్డ్ కూడా ఒక ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు. ఆర్థిక లావాదేవీల‌కు త‌ప్ప‌నిస‌రి అయిన పాన్ కార్ట్‌ను ఇప్ప‌డు చాలా మంది మ‌హిళ‌లు తీసుకుంటున్నారు. దీని అర్థం ఆర్థిక లావాదేవీల్లో వారు చురుకుగా పాల్గొంటున్నారు.

ఆదాయ ప‌న్ను శాఖ నుంచి సేక‌రించిన స‌మాచారం ప్ర‌కారం పాన్ కార్డ్ పొందే మ‌హిళ‌ల సంఖ్య పురుషుల సంఖ్య కంటే కూడా వేగంగా పెరుగుతోంది. మార్చి 2019 తో ఆర్థిక సంవ‌త్స‌రంలో 31.3 మిలియ‌న్ల మ‌హిళ‌లు పాన్ కార్డు పొందారు. గ‌తేడాది న‌మోదైన 9.2 మిలియ‌న్ల‌తో పోలిస్తే ఇది 240 శాతం ఎక్కువ‌. అదేకాలంలో 34.5 మిలియ‌న్ల పురుషులు పాన్ కార్డ్ తీసుకున్నారు. అంత‌క్రితం ఏడాది న‌మోదైన 11 మిలియ‌న్ల‌తో పోలిస్తే 213 శాతం ఎక్కువ‌.

గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా పాన్ కార్డు పొందుతున్న మ‌హిళ‌ల సంఖ్య పెరుగ‌తూ వ‌స్తుంది. 2017 లో 34.63 శాతం కాగా, 2018 లో 35.3 శాతం. 2019 లో 37.16 శాతానికి పెరిగింది. అయితే పురుషుల సంఖ్య త‌గ్గుతుండ‌టం గ‌మ‌నార్హం. 2017 లో 65.37 శాతం నుంచి 2019 లో 62.84 శాతానికి తగ్గింది.

ఆదాయ ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేందుకు పాన్ అవ‌స‌రం. అంటే పెరుగుతున్న పాన్ కార్డు జారీ విధానాన్ని చూస్తే ఆర్థిక వ్య‌వ‌హారాల్లో మ‌హిళ‌ల పాత్ర పెరుగుతుంన్న‌ది తెలుస్తోంది. ఐటీ రిట‌ర్నుల‌తో పాటు, బ్యాంకు లావాదేవీలు , డెబిట్, క్రెడిట్ కార్డులు జారీ చేసేందుకు, చెల్లింపుల‌కు పాన్ అవ‌స‌రం. రూ.50 వేల కంటే ఎక్క‌వ లావాదేవీల‌కు , ఫారిన్ ఎక్స్‌ఛేంజ్, హోట‌ల్ బిల్లు చెల్లింపుల‌కు పాన్ త‌ప్ప‌నిస‌రి. అయితే పొదుపు ఖాతా తెరిచేందుకు పాన్ అవ‌స‌రం లేదు.

ఆడపిల్లలను ఆర్థిక విష‌యాల్లో కీల‌క పాత్ర పోషించే విధంగా కేంద్ర ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తుంది. దీనికి అనుగుణంగా వారికి విద్యావ‌కాశాల‌ను చేరువ చేస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly